LPG Cylinder: గ్యాస్‌ వినియోగదారులకు శుభవార్త..! ఇలా చేస్తే ధర తగ్గుతోంది..

LPG Cylinder: మీరు ఎల్పీజీ సిలిండర్‌ ధర తగ్గించాలనుకుంటే ఒక ఐడియా ఉంది. ICICI బ్యాంక్ పాకెట్ యాప్‌ ద్వారా మీరు క్యాష్‌బ్యాక్‌ పొందవచ్చు.

LPG Cylinder: గ్యాస్‌ వినియోగదారులకు శుభవార్త..! ఇలా చేస్తే ధర తగ్గుతోంది..
Lpg
Follow us
uppula Raju

|

Updated on: Dec 11, 2021 | 5:04 PM

LPG Cylinder: మీరు ఎల్పీజీ సిలిండర్‌ ధర తగ్గించాలనుకుంటే ఒక ఐడియా ఉంది. ICICI బ్యాంక్ పాకెట్ యాప్‌ ద్వారా మీరు క్యాష్‌బ్యాక్‌ పొందవచ్చు. ఈ యాప్ మీ మొబైల్ ఫోన్‌లో రన్ అవుతుంది. PhonePe, Google Pay లేదా Paytm వంటి వాటిని ఉపయోగించవచ్చు. మీరు భారత్ గ్యాస్, హెచ్‌పి గ్యాస్ లేదా ఇండేన్ ఏ సిలిండర్‌ని కలిగి ఉన్నారో, ఆ రీఫిల్ బుకింగ్‌పై గరిష్టంగా 10 శాతం క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను పొందవచ్చు. అంటే సిలిండర్ ధర, బుకింగ్ తర్వాత 10% మీ ఖాతాకు తిరిగి వస్తుంది.

మీరు LPG సిలిండర్‌ను మాత్రమే కాకుండా PNGని కూడా ఇలా చేయవచ్చు. ICICI బ్యాంక్ ప్రకారం.. మీరు ఒక నెలలో రూ.200 లేదా అంతకంటే ఎక్కువ బిల్లు చెల్లింపు చేస్తే మీరు 10 శాతం క్యాష్‌బ్యాక్ పొందుతారు. దీని ప్రకారం మీరు 50 రూపాయల వరకు తగ్గింపు పొందవచ్చు. ఇందుకోసం ముందుగా మీ మొబైల్ ఫోన్‌లో ఐసీఐసీఐ పాకెట్స్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. యాప్‌ను డౌన్‌లోడ్ చేసిన తర్వాత దిగువ పేర్కొన్న సూచనలను అనుసరించడం ద్వారా మీరు క్యాష్‌బ్యాక్‌ని పొందవచ్చు.

1. మొదటగా క్యాష్‌బ్యాక్ పొందడానికి మీ మొబైల్ ఫోన్‌లో ICICI పాకెట్స్ యాప్‌ని తెరవండి 2. ‘రీఛార్జ్ & బిల్లులు చెల్లించండి’ అనే విభాగానికి వెళ్లి ‘పే బిల్లులు’పై క్లిక్ చేయండి 3. ఇక్కడ మీరు ‘Choose Biller’ అని చూస్తారు. ఇందేలో మీరు ‘More’ అని ఉన్న ఎంపికపై క్లిక్ చేయాలి 4. ఇక్కడ LPG ఎంపికను చూస్తారు దానిపై క్లిక్ చేయాలి 5. తర్వాత LGP సర్వీస్ ప్రొవైడర్ పేరును చూస్తారు. మీరు ఇండేన్, భారత్ గ్యాస్ లేదా హెచ్‌పి వంటి గ్యాస్ తీసుకునే కంపెనీ పేరు కనిపిస్తుంది. 6. మీరు కస్టమర్‌గా ఉన్న కంపెనీ పేరును ఎంచుకుని మీ మొబైల్ నంబర్‌ను నమోదు చేయాలి. 7. ఇక్కడ మీరు సిలిండర్ బుకింగ్ మొత్తాన్ని చూస్తారు. సిలిండర్ ఖరీదు ఎంత అనేది తెలుస్తుంది. 8. ఇక్కడ మీరు సిలిండర్ బుకింగ్ మొత్తాన్ని చెల్లించాలి. 9. బుకింగ్ తర్వాత 10% క్యాష్‌బ్యాక్ రివార్డ్‌ను పొందుతారు.

మీ వాట్సాప్‌కి ఇలాంటి మెస్సేజ్‌లు వచ్చాయా.. ఖాతా ఖాళీ అవుతుంది జాగ్రత్త.. చూసుకోండి..

కూతురి ఐడీ కార్డ్‌ దొంగిలించిన తల్లి.. కాలేజీలో అడ్మిషన్ తీసుకొని అబ్బాయిలతో డేటింగ్

చలికాలంలో ఈ 4 సమస్యలు విపరీతంగా బాధిస్తాయి..! జాగ్రత్తలు తీసుకోపోతే అంతే సంగతులు