Puneth Raj Kumar: అప్పు నటించిన వైల్డ్‌లైఫ్ డాక్యుమెంటరీ…గంధడ గుడి టీజర్ రిలీజ్.. విజువల్ ట్రీట్
Puneth Raj Kumar: దివంగత కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్‌కుమార్ .. మంచి నటుడు మాత్రమే కాదు.. సమాజ సేవకుడు.. ప్రకృతి ప్రేమికుడు అన్న సంగతి తెలిసిందే.. తాజాగా..
Puneth Raj Kumar: దివంగత కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్‌కుమార్ .. మంచి నటుడు మాత్రమే కాదు.. సమాజ సేవకుడు.. ప్రకృతి ప్రేమికుడు అన్న సంగతి తెలిసిందే.. తాజాగా అప్పు ఎంతో ఇష్టపడి నటించిన ప్రకృతికి సంబంధించిన డాక్యుమెంటరీ టీజర్ సోమవారం రిలీజ్ అయింది. పునీత్ తల్లి పార్వతమ్మ రాజ్‌కుమార్ జన్మదినోత్సవం సందర్భంగా ఈ టీజర్ ను యూనిట్ విడుదల చేసింది. ఈ ప్రాజెక్ట్ పునీత్ డ్రీమ్ ప్రాజెక్ట్‌గా పేర్కొన్నారు. ఇక ఈ టీజర్ ప్రకృతి ప్రేమికులకు విజువల్ ట్రీట్‌ను ఇస్తుంది.
ఈ డాక్యుమెంటరీ కర్ణాటక అడవులు, సుందరమైన బీచ్‌లు , నదీనదాల అందాలను.. ప్రకృతిలోని ప్రపంచాన్ని అన్వేషిస్తుంది. కర్నాటక అడవుల్లో పరిరక్షణ కోసం సుప్రసిద్ధ వన్యప్రాణి చిత్రనిర్మాత అమోఘవర్ష జెఎస్‌తో పునీత్ జతకట్టారు. పునీత్ నటిస్తున్న ఈ డాక్యుమెంటరీ చాలా కాలంగా రూపొందుతోంది.
ఈ డాక్యుమెంటరీకి గంధడ గుడి అనే పేరు పెట్టారు. గంధడ గుడి అంటే గంధపు చెక్కల గుడి అని అర్ధం. అంతేకాదు గంధడ గుడి టైటిల్ తో అప్పు తండ్రి దివంగత యాక్టింగ్ లెజెండ్ డాక్టర్ రాజ్‌కుమార్ సినిమా కూడా చేశారు. 1973 లో గంధడ గుడి బ్లాక్‌బస్టర్ సినిమా. పునీత్ తన సొంత రాష్ట్రం కర్ణాటక గురించి రాష్ట్రంలోని అందాల గురించి ఇతర రాష్ట్ర ప్రజలకు తెలియజేయడానికి అనేక ప్రాజెక్టులను చేపట్టాడు. వాటిల్లో ఒకటి ‘గంధడ గుడి’. వచ్చే ఏడాది సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఇక గంధడ గుడి డాక్యుమెంటరీ కర్ణాటకలోని అరణ్యాల పవిత్రతను, సంపదను రక్షించడం వంటి ప్రాముఖ్యతను వివరిస్తోంది. ఈ టీజర్ ని రిలీజ్ చేసిన అమోఘవర్ష .. “అప్పు కల, ఒక అద్భుతమైన ప్రయాణం, మా భూమి విశిష్టత గురించి తెలియజేసే ఒక పురాణం.. గంధడ గుడి” అని ట్వీట్ చేశారు.2019లో అమోఘవర్ష రూపొందించిన వైల్డ్ డాక్యుమెంటరీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అప్పుడు ఈ వైల్డ్ డాక్యుమెంటరీని తోటి వన్యప్రాణి చిత్రనిర్మాత కళ్యాణ్ వర్మతో కలిసి రూపొందించాడు.
Also Read: శ్రీవారి ఆస్తులు అమ్మకాలతో పూర్తి వివరాలతో శ్వేత పత్రం విడుదల.. టీటీడీ చరిత్రలో ఇదే మొదటిసారి..