TTD-White Paper: టీటీడీ చరిత్రలో తొలిసారి.. శ్రీవారి ఆస్తులు, అమ్మకాలకు సంబంధించిన పూర్తి వివరాలతో శ్వేత పత్రం విడుదల
TTD-White Paper: కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి. స్వామివారిని రాజు,పేద.. ధనవంతుడు, సామాన్యుడు అనే తేడా లేకుండా సేవించుకుంటూ..
TTD-White Paper: కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి. స్వామివారిని రాజు,పేద.. ధనవంతుడు, సామాన్యుడు అనే తేడా లేకుండా సేవించుకుంటూ.. తమ ఇష్ట దైవానికి తమ స్టేజ్ కు తగినట్లు కానుకలను సమర్పిస్తారు. దీంతో స్వామివారికి .. డబ్బు, బంగారం, స్థలాలు, పొలాలు, వెండి , వజ్రాలు ఇలా అనేక రూపాల్లో వెలకట్టలేనన్ని ఆస్తులు ఉన్నాయన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా శ్రీవారి ఆస్తులపై టీటీడీ శ్వేతపత్రం రిలీజ్ చేసి సంచలనం సృష్టించింది. స్వామివారి ఆస్తులపై పూర్తి స్థాయి నివేదికనిస్తూ.. శ్వేతపత్రం విడుదల కావడం తిరుమలాతిరుపతి దేవస్థానం చరిత్రలోనే ఇది మొదటిసారి. ఇప్పటివరకూ ఏ ప్రభుత్వం చేయని పని తాజా టీటీడీ పాలక వర్గం చేసింది. శ్రీ వెంటకటేశ్వర స్వామివారి ఆస్తుల గురించి స్వామివారి భక్తులకు తెలియజేయాల్సిన బాధ్యత ఉందని భావించి శ్రీవారికి ఉన్న ఆస్తులకు సంబంధించిన వివరాలను పారదర్శకంగా ప్రకటించారు. ఈ మేరకు వెంకన్న ఆస్తులను తెలియజేస్తూ.. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఈ శ్వేతపత్రాన్ని రిలీజ్ చేశారు. అంతేకాదు ఈ స్వామివారి ఆస్తుల పూర్తి వివరాలను తెలుసుకోవడానికి శ్వేతపత్రంలో పేర్కొంది.. దానిని www.tirumala.orgలో అందుబాటులో ఉంచింది.
స్వామివారి ఆస్తుల వివరాలు:
1974 సంవత్సరం నుంచి స్వామికి చెందిన ఆస్తిపాస్తుల క్రయవిక్రయాలను గురించి వివరాలను ఇందులో పొందుపరిచారు. అందుబాటులో ఉన్న రికార్డుల ప్రకారం టీటీడీ అధీనంలో ఉన్న స్వామివారి ఆస్తుల సంఖ్య 1128. మొత్తంగా 8,088 ఎకరాల 89 సెంట్ల వ్యవసాయ భూమి ఉంది. ఈ మొత్తం భూమిని వ్యవసాయం, వ్యవసాయేత భూములు, స్థలాలుగా విభజించింది. ఇందులో వ్యవసాయ ఆస్తుల సంఖ్య 233. ఈ వ్యవసాయ భూమిలో 2085.ఎకరాలు41 సెంట్లు స్వామివారి పేరు మీద ఉన్నట్లు శ్వేతపత్రంలో పేర్కొంది. ఇక వ్యవసాయేతర ఆస్తుల సంఖ్య 895 కాగా ఈ కేటగిరీలో ఉన్న స్థలాలు 6,003 ఎకరాల 48 సెంట్లు ఉన్నాయని స్వామివారి మొత్తం స్థలాల వివరాలను శ్వేత పత్రంలో పేర్కొంది.
స్వామివారి ఆస్తుల విక్రయం:
మలయప్పస్వామికి చెందిన మొత్తం 141 ఆస్తులను విక్రయించినట్లు తెలిపింది. ఈ ఆస్తుల అమ్మకం 1974 ఏడాది నుంచి 2014 వరకు జరిగినట్లు టీటీడీ అధికారులు స్పష్టం చేశారు. మొత్తంగా స్వామివారి 335 ఎకరాల 23 సెంట్ల స్థలాన్ని అమ్మినట్లు శ్వేత పాత్రలో పేర్కొంది. ఈ భూముల్లో వ్యవసాయానికి చెందిన ఆస్తుల సంఖ్య 61.. 293 ఎకరాల 02 సెంట్లను .. వ్యవసాయేతర ఆస్తులు సంఖ్య 80.. అంటే 42 ఎకరాల .21 సెంట్ల వ్యవసాయేతర ఆస్తులను విక్రయించారు. ఈ భూముల అమ్మకం ద్వారా టీటీడీ పాలక మండలికి రూ. 6 కోట్ల 13 లక్షల ఆదాయం లభించినట్లు శ్వేతపత్రం ద్వారా టిటిడి అధికారులు తెలిపారు.
వెంకన్నకు 2020 నవంబర్ వరకూ ఉన్న ఆస్తుల వివరాలు:
2020 నవంబర్ 28వ తేదీ నాటికీ శీవారి ఆస్తుల సంఖ్య 987. ఇక టీటీడీ అధీనంలో 7,753 ఎకరాల 66 సెంట్లు ఉన్నాయని పేర్కొంది. ఈ భూమిలో 172 వ్యవసాయ అవసరాలకు ఉపయోగిస్తున్నామని.. మొత్తం 1,792ఎకరాల 39 సెంట్ల భూమి టీటీడీ పాలక మండలి అధీనంలో ఉందని తెలిపింది. 5,961 ఎకరాల 27 సెంట్ల వ్యవసాయేతర స్థలాలు టీటీడీ అధీనంలో ఉన్నాయని శ్వేత పత్రంలో పేర్కొంది.
గత ఏడాది నవంబర్ నాటికి ఉన్న ఆస్తులు ఇవే.. గత ఏడాది నవంబర్ 28వ తేదీ వరకు మదింపు చేసిన ఆస్తుల సంఖ్య 987. 7,753 ఎకరాల 66 సెంట్లు టీటీడీ ఆధీనంలో ఉన్నాయి. ఇందులో 172 వ్యవసాయ అవసరాలకు వినియోగించే భూమి. మొత్తంగా 1,792.39 సెంట్ల వ్యవసాయ భూమి ప్రస్తుతం పాలక మండలి ఆధీనంలో ఉంది. 5,961 ఎకరాల 27 సెంట్ల వ్యవసాయేతర స్థలాలు టీటీడీ వద్ద ఉన్నాయని శ్వేత పత్రంలో పేర్కొంది.
Also Read : కరోనా సమయంలో వేలాదిమంది వైద్యుల కడుపునింపాడు.. నేడు నడవలేని స్థితిలో సాయం కోసం..