Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railways: భారతీయ రైల్వే వినూత్న ప్రయోగం.. రైళ్లలో రైలు హోస్టెస్‌లను నియమించాలని నిర్ణయం..

ప్రయాణికులకు మెరుగైన సేవలను అందించేందుకు భారతీయ రైల్వే వినూత్న ప్రయత్నం చేస్తుంది. త్వరలో వందే భారత్, గతిమాన్, తేజస్ ఎక్స్‌ప్రెస్‌లతో కూడిన ప్రీమియం రైళ్లలో రైలు హోస్టెస్‌లను నియమించనున్నారు...

Indian Railways: భారతీయ రైల్వే వినూత్న ప్రయోగం.. రైళ్లలో రైలు హోస్టెస్‌లను నియమించాలని నిర్ణయం..
Train
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Dec 11, 2021 | 8:01 AM

ప్రయాణికులకు మెరుగైన సేవలను అందించేందుకు భారతీయ రైల్వే వినూత్న ప్రయత్నం చేస్తుంది. త్వరలో వందే భారత్, గతిమాన్, తేజస్ ఎక్స్‌ప్రెస్‌లతో కూడిన ప్రీమియం రైళ్లలో రైలు హోస్టెస్‌లను నియమించనున్నారు. అయితే రాజధాని ఎక్స్‌ప్రెస్, దురంతో ఎక్స్‌ప్రెస్ వంటి సుదూర ప్రీమియం రైళ్లలో రైలు హోస్టెస్‌లను ఉండరని తెలిపింది. రైళ్లలో ప్రయాణించే ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలనే ఆలోచనతో ఈ రైలు హోస్టెస్‌లను నియమించాలని నిర్ణయం తీసుకున్నట్లు ఒక సీనియర్ అధికారి Livemint.comకి తెలిపారు.

అయితే వీరంతా పూర్తిగా మహిళా సిబ్బంది ఉండరని, భారతీయ రైల్వే ప్రీమియం రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులకు ఆతిథ్య సేవలను అందించడానికి మగ అటెండర్‌ను కూడా చేర్చుకుంటామని అధికారి తెలిపారు. రైలు హోస్టెస్‎లు ఆహారం అందించడానికి, ఇతర సేవలు అందించనుంది. ఒక మహిళ నవ్వుతూ మీ వద్దకు వస్తే ఆశ్చర్యపోకండి. విమానాల మాదిరిగానే, రైలులో హోస్టెస్‌లు ఉంటారని, క్యాటరింగ్ కూడా విమానాల ప్రమాణాలకు సమానంగా ఉంటుందని అధికారి తెలిపారు. ఈ హోస్టెస్‌లు పగటిపూట మాత్రమే పని చేస్తారని, రాత్రిపూట సేవలు ఉండవని చెప్పారు. ఇందుకు తగినట్లుగానే ఛార్జీలు ఉంటాయన్నారు. రైల్వే అటెండర్ల డ్రస్​ కోడ్‎​లో ఎలాంటి మార్పు లేదని రైల్వేశాఖ తెలిపింది. అయితే మహిళలను మాత్రం ఆతిథ్యరంగంలో శిక్షణ పొందిన వారినే ఎంపిక చేయనున్నట్లు పేర్కొంది.

భారతీయ రైల్వే ప్రస్తుతం 12 శతాబ్ది, ఒక గతిమాన్, రెండు వందే భారత్, ఒక తేజస్ ఎక్స్‌ప్రెస్ వంటి 25 ప్రీమియం రైళ్లను నడుపుతోంది. రైలు ఎక్కేటప్పుడు ప్రయాణికులను పలకరించడం, భోజనం వడ్డించడం, ఫిర్యాదులు వినడం వంటివి రైలు హోస్టెస్‌లు చేస్తారు.

Read Also.. Google Bonus For Employees: గూగుల్​ ఉద్యోగులకు శుభవార్త.. భారీ బోనస్ ప్రకటించిన కంపెనీ..