Gamanam Movie: అవకాశం వస్తుందని కలలో కూడా అనుకోలేదు.. కానీ.. ఆసక్తికర కామెంట్స్ చేసిన గమనం హీరో..

Gamanam Movie: అవకాశం వస్తుందని కలలో కూడా అనుకోలేదు.. కానీ.. ఆసక్తికర కామెంట్స్ చేసిన గమనం హీరో..
Gamanam

శ్రియా సరన్, శివ కందుకూరి, ప్రియాంక జవాల్కర్, నిత్యా మీనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న లేటేస్ట్ చిత్రం గమనం. ఈ సినిమాతో

Rajitha Chanti

|

Dec 07, 2021 | 10:30 AM

శ్రియా సరన్, శివ కందుకూరి, ప్రియాంక జవాల్కర్, నిత్యా మీనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న లేటేస్ట్ చిత్రం గమనం. ఈ సినిమాతో సంజనా రావు నూతన దర్శకురాలిగా పరిచయం కాబోతున్నారు. క్రియ ఫిల్మ్ కార్ప్, కలి ప్రొడక్షన్స్ బ్యానర్లపై రమేష్ కురుటూరి, వెంకీ పుష్పదపు, జ్ఞానశేఖర్ వి.ఎస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా డిసెంబర్10న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇందులో హీరోగా శివ కందుకూరి నటించారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో మూవీ ప్రమోషన్స్ వేగవంతం చేశారు చిత్రయూనిట్. ఈ సందర్భంగా హీరో శివ కందుకూరి మీడియాతో ముచ్చటించారు.

హీరో శివ కందుకూరి మాట్లాడుతూ.. గమనం సినిమా నా కెరీర్‌లో ప్రత్యేకమైన సినిమా అవుతుంది. ఈ కథ విన్న వింటనే నచ్చింది. మా దర్శకురాలు సుజనకు నాకు కామన్ ఫ్రెండ్ ఉన్నారు. అలా నా వద్దకు ప్రాజెక్ట్ వచ్చింది. స్టోరీ విన్నప్పుడు ఇళయరాజా గారు సంగీతమందిస్తున్నారని, బాబా గారు కెమెరామెన్ అని అప్పుడు తెలియదు. మను చరిత్ర షూటింగ్‌లో ఉన్నప్పుడు ఈ కథ విన్నాను. ఇండియాలో ఉన్నప్పుడు క్రికెట్ ఆడేవాడిని. కానీ యూఎస్‌కి వెళ్లి చదువుకున్నప్పుడు ప్రాక్టీస్ పోయింది. మళ్లీ ఈ సినిమా కోసం క్రికెట్‌లో ట్రైనింగ్ తీసుకున్నాను. ప్రొఫెషనల్‌ క్రికెటర్‌లా కనిపించాలని అనుకున్నాను.

చారు హాసన్ వంటి సీనియర్స్‌తో నటించే అవకాశం రావడం ఎంతో అదృష్ణం. ఆయన్నుంచి ఎంతో నేర్చుకున్నాను.. ఆయన ఏ ఒక్క రోజు కూడా షూటింగ్‌కు ఆలస్యంగా రాలేదు.. వర్షంలో ఓ సీన్ ఉంటుంది. నాతో పాటే ఎన్నో గంటలు ఆయన అలా నిల్చుని ఉన్నారు. ఇళయరాజా గారితో పని చేసే అవకాశం వస్తుందని కలలో కూడా అనుకోలేదు. అది అసాధ్యమని అనుకున్నాను.. ఇళయరాజా గారితో చేస్తానని నా మైండ్‌లో కూడా లేదు.. ఆయన బీజీఎం వల్ల కొన్సి సీన్స్ మరోస్థాయికి వెళ్లాయి.

నేను చేసే ప్రతీ సినిమా కథను మా నాన్నతో చర్చిస్తాను. కానీ చివరకు నా నిర్ణయం మీదే వదిలేస్తారు.. ముందు కథ నాకు నచ్చాలి. కథతో కనెక్ట్ అయ్యాననిపిస్తేనే ఒప్పుకుంటాను. నిర్మాత, కెమెరామెన్ జ్ఞానశేఖర్ అందరినీ బాగా చూసుకుంటారు. ఆర్టిస్ట్స్ కంఫర్ట్‌గా ఫీలయ్యేలా చూసుకుంటారు. అండర్ వాటర్‌లో కొన్ని సీన్స్ తీయాలి. మాతో పాటు బాబా గారు కూడా ఉండేవారు. విజువల్‌గా ఇంత బాగా రావడానికి బాబా గారు కారణం. వాటిని డైలాగ్స్‌తో సాయి మాధవ్ బుర్రా గారు ఇంకా అద్భుతంగా మలిచారు. మా నిర్మాతలైన రమేష్ కురుటూరి, వెంకీ పుష్పదపు, జ్ఞానశేఖర్‌లు సినిమాకు ఏది కావాలంటే అది సమకూర్చారు.. మా అందరినీ చాలా బాగా చూసుకున్నారు.

పెద్ద పెద్ద హిట్‌లు అయిన సినిమాలు కూడా కొన్ని రోజులే గుర్తుంటాయి. కానీ సినిమాలోని ఎమోషన్ మాత్రం కనెక్ట్ అయితే అవి ఎక్కువగా కాలం గుర్తుండిపోతాయి.అలా ఎమోషన్ నాకు కనెక్ట్ కాలేకపోతే సినిమాలు చేయలేను.. ఇన్ని సినిమాలు చేయాలని కాదు.. వచ్చే పదేళ్లలో ఐదు సినిమాలు చేసినా కూడా మంచివే చేయాలని అనుకుంటాను. ఈ సినిమాను చూసిన ప్రతీ ఒక్కరూ మంచి ఫీలింగ్‌తోనే బయటకు వస్తారు. ప్రియాంక ఎంత బాగా నటించింది.. శివ ఎంత బాగా చేశాడు.. శ్రియ ఎంత అద్భుతంగా నటించిందని అనుకుంటారు. మంచి సినిమా చూశామన్న ఫీలింగ్ మాత్రం వస్తుంది. ప్రస్తుతం నేను మనుచరిత్ర చేస్తున్నాను. గమనం విడుదలకు సిద్దంగా ఉంది. నాని గారి ప్రొడక్షన్‌లో మీట్ క్యూట్ అనే వెబ్ సిరీస్ చేస్తున్నాను. మరో రెండు సినిమాలకు సైన్ చేశాను అంటూ చెప్పుకొచ్చారు.

Also Read: Pooja Hegde: మీ ఇద్దరిని స్ర్కీన్‌పై ఎప్పుడెప్పుడు చూద్దామా అని అనిపిస్తోంది.. చరణ్‌, తారక్‌ న్యూ లుక్స్‌పై పూజా హెగ్డే..

Bigg Boss 5 Telugu: అలాంటివారికి నువ్వే ఆదర్శం.. పింకీపై ప్రశంసలు కురిపించిన మెగాబ్రదర్‌..

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu