IPL 2022: మెగా వేలంలోకి ‘కిలాడీ’ ప్లేయర్స్.. వీరంటే ఒకే జట్టులో ఉన్నట్లయితే రికార్డులు బద్దలే!

మరికొద్దిరోజుల్లో ఐపీఎల్ 2022 మెగా ఆక్షన్ జరగనుంది. ఇప్పటికే రిటైన్ ప్లేయర్స్ లిస్టు వచ్చేసింది. వేలానికి ముందుగా తమ రిటైన్ ఆటగాళ్ల..

IPL 2022: మెగా వేలంలోకి 'కిలాడీ' ప్లేయర్స్.. వీరంటే ఒకే జట్టులో ఉన్నట్లయితే రికార్డులు బద్దలే!
IPL 2022 Retention Players List
Follow us
Ravi Kiran

|

Updated on: Dec 11, 2021 | 10:25 AM

మరికొద్దిరోజుల్లో ఐపీఎల్ 2022 మెగా ఆక్షన్ జరగనుంది. ఇప్పటికే రిటైన్ ప్లేయర్స్ లిస్టు వచ్చేసింది. వేలానికి ముందుగా తమ రిటైన్ ఆటగాళ్ల జాబితాను 8 ఫ్రాంచైజీలు ప్రకటించాయి. కొన్ని సంచలనాలు నమోదైనప్పటికీ.. యాజమాన్యాలు మాత్రం తన జట్టులో అత్యంత ముఖ్యమైన క్రికెటర్ల వైపే మొగ్గు చూపారు. ఇదిలా ఉంటే.. మెగా ఆక్షన్‌లోకి వచ్చినవారి ది ‘బెస్ట్ 11’గా రూపుదిద్దుకునే ఆటగాళ్లు కొందరు ఉన్నారు.. వారంతా ఒకే జట్టులో ఉన్నట్లయితే.. రికార్డులు బద్దలయ్యినట్లే.!

1. కెఎల్ రాహుల్:

ఐపీఎల్ 2021కి పంజాబ్ కింగ్స్ సారధిగా వ్యవహరించిన కెఎల్ రాహుల్.. ఆ సీజన్‌లో 626 పరుగులు సాధించి అత్యధిక రన్స్ చేసిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు. వచ్చే ఏడాది రెండు కొత్త జట్లు వస్తున్నాయి. అటు పంజాబ్ కింగ్స్‌కు రాహుల్ గుడ్‌బై చెప్పాడు. ఈ తరుణంలో లక్నో జట్టుకు రాహుల్ కెప్టెన్ అవుతాడని చర్చ జరుగుతోంది.

2. డేవిడ్ వార్నర్:

సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్, విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్‌కి 2021 సీజన్ అచ్చిరాలేదని చెప్పాలి. హైదరాబాద్ జట్టుకు తొలి ట్రోఫీని అందించిన ఈ ప్లేయర్‌ను.. ఆ జట్టు అర్ధాంతరంగా కెప్టెన్సీ నుంచి తప్పించింది. యూఏఈ వేదికగా జరిగిన సెకండాఫ్ ఐపీఎల్‌లో కూడా వార్నర్‌కు తుది జట్టులో చోటు ఇవ్వలేదు. ఈ క్రమంలోనే రిలీజ్ చేసింది. అయితే వార్నర్ మాత్రం ఎక్కడా నిరాశ చెందకుండా టీ20 ప్రపంచకప్ 2021లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు దక్కించుకున్నాడు.

3. శుభ్‌మాన్ గిల్:

కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు నెక్స్ట్ కెప్టెన్ అవుతాడనుకున్న ఈ యువ టీమిండియా ప్లేయర్‌ను ఆ ఫ్రాంచైజీ అనూహ్యంగా వదులుకుంది. గిల్ స్థానంలో వెంకటేష్ అయ్యర్‌ వైపే కోల్‌కతా యాజమాన్యం మొగ్గు చూపింది. అంచనాలకు మించి రాణిస్తున్న గిల్‌ను కేకేఆర్ మళ్లీ కొనుగోలు చేస్తుందో.? లేదో చూడాలి.

4. శ్రేయాస్ అయ్యర్:

గాయం కారణంగా ఐపీఎల్ 2021 సీజన్‌లో శ్రేయాస్ అయ్యర్ ఢిల్లీ జట్టుకు దూరమయ్యాడు. ఆ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్‌కు రిషబ్ పంత్ సారధిగా వ్యవహరించాడు. ఈ తరుణంలోనే ఢిల్లీ అయ్యర్‌ను రిలీజ్ చేసింది.

