Khiladi: మాస్ రాజా ఫ్యాన్స్‌కు షాక్.. రవితేజ సినిమా వాయిదా పడనుందా..? కారణం ఏంటంటే..

మాస్ మహా రాజా రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఖిలాడి. క్రాక్ సినిమాతో చాలాకాలం తర్వాత సాలిడ్ హిట్ అందుకున్న రవితేజ.

Khiladi: మాస్ రాజా ఫ్యాన్స్‌కు షాక్.. రవితేజ సినిమా వాయిదా పడనుందా..? కారణం ఏంటంటే..
Raviteja
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 10, 2021 | 2:53 PM

Khiladi: మాస్ మహా రాజా రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఖిలాడి. క్రాక్ సినిమాతో చాలాకాలం తర్వాత సాలిడ్ హిట్ అందుకున్న రవితేజ. ఇప్పుడు ఖిలాడిగా మెప్పించడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాకు రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. రమేష్ వర్మ ఇటీవల రాక్షసుడు సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.. ఇక ఇప్పుడు ఈ సినిమాను కూడా థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిస్తున్నాడని టాక్ వినిపిస్తుంది. ఈ సినిమాలో రవితేజ డ్యూయల్ రోల్ లో నటిస్తున్నాడట. ఇక ఈ సినిమాలో రవితేజ సరసన మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. వచ్చే ఏడాది సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు చిత్రయూనిట్ ప్రకటించారు.

ఖిలాడి సినిమాను ఫిబ్రవరి 11వ తేదీన విడుదల చేయనున్నట్టు  చిత్రయూనిట్ ప్రకటించింది. ఇప్పుడు ఈ విడుదల తేదీ వాయిదా పడనుందని తెలుస్తుంది. అయితే ఖిలాడి సినిమా షూటింగ్ ఇంకా పూర్తికాలేదని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా మరోకొంత షూట్ చేయాల్సి ఉందట. విదేశాల్లో చేయవలసిన ఒక షెడ్యూల్ పెండింగ్ లో ఉందని అంటున్నారు. కానీ ఇప్పుడు అక్కడ షూటింగ్ చేసే పరిస్థితి కనిపించడం లేదు. దాంతో ఈ సినిమా అనుకున్న తేదీకి ఖిలాడి రాకపోవచ్చు అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తలపై చిత్రయూనిట్ ఎలా స్పందిస్తారో చూడాలి. ఇక ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, పాటలు, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ సినిమాకు దేవీ శ్రీ సంగీతం అందిస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Ram Gopal Varma: మంచు లక్ష్మి ఫోటో షేర్ చేస్తూ వర్మ కామెంట్స్.. ఆర్టిస్టిక్ కిల్లర్‏నే అంటూ..

Bigg Boss 5 Telugu: సిరి పై షణ్ముఖ్ అలక.. నువ్వంటే నాకు చాలా ఇష్టమంటూ హగ్గు.. మళ్లీ మొదలెట్టేశారుగా..

Bheemla nayak: రన్‌ టైమ్‌ను లాక్‌ చేసుకున్న భీమ్లా నాయక్‌.. సినిమా నిడివి ఎంతంటే!