AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Katrina- Vicky kaushal: కత్రినా- విక్కీల ప్రి వెడ్డింగ్ సెలబ్రేషన్స్ షురూ !.. ఆహ్వానితుల జాబితా ఇదే!

ప్రేమ బంధాన్ని వివాహ బంధంగా మార్చుకుంటూ మరి కొన్ని గంటల్లో  పెళ్లి పీటలెక్కనున్నారు బాలీవుడ్ లవ్‌ బర్డ్స్‌ కత్రినా కైఫ్‌ - విక్కీ కౌశల్‌. రాజస్థాన్‌లోని సవాయి మాధోపూర్‌లోని 'సిక్స్ సెన్సెస్ ఫోర్ట్'

Katrina- Vicky kaushal: కత్రినా- విక్కీల ప్రి వెడ్డింగ్  సెలబ్రేషన్స్ షురూ  !.. ఆహ్వానితుల జాబితా ఇదే!
Basha Shek
|

Updated on: Dec 07, 2021 | 7:40 AM

Share

ప్రేమ బంధాన్ని వివాహ బంధంగా మార్చుకుంటూ మరి కొన్ని గంటల్లో  పెళ్లి పీటలెక్కనున్నారు బాలీవుడ్ లవ్‌ బర్డ్స్‌ కత్రినా కైఫ్‌ – విక్కీ కౌశల్‌. రాజస్థాన్‌లోని సవాయి మాధోపూర్‌లోని ‘సిక్స్ సెన్సెస్ ఫోర్ట్’ అనే విలాసవంతమైన హోటల్‌ ఈ వేడుకకు వేదిక కానుంది. బాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులను ఆహ్వానించి వేడుకగా ఈ పెళ్లి చేయాలనుకున్నారు కత్రినా- విక్కీల కుటుంబ సభ్యులు. అయితే అనుకోకుండా వచ్చిన ఒమిక్రాన్‌ పెళ్లి ప్రణాళికలను తారుమారు చేసింది. ఈ నేపథ్యంలో కరోనా ఆంక్షలను పాటిస్తూ పరిమిత సంఖ్యలో మాత్రమే ఈ వేడుకకు ఆహ్వానించినట్లు తెలుస్తోంది. కాగా మొత్తం 120 మంది అతిథులు కత్రినా- విక్కీల వివాహానికి హాజరుకానున్నారని సమాచారం. ఇరు కుటుంబ సభ్యులతో పాటు సన్నిహితులు, స్నేహితులు, కొందరు బాలీవుడ్‌ ప్రముఖులు ఈ జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది.

టాలీవుడ్‌ నుంచి.. కాగా కత్రినా- విక్కీలతో పాటు వారి కుటుంబ సభ్యులు ఇప్పటికే రాజస్థాన్ చేరుకున్నారు. నేటి (డిసెంబర్‌7) నుంచి ప్రి వెడ్డింగ్‌ వేడుకలు ప్రారంభంకానున్నాయి. డిసెంబర్‌ 9న సాయంత్రం కత్రినా, విక్కీలు ఏడడుగులు నడవనున్నారు. కాగా ఈ వేడుకకు ప్రముఖ దర్శక నిర్మాత కరణ్‌ జోహర్‌, ఫరాఖాన్‌, కబీర్‌ఖాన్‌, అక్షయ్‌కుమార్‌, షారుఖ్‌ ఖాన్‌, అనుష్కా శర్మ- విరాట్‌ కోహ్లీ దంపతులు, హృతిక్‌ రోషన్‌, రోహిత్‌ శెట్టి, అలీ అబ్బాస్‌ జాఫర్‌, సారా అలీఖాన్‌, యామీ గౌతమ్‌, రిచా చద్దా, తాప్సీ, నేహా ధూపియా దంపతులు.. తదితర సినీ ప్రముఖులు రానున్నారని తెలుస్తోంది. వీరి కోసం హోటల్‌లో విలాసవంతమైన వీవీఐపీ గదులు బుక్‌ చేశారట. ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి విక్టరీ వెంకటేశ్‌కు కూడా ఆహ్వానం అందిందట. ఇక కత్రినా పర్సనల్‌ ట్రైనర్‌ యాస్మిన్‌ కరాచీవాలాతో పాటు ఆమె వ్యక్తిగత సిబ్బంది కూడా ఈ జాబితాలో ఉన్నారు.

Also Read:

Bigg Boss 5 Telugu: సన్నీ, సిరి మధ్య లవ్ ట్రాక్.. కోపంతో రెచ్చిపోయిన షణ్ముఖ్..

Anupama Parameswaran: పరువపు వాన కురిపిస్తున్న పరమేశ్వరన్.. అనుపమ అందాలు ఆపాతరమా..

Aamna Sharif: గులాబీ పువ్వుల విరబూసిన ఆమ్నా షరీఫ్ అందాలు.. ఫోటోలు చుస్తే మతిపోవాల్సిందే..

Follow Us
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?