5. ఇషాన్ కిషన్:

ఈ ఏడాది ముంబై ఇండియన్స్‌కు పలు మ్యాచ్‌లలో ఒంటిచేత్తో విజయాలు అందించిన ఇషాన్ కిషన్‌ను ఆ జట్టు వదులుకుంది. ఇది అందరినీ ఆశ్చర్యపరిచింది. ఖచ్చితంగా ఈ యువ ప్లేయర్.. మెగా వేలంలో అత్యధిక ధర పలుకుతాడని క్రికెట్ వర్గాలు అంటున్నాయి.

6. హార్దిక్ పాండ్యా:

ఫిట్‌నెస్ ఇబ్బందులతో ఐపీఎల్ 2021 సీజన్ మొత్తమంతా హార్దిక్ పాండ్యా పూర్తిగా విఫలమయ్యాడు. ఈ తరుణంలోనే అతడ్ని ముంబై రిలీజ్ చేసింది. మరి ఈ మెగా వేలంలో హార్దిక్‌ను ఏ జట్టు దక్కించుకుంటుందో వేచి చూడాలి.

7. రషీద్ ఖాన్:

టీ20 క్రికెట్‌లో బెస్ట్ బౌలర్ రషీద్ ఖాన్. ఈ స్టార్ ప్లేయర్‌ను వదిలేసుకున్న హైదరాబాద్ జట్టుపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే రషీద్ ఖాన్, సన్‌రైజర్స్ జట్టు మధ్య విబేధాల కారణంగానే అతడ్ని యాజమాన్యం రిలీజ్ చేసినట్లు తెలుస్తోంది. కారణం అనేది అటుంచితే.. ఈ స్టార్ ప్లేయర్‌ను మెగా వేలంలో దక్కించుకునే జట్టు ఖచ్చితంగా జాక్‌పాట్ కొట్టినట్లే.

8. జోఫ్రా ఆర్చర్:

బ్యాటర్లను తన పదునైన బంతులతో ముప్పుతిప్పలు పెట్టడం జోఫ్రా ఆర్చర్‌కు బాగా తెలుసు. వరల్డ్‌ క్లాస్ సీమర్ అయిన ఆర్చర్‌ కోసం పలు ఫ్రాంచైజీలు ఖచ్చితంగా మెగా వేలంలో పోటీపడుతాయి. చూడాలి యెవరు దక్కించుకుంటారో.?

9. కగిసో రబడా:

ఢిల్లీ క్యాపిటల్స్ కీలక ప్లేయర్ కగిసో రబడా. ఆ ఫ్రాంచైజీ ఇతడ్ని వదిలేయడం అందరికీ షాక్ ఇచ్చింది. అత్యుత్తమ పేసర్లలో ఒకరైన రబడాకు మెగా ఆక్షన్‌లో పోటీ ఖచ్చితంగా ఉంటుంది.

10. దీపక్ చాహార్:

చెన్నై సూపర్ కింగ్స్ కీ ప్లేయర్ దీపక్ చాహార్.. ఆ జట్టుకు ఎన్నో విజయాల్లో తన వంతు పాత్ర పోషించాడు. చెన్నై జట్టు దీపక్‌ను వదులుకోవడం ఆశ్చర్యకరమే.

11. యుజ్వేంద్ర చాహల్:

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు చాహల్ బెస్ట్ బౌలర్. ప్రతీసారి వికెట్ తీస్తూ.. బెంగళూరు విజయంలో కీలక పాత్ర పోషిస్తాడు. ఆ ఫ్రాంచైజీ ఇతడ్ని రిటైన్ చేసుకోకుండా వదిలేయడం గమనార్హం.

ఇక వీరందరూ బెస్ట్ 11 అని చెప్పొచ్చు. ఒకే జట్టులో ఉన్నట్లయితే.. రికార్డులు బద్దలైనట్లే.! కానీ అది కుదరని పని. కనీసం ఫాంటసీలాగానైనా ఈ ఊహ ఎంత బాగుందో కదా.!

Also Read:

Viral News: డిన్నర్ డేట్‌కు వెళ్లారు.. లైట్‌గా ఫుడ్ లాగించారు.. చివరికి బిల్లు చూసి కళ్లు తేలేసారు!

Cricket: 9 బంతుల్లో 50 పరుగులు.. సిక్సర్లతో బౌలర్లను ఏకిపారేసిన బ్యాట్స్‌మెన్.. దెబ్బకు సీన్ రివర్స్!

Viral Photo: ఈ చిరునవ్వుల చిన్నది ఇప్పుడు క్రేజీ హీరోయిన్.. ఫ్యాన్స్‌లో యమా క్రేజ్.. ఎవరో గుర్తుపట్టారా!

మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
నితీశ్ కుమార్‌ రెడ్డికి ఏపీ ప్రభుత్వం భారీ నజరానా
నితీశ్ కుమార్‌ రెడ్డికి ఏపీ ప్రభుత్వం భారీ నజరానా
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..