చిన్నవయసులోనే జుట్టు తెల్లబడుతుందా..! కలర్ కాకుండా ఈ 2 సహజ పద్దతులు ట్రై చేయండి..

Hair Care Tips: ఆధునిక జీవన శైలి కారణంగా చాలామంది యువతకు యవ్వనంలోనే తెల్లజుట్టు వచ్చేస్తుంది. సహజంగా మన జుట్టు మూలాల్లో ఉండే

చిన్నవయసులోనే జుట్టు తెల్లబడుతుందా..! కలర్ కాకుండా ఈ 2 సహజ పద్దతులు ట్రై చేయండి..
White Hair
Follow us

|

Updated on: Dec 11, 2021 | 2:36 PM

Hair Care Tips: ఆధునిక జీవన శైలి కారణంగా చాలామంది యువతకు యవ్వనంలోనే తెల్లజుట్టు వచ్చేస్తుంది. సహజంగా మన జుట్టు మూలాల్లో ఉండే మెలనిన్ జుట్టుని నల్లగా ఉండేలా చేస్తుంది. కానీ ఈ రోజుల్లోని ఆహారపు అలవాట్లు, అధిక ఒత్తిడి కారణంగా మూల కణాలు దెబ్బతింటున్నాయి. దీని కారణంగా మెలనిన్ ఉత్పత్తి తగ్గుతుంది. దీంతో చిన్న వయసులోనే జుట్టు తెల్లబడటం ప్రారంభమవుతుంది. అయితే జుట్టు తెల్లబడకుండా ఉండేందుకు రకరకాల రంగులు మార్కెట్ లో అమ్ముడవుతున్నాయి. కానీ దాని వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటున్నాయి ఇది జుట్టు పరిస్థితిని మరింత దిగజార్చుతుంది. యవ్వనంలో జుట్టు తెల్లగా మారినట్లయితే వాటిని ఆపడానికి మీరు చాలా ప్రయత్నాలు చేసి ఉంటారు. అలాంటి సమయంలో ఒక్కసారి ఈ సహజమైన మార్గాలు కూడా పాటించండి. మంచి ఫలితాలు ఉంటాయి.

కరివేపాకు కరివేపాకు జుట్టుకి పోషణనిస్తుంది. తెల్ల జుట్టుని నల్లగా చేస్తుంది. కొంత కరివేపాకును కడిగి గ్రైండ్ చేసి, ఆ పేస్ట్‌ని పెరుగులో కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి అరగంట సేపు ఆరనివ్వాలి. తర్వాత తల స్నానం చేయాలి. ఇలా వారానికి రెండు మూడు రోజులు చేయాలి. దీని వల్ల మీ తెల్లజుట్టు నెరసిపోకుండా ఉంటుంది. జుట్టుకి మంచి షైనింగ్ వస్తుంది.

మందార పువ్వు తెల్లదనాన్ని నియంత్రించడానికి మందార సూపర్‌గా పనిచేస్తుంది. ఎందుకంటే ఇందులో మెలనిన్‌ను పెంచే గుణాలు ఉంటాయి. విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఒక టేబుల్ స్పూన్ ఉసిరికాయ రసంలో ఒక టేబుల్ స్పూన్ మందార పూల పొడిని తీసుకుని అరకప్పు కొబ్బరి నూనెలో కలపండి. ఈ పేస్ట్‌ను రాత్రిపూట జుట్టు మూలాలకు అప్లై చేసి, ