Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Omicron Threat: చాపకింద నీరులా విస్తరిస్తున్న ఒమిక్రాన్.. మహారాష్ట్ర సర్కారు కీలక నిర్ణయం

Omicron Cases in India: భారత్‌లో ఒమిక్రాన్‌ వేరియంట్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. దేశంలో గడిచిన 24 గంటల్లో 9 కేసులు నమోదయ్యాయి.

Omicron Threat: చాపకింద నీరులా విస్తరిస్తున్న ఒమిక్రాన్.. మహారాష్ట్ర సర్కారు కీలక నిర్ణయం
Omicron
Follow us
Janardhan Veluru

|

Updated on: Dec 11, 2021 | 10:36 AM

Section 144 in Mumbai: భారత్‌లో ఒమిక్రాన్‌ వేరియంట్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. దేశంలో గడిచిన 24 గంటల్లో 9 కేసులు నమోదయ్యాయి. ఒక్క మహారాష్ట్రలోనే శుక్రవారం ఒక్క రోజే 7 కేసులువచ్చాయి. ముంబైలో 3, పింప్రిలో 4 కేసులు వెలుగులోకి వచ్చాయి. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లోనూ మరో రెండు పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇటీవల జింబాబ్వే నుంచి వచ్చిన ఓ వ్యక్తికి ఒమిక్రాన్ వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు అతని భార్య, బావమరిదికి కూడా ఒమిక్రాన్ సోకినట్టు జామ్‌నగర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు వెల్లడించారు. దీంతో స్థానికుల్లో ఆందోళన మొదలైంది. దేశంలో ఇప్పటి వరకు నిర్ధారణ అయిన ఒమిక్రాన్ కేసుల సంఖ్య 32కు పెరిగింది.

మహారాష్ట్రలో మాత్రమే ఇప్పటి వరకు నమోదైన మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 17కు చేరింది. ఇది దేశంలోనే అత్యధికం. ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో మహారాష్ట్ర ప్రభుత్వం అలెర్ట్ అయ్యింది. ఒమిక్రాన్ కట్టడి దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. ముంబైలో ఇవాళ, రేపు సెక్షన్ 144 విధించింది. దీంతో ముంబైలో ర్యాలీలు, సామూహిక కార్యక్రమాలను నిషేధించినట్లయ్యింది. నిషేధాజ్ఞలను ఉల్లంఘిస్తే తీవ్ర పరిణామాలుంటాయని ప్రభుత్వం హెచ్చరించింది.

ముంబైలో సెక్షన్ 144 విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వెనుక రెండు కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది.

ముంబైలో భారీ ర్యాలీకి ఎంఐఎం ఏర్పాట్లు చేసుకుంటోంది. దీంతో ఆ పార్టీ కార్యకర్తలు రాష్ట్ర నలుమూలల నుంచి ముంబై చేరుకున్నారు. ఈ ర్యాలీలో ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ కూడా పాల్గొననున్నారు. ఈ రాజకీయ ర్యాలీ కారణంగా ఒమిక్రాన్ మరింత వ్యాపించే అవకాశముండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే సంజయ్ రౌత్ చేసిన ప్రకటనకు నిరసనగా బీజేపీ ఆందోళన చేపట్టనుండటం ప్రభుత్వ నిర్ణయానికి రెండో కారణంగా తెలుస్తోంది. రాజకీయ ర్యాలీల కారణంగా ఒమిక్రాన్ విస్తరించే అవకాశం ఉండటంతో ముంబైలో సెక్షన్ 144 విధించింది.

దేశంలో ఇప్పటి వరకు నమోదైన ఒమిక్రాన్ కేసుల సంఖ్య 32కు చేరింది. మహారాష్ట్రలో 17, రాజస్థాన్‌లో 9, గుజరాత్‌లో 3, కర్ణాటకలో 2, ఢిల్లీలో ఒక కేసు నమోదయ్యింది.

Also Read..

IPL 2022: మెగా వేలంలోకి ‘కిలాడీ’ ప్లేయర్స్.. వీరంటే ఒకే జట్టులో ఉన్నట్లయితే రికార్డులు బద్దలే!

Lance Naik Sai Teja: లాన్స్ నాయక్ సాయి తేజ కుటుంబానికి అండగా ప్రభుత్వం.. రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలని నిర్ణయం..!