Semiconductor: సెమీకండక్టర్ అంటే ఏమిటి.. వాటి కొరత ఎందుకు వచ్చింది..?

సెమీకండక్టర్ (చిప్) కొరత కారణంగా దేశంలో నవంబర్‌లో  ప్యాసింజర్ వాహనాల హోల్‌సేల్ అమ్మకాలు 19 శాతం తగ్గాయని ఆటోమొబైల్ ఇండస్ట్రీ బాడీ SIAM శుక్రవారం తెలిపింది...

Semiconductor: సెమీకండక్టర్ అంటే ఏమిటి.. వాటి కొరత ఎందుకు వచ్చింది..?
Semiconductor
Follow us

|

Updated on: Dec 11, 2021 | 10:32 AM

సెమీకండక్టర్ (చిప్) కొరత కారణంగా దేశంలో నవంబర్‌లో  ప్యాసింజర్ వాహనాల హోల్‌సేల్ అమ్మకాలు 19 శాతం తగ్గాయని ఆటోమొబైల్ ఇండస్ట్రీ బాడీ SIAM శుక్రవారం తెలిపింది. సెమీకండక్టర్ల కొరత కారణంగా వాహనాల తయారీ, సరఫరాపై తీవ్ర ప్రభావం పడుతుందని సియామ్ పేర్కొంది. చిప్ కొరత కారణంగా గత నెలలో ప్యాసింజర్ వాహనాల (PV) హోల్‌సేల్ అమ్మకాలు 2,15,626 యూనిట్లుగా ఉన్నాయని తెలిపింది. గత నవంబర్ 2020లో 2,64,898 యూనిట్లుగా ఉందని.. దాదాపు19 శాతం తగ్గిందని పేర్కొంది.

వాహనాల్లో ఉపయోగించే సెమీకండక్టర్ అంటే ఏమిటి ప్రస్తుతం నిర్మిస్తున్న వాహనాలన్నీ చిప్ లేదా సెమీకండక్టర్ సాయంతో రోడ్లపై తిరుగుతున్నాయి. వాహనంలో మీరు పొందే అన్ని విధులు లేదా అన్ని భాగాలు ఈ చిప్‌ల ద్వారా నియంత్రిస్తారు. సెమీకండక్టర్ ప్రాముఖ్యత మీ వాహనంలో లేకపోతే, మీరు ఎలాంటి ఆధునిక సౌకర్యాలు పొందలేరు. మునుపటి వాహనాల్లో చిప్‌ల వాడకం దాదాపు చాలా తక్కువగా ఉంది. నేటి యుగంలో, సెమీకండక్టర్ ఉపయోగించని ఏ ఎలక్ట్రానిక్ పరికరం కూడా ఉండదు. సెమీకండక్టర్స్ రోజువారీ జీవితంలో ముఖ్యమైన భాగంగా మారాయి. ఈ చిప్ కొరత కారణంగా వాహనాల తయారీ జరగకపోవడమే కాకుండా ఆటోమొబైల్ రంగం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోంది.

చిప్ సంక్షోభాన్ని పరిష్కరించడానికి ప్రభుత్వం ఏమి చేస్తోంది? భారతదేశ ఆర్థికాభివృద్ధిలో ఆటోమొబైల్ రంగం భారీ వాటాను కలిగి ఉంది. దేశ జీడీపీలో ఆటోమొబైల్ రంగం వాటా 7 శాతానికి పైగా ఉంది. సెమీకండక్టర్ల కొరత ఆటోమొబైల్ రంగానికే కాకుండా ప్రభుత్వానికి కూడా పెద్ద తలనొప్పిగా మిగిలిపోయింది. అందుకే చిప్ తయారీ కంపెనీలను ప్రోత్సహించేందుకు భారత ప్రభుత్వం రూ.76 వేల కోట్లతో ప్రోత్సాహక పథకాన్ని సిద్ధం చేసింది. ఈ పథకానికి ఇంకా కేబినెట్ ఆమోదం లభించలేదు. ఈ నెలాఖరులోగా ఈ పథకానికి మంత్రివర్గం ఆమోదం లభించే అవకాశం ఉంది.

చిప్ తయారీ ప్రోత్సాహక కార్యక్రమం రూ.1.7 లక్షల కోట్ల పెట్టుబడులను ఆహ్వానిస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. ప్రభుత్వం ప్రణాళిక.. ఇంటెల్, మీడియాటెక్, క్వాల్‌కామ్ వంటి ప్రధాన చింప్ తయారీదారులను కూడా ఆకర్షిస్తుందని భావిస్తున్నారు.

Read Also.. Indian Railways: భారతీయ రైల్వే వినూత్న ప్రయోగం.. రైళ్లలో రైలు హోస్టెస్‌లను నియమించాలని నిర్ణయం..

కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు
తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు