Unstoppable With NBK: విలన్‏గా చేసేందుకు సై అంటున్న బాలకృష్ణ.. అఖండ టీంతో అన్‏స్టాపబుల్ కామెడీ..

నందమూరి బాలకృష్ణ .. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన అఖండ బ్లాక్ బస్టర్ హిట్టయింది. గత రెండేళ్లుగా

Unstoppable With NBK: విలన్‏గా చేసేందుకు సై అంటున్న బాలకృష్ణ.. అఖండ టీంతో అన్‏స్టాపబుల్ కామెడీ..
Balakrishna
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 06, 2021 | 1:20 PM

నందమూరి బాలకృష్ణ .. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన అఖండ బ్లాక్ బస్టర్ హిట్టయింది. గత రెండేళ్లుగా ఢిలా పడ్డ థియేటర్లకు సరికొత్త జోష్ తీసుకొచ్చింది అఖండ సినిమా. బాలకృష్ణ నటనకు.. బోయపాటి మాస్ డైరెక్షన్‏ ప్రేక్షకులను థియేటర్లవైపు తీసుకోచ్చాయి. తెలుగు రాష్ట్రాలతోపాటు.. ఇతర దేశాల్లోనూ అఖండ మాస్ జాతర కొనసాగుతుంది. ఇందులో బాలయ్య సరనస ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‏గా నటించగా.. శ్రీకాంత్ విలన్ పాత్రలో అదరగొట్టాడు. అఖండ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఇదిలా ఉంటే.. తాజాగా అఖండ చిత్రయూనిట్ బాలకృష్ణ వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్న అన్‏స్టాపబుల్ షోలో సందడి చేశారు.

ఓవైపు వెండితెరపై సినిమాలు చేస్తూనే.. మరోవైపు డిజిటల్ ప్లాట్ ఫాంపై తనలోని మరో కోణాన్ని బయటపెట్టారు బాలకృష్ణ. ప్రముఖ ఓటీటీ వేదికగా ఆహాలో అన్‏స్టాపబుల్ విత్ ఎన్బీకే షోతో హోస్ట్‏గానూ ప్రేక్షకులను అలరిస్తున్నారు బాలకృష్ణ. ఈ టాక్ షోకు ఆడియన్స్ నుంచి మంచి స్పందన వస్తుంది. ఇప్పటికే ఈ షోలో కలెక్షన్ కింగ్ మెహన్ బాబు, మంచు విష్ణు, మంచులక్ష్మీ.. న్యాచులర్ స్టార్ నాని, బ్రహ్మానందం, డైరెక్టర్ అనిల్ రావిపూడి వచ్చి సందడి చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇటీవల ఈ షోకు సూపర్ స్టార్ మహేష్ బాబు వచ్చారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఇక తాజాగా అన్‏స్టాపబుల్ ఎపిసోడ్ 4 ప్రోమోను విడుదల చేశారు మేకర్స్. ఇందులో అఖండ చిత్రయూనిట్.. డైరెక్టర్ బోయపాటి శ్రీను, శ్రీకాంత్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్, హీరోయిన్ ప్రగ్యాజైస్వాల్ వచ్చి అలరించారు.

తాజాగా విడుదలైన ప్రోమోలో ప్రగ్యా మాట్లాడుతూ.. బోయపాటి సర్, బాలకృష్ణ సర్ అనగా.. సర్ సర్ ఏంటీ అంటూ తలపట్టుకున్నారు బాలకృష్ణ.. దీంతో ఓకే బాలా అనేసింది ప్రగ్యా జైస్వాల్.. బాలానా అంటూ షాకయ్యారు బాలకృష్ణ. ఇక ఆ తర్వాత అఖండ సినిమాలోని పవర్‏ఫుల్ డైలాగ్ శ్రీకాంత్ చెప్పగా.. బాలయ్య సైతం తన స్టైల్లో డైలాగ్ అదరగొట్టారు. అనంతరం ఎవరైనా యాక్ట్ చేయడానికి రెడీగా ఉంటే.. విలన్ చేయడానికి రెడీ అంటూ చెప్పారు బాలకృష్ణ.. ఆ తర్వాత వెంటనే హీరో కూడా నేనే అంటూ నవ్వులు పూయించారు బాలయ్య. ఇక ఆ తర్వాత డైరెక్టర్ బోయపాటి శ్రీను మాలినీ స్టూడియే అనగా… మాలినీ అంటే మాజీ ప్రేయసి పేరు ఆ అంటూ ఆటపట్టించారు బాలకృష్ణ. మొత్తానికి అఖండ చిత్రయూనిట్‏తో అన్‏స్టాపబుల్ ప్రోమో నవ్వులు పూయిస్తుంది.

Also Read: Kamal Haasan: కమల్ హాసన్ పై తమిళనాడు ప్రభుత్వం సీరియస్.. కరోనా నిబంధనలు ఉల్లంఘించారంటూ..

RRR Movie : ఆర్ఆర్ఆర్ నుంచి కొమురం భీమ్ పోస్టర్.. అదిరిపోయిన ఎన్టీఆర్ న్యూలుక్..