Petrol Diesel Price Today: అంతర్జాతీయంగా తగ్గిన ముడి చమురు ధరలు.. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయంటే..
Petrol Diesel Rate Today: అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు బాగా తగ్గిన తర్వాత కూడా డిసెంబర్ 11, 2021 శనివారం నాడు పెట్రోల్, డీజిల్ ధరలలో ఎటువంటి మార్పు లేదు.
అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు బాగా తగ్గిన తర్వాత కూడా డిసెంబర్ 11, 2021 శనివారం నాడు పెట్రోల్, డీజిల్ ధరలలో ఎటువంటి మార్పు లేదు. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గుముఖం పట్టాయి. ముడి చమురు ధర బ్యారెల్‌కు 75 డాలర్లకు చేరుకుంది. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 95.41, డీజిల్ రూ. 86.67గా ఉంది. ముంబైలో పెట్రోల్ ప్రస్తుతం లీటరుకు రూ. 109.98గా ఉంది. డీజిల్ లీటరుకు రూ. 94.14 చొప్పున విక్రయిస్తున్నారు. మెట్రో నగరాల్లో ముంబైలో ఇంధన ధరలు అత్యధికంగా ఉన్నాయి. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.104.67 చొప్పున ఉండగా.. డీజిల్ ధర రూ. 89.79 గా ఉంది. చెన్నైలో పెట్రోల్ ధర రూ. 101.40 ఉండగా.. డీజిల్ ధర రూ.91.43గా ఉంది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.100.58 పలుకుతుండగా.. డీజిల్ ధర రూ.85.01గా ఉంది. VAT కారణంగా రాష్ట్రాలలో రేట్లు మారుతూ ఉంటాయి.
తెలంగాణలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు..
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 108.20గా ఉంది. ఇదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ.94.62కు విక్రయిస్తున్నారు. కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.108.39గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర ధర రూ.94.79గా ఉంది. ఖమ్మంలో పెట్రోల్ ధర రూ. 108.90గా ఉండగా.. డీజిల్ ధర రూ.95.25గా ఉంది. మెదక్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.108.72గా ఉండగా.. డీజిల్ ధర రూ.95.11గా ఉంది. రంగారెడ్డి జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 108.20 ఉండగా.. డీజిల్ ధర రూ.94.62గా ఉంది. వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 107.69పలుకుతుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.94.14గా ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు..
విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.110.50కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.96.46లకు లభిస్తోంది. విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ.109.32 ఉండగా.. డీజిల్ ధర రూ. 95.43గా ఉంది. విజయనగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ.110.50లకు లభిస్తుండగా.. డీజిల్ ధర రూ.96.52గా ఉంది. కృష్ణా జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 110.02గా ఉండగా.. డీజిల్ ధర రూ.96.13గా ఉంది. గుంటూరు జిల్లాలో లీటర్ పెట్రోల్ రూ.110.67 లకు లభిస్తుండగా.. డీజిల్ రూ.96.74లకు లభిస్తోంది.
Read Also.. Multibagger stock: లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే రూ.30 లక్షలు వచ్చాయి.. అదీ ఆరు నెలల్లోనే.. ఎలాగంటే..