జ్ఞాపకశక్తి, కంటి చూపు మెరుగ్గా ఉండాలంటే ఈ 5 ఆహారాలు తినకూడదు..! ఎందుకో తెలుసుకోండి..?

Memory Eyesight: మారిన జీవన విధానం వల్ల ఇప్పుడు చాలామంది అల్జీమర్స్, చిత్తవైకల్యంతో బాధపడుతున్నారు. అయితే దీనికి ప్రధాన కారణం

జ్ఞాపకశక్తి, కంటి చూపు మెరుగ్గా ఉండాలంటే ఈ 5 ఆహారాలు తినకూడదు..! ఎందుకో తెలుసుకోండి..?
Memory Loss
Follow us
uppula Raju

|

Updated on: Dec 10, 2021 | 5:44 PM

Memory Eyesight: మారిన జీవన విధానం వల్ల ఇప్పుడు చాలామంది అల్జీమర్స్, చిత్తవైకల్యంతో బాధపడుతున్నారు. అయితే దీనికి ప్రధాన కారణం ఆహార విధానం సరిగ్గా పాటించకపోవడమే. ప్రాసెస్ చేయబడిన, ప్యాక్ చేయబడిన ఆహారాలపై జనాలు ఎక్కువగా ఆధారపడుతున్నారు. ఈ కారణం వల్ల ఎక్కువగా ఈ రోగాలకు గురవుతున్నారు. హార్వర్డ్ మెడికల్ స్కూల్‌ పోషకాహార, మానసిక వైద్యుడు, జ్ఞాపకశక్తి, దృష్టిని ప్రభావితం చేసే ఐదు ఆహారాల గురించి చెప్పారు. ఇవి దీర్ఘకాలిక గట్ బ్యాక్టీరియా, జ్ఞాపకశక్తి, బలహీనమైన చూపులకు కారణమవుతున్నాయి. అందుకే ప్రతి ఒక్కరు ఈ ఆహారాలను నివారించాలి. అవేంటో తెలుసుకుందాం.

1. ఆల్కహాల్: ఆల్కహాల్‌ ఆరోగ్యానికి హానికరం. ఇది శరీరంలోని అన్ని అవయవాలపై చెడు ప్రభావం చూపుతుంది. అయితే పెరుగుతున్న మానసిక ఒత్తిడి వల్ల చాలామంది మద్యంపై ఆధారపడుతున్నారు. అతిగా మద్యపానం మెదడుపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. జ్ఞాపకశక్తి తగ్గిస్తుంది. 2018లో బ్రిటిష్ మెడికల్ జర్నల్‌లో వారానికి 14 కంటే ఎక్కువ పానీయాలు తాగేవారికి, మితంగా తాగేవారికి, మద్యపానానికి దూరంగా ఉండే వ్యక్తుల మధ్య తేడాలు గమనించారు. ఇందులో మద్యం తాగనివారికి చిత్తవైకల్యం వచ్చే ప్రమాదం తక్కువగా ఉందని తేలింది.

2. నైట్రేట్‌లు అధికంగా ఉండే ఆహారాలు : నైట్రేట్‌లను ఆహారపదార్థాలు చెడిపోకుండా ఉండటానికి వాడుతారు. మసాలా దినుసులలో రంగును పెంచడానికి ఉపయోగిస్తారు. పరిశోధన ప్రకారం ఇవి డిప్రెషన్ ప్రమాదాన్ని పెంచుతాయి. ఇటీవలి అధ్యయనంలో ఇది గట్‌కి మంచి చేసే బ్యాక్టీరియాని అంతం చేస్తుందని తేలింది.

3. వేయించిన ఆహారాలు: ఫ్రైడ్ చికెన్, డోనట్స్ వంటి ఫ్రై చేసిన ఆహరాలు శరీరంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. ఒక అధ్యయనం ప్రకారం.. ఎక్కువ వేయించిన ఆహారాన్ని తీసుకునే వ్యక్తులలో జ్ఞాపకశక్తి తక్కువగా ఉంటుంది. ఈ అధిక కేలరీల ఆహారాలు మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే రక్త నాళాల వాపును ప్రేరేపిస్తాయి.

4. అధిక గ్లైసెమిక్ ఇండెక్స్ ఆహారాలు: శుద్ధి చేసిన పిండి నుంచి తయారైన బ్రెడ్, పాస్తా వంటి ఆహార పదార్థాలు తేలికగా విచ్ఛిన్నమై రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి. దీనివల్ల దీర్ఘకాలికంగా బరువు పెరుగుట, జీవక్రియ లోపాలు, మధుమేహం ప్రమాదాలు ఉంటాయి. 2018 అధ్యయనం ప్రకారం.. తృణధాన్యాలు, పచ్చి క్యారెట్లు, పచ్చి ఆకు కూరలు, చిక్‌పీస్ వంటివి తినేవారు మానసికంగా నిరాశకు గురయ్యే ప్రమాదం 30 శాతం తక్కువగా ఉందని నిపుణులు కనుగొన్నారు.

5. చక్కెర కలిసిన ఆహారాలు: చక్కెర కలిసిన ఆహారాలు తిన్నప్పుడు శరీరం దానిని గ్లూకోజ్‌గా మారుస్తుంది. అయినప్పటికీ అధిక చక్కెర తీసుకోవడం మెదడు పనితీరును దెబ్బతీస్తుంది. జ్ఞాపకశక్తిని ప్రభావితం చేస్తుంది. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ పురుషులు 36 గ్రాముల కంటే ఎక్కువ చక్కెర, స్త్రీలు 25 గ్రాముల కంటే ఎక్కువ చక్కెర తినకూడదని సిఫార్సు చేసింది.

వైట్‌ రైస్‌, బ్రౌన్‌ రైస్‌కి తేడాలేంటి..? వైట్‌రైస్‌ కంటే బ్రౌన్‌ రైస్‌ ఎందుకు మంచిది..?

గుడ్డు ఒక్కటే కాదు.. ఈ 5 ఆహారాలలో కూడా ప్రొటీన్లు పుష్కలం..

ఈ ఫేమస్‌ మహిళా క్రికెటర్‌ని గుర్తుపట్టారా..! ఐపీఎల్‌లో మార్పులు ముందుగానే ఊహించింది..

క్యాష్ విత్ డ్రా పరిమితి దాటితే టీడీఎస్ మోతే..!
క్యాష్ విత్ డ్రా పరిమితి దాటితే టీడీఎస్ మోతే..!
దాభా స్టైల్‌లో ఎగ్ 65.. ఇలా చేస్తే రుచి అదుర్స్ అంతే!
దాభా స్టైల్‌లో ఎగ్ 65.. ఇలా చేస్తే రుచి అదుర్స్ అంతే!
చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి
కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి
నిలోఫర్‌లో శిశువు అపహరణ.. ఆసుపత్రి సిబ్బంది అని చెప్పి..
నిలోఫర్‌లో శిశువు అపహరణ.. ఆసుపత్రి సిబ్బంది అని చెప్పి..
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!