Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కూతురి ఐడీ కార్డ్‌ దొంగిలించిన తల్లి.. కాలేజీలో అడ్మిషన్ తీసుకొని అబ్బాయిలతో డేటింగ్

Mother Stole: అమెరికా నుంచి చాలా విచిత్రమైన కేసు తెరపైకి వచ్చింది. ఇది తెలిసిన తర్వాత మీరు కూడా ఆశ్చర్యపోతారు.

కూతురి ఐడీ కార్డ్‌ దొంగిలించిన తల్లి.. కాలేజీలో అడ్మిషన్ తీసుకొని అబ్బాయిలతో డేటింగ్
Mother Stole
Follow us
uppula Raju

|

Updated on: Dec 11, 2021 | 4:00 PM

Mother Stole: అమెరికా నుంచి చాలా విచిత్రమైన కేసు తెరపైకి వచ్చింది. ఇది తెలిసిన తర్వాత మీరు కూడా ఆశ్చర్యపోతారు. ఇక్కడ ఒక మహిళ తన సొంత కూతురి ఐడీ కార్డును దొంగిలించి కాలేజీలో అడ్మిషన్ తీసుకుంది. అందులో తప్పేముంది అనుకుంటున్నారా.. సదరు మహిళ ఐడి కార్డుపై లక్షల రూపాయల విద్యార్థి రుణం తీసుకుంది. అంతేకాదు కాలేజీకి చెందిన చాలా మంది యువకులతో డేటింగ్ చేయడానికి ప్రయత్నించింది. ఈ మహిళను 48 ఏళ్ల లారా ఓగ్లెస్బేగా గుర్తించారు.

ఈమె చాలా పకడ్బందీగా ప్లాన్ ప్రకారం.. ఈ పని చేసింది. అయితే ఈ మహిళ చాకచక్యం ఎక్కువ కాలం పనిచేయలేదు. చివరకు ఆమె దొంగతనం తెలియడంతో ఆమెకు రూ.19 లక్షల జరిమానా వేస్తూ కోర్టు జైలు శిక్ష విధించింది. మీడియా నివేదికల ప్రకారం.. లారా అనే మహిళ తన కుమార్తె ఐడి కార్డును దొంగిలించి సౌత్ వెస్ట్ బాప్టిస్ట్ విశ్వవిద్యాలయంలో అడ్మిషన్ తీసుకుంది. దీని కోసం ఆ మహిళ కుమార్తె సామాజిక భద్రతా కార్డును ఉపయోగించింది.

అంతే కాదు ఈ దుర్మార్గురాలు తన కూతురు పేరు మీద డ్రైవింగ్ లైసెన్స్ కూడా తీసుకుంది. లారా ఓగ్లెస్బే కాలేజీలో అడ్మిషన్ తీసుకున్న తర్వాత 20 ఏళ్ల అబ్బాయితో డేటింగ్ ప్రారంభించింది. అతనికి తన వయస్సు 22 సంవత్సరాలు అని చెప్పి నమ్మించింది. అంతేకాదు ఆమె తన కుమార్తె పేరుతో స్నాప్‌చాట్‌లో నకిలీ ఖాతాను కూడా సృష్టించింది. తర్వాత ఆమె కుమార్తెలా దుస్తులు ధరించడం ప్రారంభించింది.

యువకులతో డేటింగ్ చేయడానికి లారా తనను తాను యంగ్‌గా కనిపించేలా చేయడానికి హెవీ మేకప్‌ను ఉపయోగించేది. ఆ ఫొటోలు చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. పోలీసులకు దొరికిన తర్వాత ఆ మహిళ తన కుమార్తె ఐడిని ఉపయోగించి కళాశాల నుంచి సుమారు 5 లక్షల రుణం తీసుకుందని తెలిసింది. మోసం బయటపడిన తర్వాత లారా దీనిని ఖండించడం కొనసాగించింది. అయితే కఠినంగా వ్యవహరించడంతో నేరం అంగీకరించింది. ఈ చర్యకు గాను న్యాయస్థానం లారాకు 25 వేల డాలర్ల జరిమానాతో పాటు 5 సంవత్సరాల జైలు శిక్ష విధించింది.

చలికాలంలో ఈ 4 సమస్యలు విపరీతంగా బాధిస్తాయి..! జాగ్రత్తలు తీసుకోపోతే అంతే సంగతులు

చిన్నవయసులోనే జుట్టు తెల్లబడుతుందా..! కలర్ కాకుండా ఈ 2 సహజ పద్దతులు ట్రై చేయండి..

Iron Foods: శరీరంలో ఐరన్‌ స్థాయి పెంచడానికి ఈ 5 ఆహారాలు సూపర్.. అవేంటంటే..?

పవన్ కూతురు ఆద్య చేసిన మంచి పనికి చప్పట్లు కొట్టాల్సిందే.. వీడియో
పవన్ కూతురు ఆద్య చేసిన మంచి పనికి చప్పట్లు కొట్టాల్సిందే.. వీడియో
జాతరలో అశ్లీల నృత్యాలు.. పోలీసుల ఎంట్రీతో సీన్ సితార్..!
జాతరలో అశ్లీల నృత్యాలు.. పోలీసుల ఎంట్రీతో సీన్ సితార్..!
APPSC జూనియర్‌ లెక్చరర్‌ పరీక్షల షెడ్యూల్ 2025 వచ్చేసిందోచ్..
APPSC జూనియర్‌ లెక్చరర్‌ పరీక్షల షెడ్యూల్ 2025 వచ్చేసిందోచ్..
'నల్ల ట్యాక్సీ' అంటూ.. భజ్జీ జాత్యహంకార వ్యాఖ్యలు!
'నల్ల ట్యాక్సీ' అంటూ.. భజ్జీ జాత్యహంకార వ్యాఖ్యలు!
రెడ్ డ్రెస్‌లో అందాల విందు..ఊర్వశీ రౌతేలా బ్యూటిఫుల్ ఫొటోస్
రెడ్ డ్రెస్‌లో అందాల విందు..ఊర్వశీ రౌతేలా బ్యూటిఫుల్ ఫొటోస్
మన దేశంలో ఈ ప్రసిద్ధ దేవాలయాల్లో హిందువులకు మాత్రమే ప్రవేశం..
మన దేశంలో ఈ ప్రసిద్ధ దేవాలయాల్లో హిందువులకు మాత్రమే ప్రవేశం..
నిరుద్యోగ యువతకు భలే ఛాన్స్.. రాజీవ్ యువ వికాసం రాయితీ వాటా పెంపు
నిరుద్యోగ యువతకు భలే ఛాన్స్.. రాజీవ్ యువ వికాసం రాయితీ వాటా పెంపు
రేషన్‌కార్డు ఉన్నవారికి పండుగ ముందే వచ్చింది.. ఉగాది నుంచి..
రేషన్‌కార్డు ఉన్నవారికి పండుగ ముందే వచ్చింది.. ఉగాది నుంచి..
వార్నర్ తెలుగు డెబ్యూ.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో స్టెప్పులు
వార్నర్ తెలుగు డెబ్యూ.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో స్టెప్పులు
గులాబీ అందాలన్నీ ఈ అమ్మడులోనే ఉన్నాయేమో.. పింక్ చీరలో తమన్నా!
గులాబీ అందాలన్నీ ఈ అమ్మడులోనే ఉన్నాయేమో.. పింక్ చీరలో తమన్నా!