Pushpa Movie: ఊరించి.. ఊరించి ఉసూరుమంనిపించిన పుష్ప టీమ్.. నిరాశలో అభిమానులు..

Pushpa Raj Trailer: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పుష్ఫ సినిమా ట్రైలర్‌ రానే వచ్చేసింది. బన్నీ అభిమానులతో పాటు ఫిలిమ్‌ ఇండస్ట్రీ వేయి కళ్లతో ఎదురుచూస్తున్న సినిమా ట్రైలర్‌ను చిత్ర యూనిట్ చెప్పనట్లుగానే..

Pushpa Movie: ఊరించి.. ఊరించి ఉసూరుమంనిపించిన పుష్ప టీమ్.. నిరాశలో అభిమానులు..
Pushpa Raj Trailer
Follow us
Narender Vaitla

|

Updated on: Dec 06, 2021 | 8:37 PM

Pushpa Raj : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమా అంటే అభిమానుల సందడి  మాములుగా ఉండదు.. పూలాభిషేకాలు, పాలాభిషేకాలు, అన్నదానాలు, రక్తదానాలు ఇలా ఫ్యాన్స్ చేసే హంగామా నెక్స్ట్ లెవల్ లో ఉంటుంది. అంతే కాదు బన్నీ సినిమానుంచి ఏ చిన్న అప్డేట్ అయినా బయటకు వచ్చిదంటే చాలు అది క్షణాల్లో సంచలనం గా మారిపోతుంది. ఇక ఇప్పుడు బన్నీ చేస్తున్న పుష్ప విషయంలోనూ అదే జరుగుతుంది. సుకుమార్ దర్శకతంలో అల్లు అర్జున్ నటిస్తున్న హ్యాట్రిక్ సినిమా ఇది. ఈ సినిమా కోసం బన్నీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో మునుపెన్నడూ కనిపించని ఊర మాస్ లుక్ లో కనిపించనున్నాడు. ఎప్పుడూ స్టైలిష్‌ లుక్‌లో అల్ట్రా మోడ్రన్‌గా కనిపించే బన్నీ తొలిసారి ఒక లారీ డ్రైవర్‌ పాత్రలో ఊర మాస్‌ లుక్‌లో కనిపించడం, పూర్తిగా అటవీ ప్రాంతంలో షూటింగ్ జరుపుకోవడంతో ఈ సినిమాను క్యూరియాసిటీ భారీగా పెరిగిపోయింది. ఇందుకు తగ్గట్లుగానే దర్శకుడు సుకుమార్‌ సినిమాలోని అన్ని పాత్రలను అత్యంత సహజంగా మార్చేశారు.ఇప్పటికే విడుదలైన పాటలు , టీజర్ సినిమా పై అంచనాలను ఆకాశానికి చేర్చాయి.

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పుష్ఫ సినిమా ట్రైలర్‌ వచ్చేస్తుంది అని ఊరించారు మేకర్స్. దాంతో బన్నీ ఫ్యాన్స్ అందరు సోషల్ మీడియాను షేక్ చేయడనికి సర్వం సిద్ధం చేసుకున్నారు.  డిసెంబర్ 6(సోమవారం ) సాయంత్రం ఆరు గంటల సమయంలో ట్రైలర్ రానుందని అనౌన్స్ చేశారు. దాంతో కౌండౌన్ మొదలు పెట్టారు అభిమానులు, మూడు గంటల్లో… రెండు గంటల్లో.. గంటలో… మరి కొద్దీ నిమిషాల్లో అంటూ ఆసక్తిగా ఎదురు చూసిన అభిమానులకు షాక్ ఇచ్చారు మేకర్స్. టెక్నికల్ సమస్య తలెత్తడంతో ట్రైలర్ విడుదల కాలేదు.. దాంతో అభిమానులు నిరాశ పడ్డారు. ఊరించి ఊరించి ఉసూరుమనిపించారంటూ.. సోషల్ మీడియాలో నిరాశను వ్యక్తం చేస్తున్నారు. మరి కొంతమంది లెట్ గా వచ్చిన లేటెస్ట్ గా రాబోతున్నాడు బన్నీ అంటూ కామెంట్ చేస్తున్నారు.

ఎర్రచందనం స్మగ్లింగ్ అనే వినూత్న కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో నేషనల్‌ క్రష్‌గా పేరుతెచ్చుకున్న రష్మికను తొలిసారి డీగ్లామర్‌ పాత్రలో చూపించి అందరినీ ఆశ్చర్యపరిచాడు సుకుమార్‌. ఇక ఈ సినిమా ఈ నెల 17న విడుదలవుతోన్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్ వేగాన్ని పెంచేసింది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న పుష్ప రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక త్వరలోనే ట్రైలర్ ఎప్పుడు విడుదల చేస్తారన్నది ప్రకటించనున్నారు..

Also Read: Sajjala Ramakrishna Reddy: ఓటిఎస్‌పై చంద్రబాబు అనవసర రాద్దాంతం చేస్తున్నారు: సజ్జల కీలక వ్యాఖ్యలు

Jacqueline: మనీలాండరింగ్‌ కేసులో జాక్వెలిన్‌కు ఊరట.. విదేశాలకు వెళ్లడానికి అనుమతిచ్చిన అధికారులు..

Jacqueline: మనీలాండరింగ్‌ కేసులో జాక్వెలిన్‌కు ఊరట.. విదేశాలకు వెళ్లడానికి అనుమతిచ్చిన అధికారులు..