Naga Chaitanya-Samantha: నెట్టింట తెగ వైరల్ అవుతోన్న చైతన్య, సమంతల ఓల్డ్ ఫోన్ కాల్…

నాగ చైతన్య-సమంత టాలీవుడ్ మోస్ట్ క్యూట్ కపుల్ అని ఫ్యాన్స్ పిలుచుకునేవారు. కానీ వ్యక్తిగత కారణలతో తాము విడిపోతున్న విషయాన్ని చైయ్, సామ్ సోషల్ మీడియా వేదికగా అక్టోబర్ 2న ప్రకటించారు

Naga Chaitanya-Samantha: నెట్టింట తెగ వైరల్ అవుతోన్న చైతన్య, సమంతల ఓల్డ్ ఫోన్ కాల్...
Chaysam
Follow us
Ram Naramaneni

|

Updated on: Dec 06, 2021 | 3:38 PM

నాగ చైతన్య-సమంత టాలీవుడ్ మోస్ట్ క్యూట్ కపుల్ అని ఫ్యాన్స్ పిలుచుకునేవారు. కానీ వ్యక్తిగత కారణలతో తాము విడిపోతున్న విషయాన్ని చైయ్, సామ్ సోషల్ మీడియా వేదికగా అక్టోబర్ 2న ప్రకటించారు. అయితే విడిపోవడానికి కారణాలు మాత్రం విడమరిచి చెప్పలేదు. కానీ ఈ జంట దాంపత్య జీవితానికి ఎండ్ కార్డ్ వేయడంతో ఫ్యాన్స్ చాలా బాధపడ్డారు. ఆ తర్వాత ఓ నెలంతా వీరి విడాకుల అంశంపైనే సోషల్ మీడియా వేదికగా చర్చ జరిగింది. ప్రజంట్ వీరి విడాకుల కేసు కోర్టులో నడుస్తోంది. అయితే ఓ షోకు గెస్ట్‌గా వెళ్లిన సందర్భంలో నాగ చైతన్య.. సామ్‌కు కాల్ చేసిన వీడియో ప్రజంట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఇది 2017 సంవత్సరానికి సంబంధించిన వీడియో. ‘కొంచెం టచ్‌లో ఉంటే చెప్తా’ పేరుతో ప్రదీప్ మాచిరాజు హోస్ట్ చేసిన షో ఇది. ఈ షోకు ‘రారండోర్ వేడుక చూద్దాం’ సినిమా సమయంలో నాగచైతన్య, రకుల్ ప్రీత్ సింగ్ గెస్టులుగా వచ్చారు. ఈ క్రమంలో సమంతకు కాల్ చేయాలని ప్రదీప్ కోరతాడు. దీంతో సామ్‌ను ఫోన్ చేసి.. ప్రదీప్ అడిగమన్నట్లుగా ‘ప్రపంచంలో ఇంత మంది అమ్మాయిలు ఉండగా నేడు సామ్‌నే ఎందుకు లవ్ చేశాను’ అని చైయ్ అడుగుతాడు. అందుకు సమాధానంగా ‘నేను మరో ఆప్షన్ ఇవ్వలేదు కాబట్టి’ అని సామ్ చెబుతోంది. ‘నాకు మరో ఆప్షన్ కూడా అక్కర్లేదు’ అని చైతూ అంటాడు. ఆ వెంటనే సామ్, చైయ్‌కి ‘ఐ లవ్ యూ’ చెబుతుంది. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది.

గౌతమ్ మీనన్ తెరకెక్కించిన ‘ఏమాయ చేశావే’ సినిమా సెట్‌లో 2009లో తొలిసారిగా సామ్-చైయ్ కలుసుకున్నారు.  2014లో ఆటోనగర్‌ సూర్య సినిమా కోసం మళ్లీ కలిసి చేశారు. ఆ సమయంలో వీరి మధ్య ప్రేమ చిగురించింది. మూడు సంవత్సరాల పాటు డేటింగ్ చేసిన తర్వాత సమంత, నాగ చైతన్య 2017 లో గోవాలో పెళ్లి చేసుకున్నారు. 4 ఏళ్లు కలిసి జీవించిన అనంతరం మనస్పర్థలతో వీరు విడిపోవాలని నిర్ణయం తీసుకున్నారు.

Also Read:  వాతావరణం కంటే వేగంగా మారుతోన్న టమాట ధర.. మరోసారి మోత పుట్టిస్తోంది

భారీగా పెరిగిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
భారీగా పెరిగిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
Horoscope Today: వారికి ఉద్యోగంలో పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: వారికి ఉద్యోగంలో పని భారం పెరిగే ఛాన్స్..
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్