Viral News: డిన్నర్ డేట్‌కు వెళ్లారు.. లైట్‌గా ఫుడ్ లాగించారు.. చివరికి బిల్లు చూసి కళ్లు తేలేసారు!
ఎన్నో వింతలూ-విశేషాలకూ సోషల్ మీడియా కేంద్ర బిందువు. ఇక ఇప్పుడు మేము చెప్పబోయేది కూడా ఇంచుమించు ఇలాంటి సంఘటనే..
ఎన్నో వింతలూ-విశేషాలకూ సోషల్ మీడియా కేంద్ర బిందువు. ఇక ఇప్పుడు మేము చెప్పబోయేది కూడా ఇంచుమించు ఇలాంటి సంఘటనే అని చెప్పొచ్చు. ఇక్కడొక కపుల్ తమ డిన్నర్ డేట్ కోసం ఓ రెస్టారెంట్‌కు వెళ్లారు. అక్కడ వారు రేట్ కార్డును సరిగ్గా చూసుకోకుండా ఓ కొత్త వంటకాన్ని ఆర్డర్ చేశారు. తీరా చివరికి బిల్లు చూసి ఒక్కసారి వారి ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..
అమెరికాకు చెందిన జెఫ్రీ పైజ్ తన భాగస్వామితో కలిసి ప్రముఖ చెఫ్ గోర్డాన్ రామ్‌సే రెస్టారెంట్‌కు డిన్నర్ డేట్ కోసం వెళ్లారు. సింగిల్‌గా రాలేదు.. అది కూడా డేట్ నైట్ కావడంతో.. కొత్తగా ఏదైనా ట్రై చేద్దామని అనుకున్నారు. దీనితో జెఫ్రీ దృష్టి హోటల్ మెనూ కార్డ్‌లోని జపనీస్ A5 ‘కోబ్’ అనే డిష్‌పై పడింది. ఆ డిష్ ఎంతన్నది చూడకుండానే ఆర్డర్ ఇచ్చారు. ఇద్దరూ కూడా సంతృప్తికరంగా డిన్నర్‌ను కంప్లీట్ చేసుకున్నారు. ఇక చివరికి బిల్లు చూసి కళ్లు తేలేసారు. ఆ బిల్లు సుమారు రూ. 45 వేలు వచ్చింది.
ఇక్కడ జెఫ్రీ పొరపాటు పడింది ఎక్కడంటే.. 4 ముక్కల ‘కోబ్’ – రూ. 2500గా ఆమె భావించి.. మొత్తం 8 పీసెస్‌కు గానూ ధర రూ. 5800 అవుతుందని అనుకుంది. అయితే ‘కోబ్’ అసలు ధర $420.. దీనితో బిల్ కాస్తా తడిసిపోయింది. చివరికి బిల్లు $ 576( అంటే రూ. 45 వేలు) కట్టాల్సి వచ్చింది. ఈ ఘటన సంవత్సరం క్రిందట జరిగిందని చెబుతూ ఆమె సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. దీనిపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు.
Also Read: సోఫాలో నుంచి వింత శబ్దాలు.. భయం భయంగా పోలీసులకు ఫోన్ చేసిన వ్యక్తి.. చివరికి ఏం జరిగిందంటే!