Unstoppable With NBK: ఎన్టీఆర్‌కు వెన్నుపోటు ఎపిసోడ్.. అన్‌స్టాపబుల్‌లో బాలయ్య ఎమోషనల్..
నందమూరి తారకరామరావు.. తెలుగు చిత్రపరిశ్రమను ప్రపంచానికి పరిచయం చేసిన నటుడు. నటుడిగానే కాకుండా.. రాజకీయ
నందమూరి తారకరామరావు.. తెలుగు చిత్రపరిశ్రమను ప్రపంచానికి పరిచయం చేసిన నటుడు. నటుడిగానే కాకుండా.. రాజకీయ నాయకుడిగా ప్రజలకు సేవలు అందించి తెలుగు వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు ఎన్టీఆర్. నటుడిగా అగ్రస్థానంలో కొనసాగిన ఎన్టీఆర్.. రాజకీయ ప్రస్థానం చివరి రోజుల్లో మాత్రం ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కోన్నారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాజకీయాల్లో ఎన్నో పరిణామాలు చోటు చేసుకున్నాయి. అనుహ్యాంగా ముఖ్యమంత్రి పీఠం నుంచి దిగిపోవడం.. ఆరోపణలు ఎదుర్కోవడం జరిగింది. ఎన్టీఆర్ తర్వాత ఆయన అల్లుడు చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. అయితే చంద్రబాబు ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి సీఎం అయ్యారని.. ఆ సమయంలో కుటుంబ సభ్యులు కూడా ఎన్టీఆర్ వెన్నంటి ఉండకుండా.. చంద్రబాబుకు మద్దతు తెలిపారని ఇప్పటికీ ప్రత్యర్థి పార్టీలు ఆరోపిస్తూ ఉంటాయి. అయితే ఈ విషయాలపై ఇప్పటివరకు ఎన్టీఆర్ తనయుడు బాలకృష్ణ స్పందించలేదు. కానీ తాజాగా విడుదలైన అన్‌స్టాపబుల్ టాక్ షో ప్రోమోలో బాలకృష్ణ ఈ విషయాలపై స్పందిస్తూ ఎమోషనల్ అయినట్లుగా కనిపిస్తోంది.
నందమూరి బాలయ్య హీరోగానే కాకుండా.. హోస్ట్‌గానూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ప్రముఖ ఓటీటీ వేదికగా ఆహాలో బాలకృష్ణ వ్యాఖ్యతగా అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే అనే టాక్ షో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ టాక్ షోకు ఇప్పటి వరకు సినీ ప్రముఖులు వచ్చి సందడి చేశారు. రోజు రోజూకీ ఈ టాక్ షోకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ఇప్పటివరకు ఓటీటీలోనే ఈ షో సంచలనం సృష్టిస్తోంది. బాలయ్య ప్రధాన పాత్రలో నటించిన అఖండ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టయిన సంగతి తెలిసిందే. తాజాగా అఖండ చిత్రయూనిట్ బాలయ్య హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ టాక్ షోకు వచ్చి సందడి చేశారు. అయితే ఈ షోలో బాలకృష్ణ ఎన్టీఆర్ ఎపిసోడ్ పై స్పందించారు.
అఖండ చిత్రయూనిట్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, శ్రీకాంత్, ప్రగ్యా జైస్వాల్, మ్యూజిక్ డైరెక్టర్‌తో తనదైన స్టైల్లో కామెడీ పండించారు. ఇందులో శ్రీకాంత్.. బాలకృష్ణ ధీటుగా డైలాగ్స్ చెప్పుకోగా.. డైరెక్టర్ బోయాపాటి శ్రీను, తమన్‌ను కాసేపు ఆట పట్టించారు బాలకృష్ణ. ఇక ఆ తర్వాత తప్పుడు ప్రచారం.. వెన్నుపోటు పొడిచారు గురించి చెప్తుంటే కన్నీళ్లు వస్తాయి. నేను ఆయన కొడుకులలో ఒకరిని.. ఆయన అభిమానుల్లో ఒకడిని అంటూ భావోద్వేగానికి గురయ్యారు బాలకృష్ణ. ఇక ఈ ఎపిసోడ్ డిసెంబర్ 10న ప్రసారం కానుంది.
Also Read: Unstoppable With NBK: విలన్‌గా చేసేందుకు సై అంటున్న బాలకృష్ణ.. అఖండ టీంతో అన్‌స్టాపబుల్ కామెడీ..
Kamal Haasan: కమల్ హాసన్ పై తమిళనాడు ప్రభుత్వం సీరియస్.. కరోనా నిబంధనలు ఉల్లంఘించారంటూ..