Multibagger stock: లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే రూ.30 లక్షలు వచ్చాయి.. అదీ ఆరు నెలల్లోనే.. ఎలాగంటే..
కోవిడ్-19 మహమ్మారి తర్వాత స్టాక్ మార్కెట్ భారీగా పెరిగింది. భారతీయ స్టాక్ మార్కెట్ దాని పెట్టుబడిదారులకు అద్భుతమైన రాబడిని ఇచ్చింది...
కోవిడ్-19 మహమ్మారి తర్వాత స్టాక్ మార్కెట్ భారీగా పెరిగింది. భారతీయ స్టాక్ మార్కెట్ దాని పెట్టుబడిదారులకు అద్భుతమైన రాబడిని ఇచ్చింది. గత ఆరు నెలల్లో, 2021లో మల్టీబ్యాగర్ స్టాక్‌ల జాబితాలో మంచి సంఖ్యలో స్టాక్‌లు ప్రవేశించాయి. ఇందులో రఘువీర్ సింథటిక్స్ షేర్లు కూడా ఉన్నాయి. టెక్స్‌టైల్ స్టాక్ గత ఆరు నెలల్లో ఒక్కో షేరు స్థాయికి దాదాపు రూ.20 నుండి రూ.600.40 వరకు పెరిగింది. తక్కువ వ్యవధిలో దాదాపు 30 రెట్లు పెరిగింది. గత వారంలో ఈ మల్టీబ్యాగర్ స్టాక్ రూ. 494 నుంచి రూ.600 కు పెరిగింది.
ఒక వారంలో దాదాపు 21.5 శాతం పెరిగింది. గత వారం ట్రేడింగ్‌లో ఈ టెక్స్‌టైల్ స్టాక్ మొత్తం 5 ట్రేడ్ సెషన్లలో 5 శాతం అప్పర్ సర్క్యూట్లను తాకింది. గత ఒక నెలలో రఘువీర్ సింథటిక్స్ షేర్ ధర రూ. 216 నుండి రూ.600కు పెరిగింది. ఈ కాలంలో దాదాపు 175 శాతం పెరిగింది. అదే విధంగా ఖచ్చితమైన ఆరు నెలల వ్యవధిలో ఈ మల్టీబ్యాగర్ స్టాక్ దాదాపు 2900 శాతం పెరిగింది.
రఘువీర్ సింథటిక్స్ షేర్ ధర చరిత్ర గురించి తెలుసుకంటే.. ఒక పెట్టుబడిదారుడు ఒక వారం క్రితం ఈ కౌంటర్‌లో రూ.1 లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే, దాని విలువ ఇప్పుడు1.21 లక్షలకు చేరి ఉండేది. ఒక నెల క్రితం ఈ మల్టీబ్యాగర్ టెక్స్‌టైల్ స్టాక్‌లో 1 లక్ష రూపాయాలు ఇన్వెస్ట్ చేసి ఉంటే.. అది ఇప్పుడు 2.75 లక్షలకు చేరేది. అదే ఆరు నెలల క్రితం రూ.1లక్ష పెట్టుబడి పెడితే ఇప్పుడు దాని విలు అక్షారాల 30 లక్షల రూపాయలకు చేరి ఉండేది.
Read Also.. Semiconductor: సెమీకండక్టర్ అంటే ఏమిటి.. వాటి కొరత ఎందుకు వచ్చింది..?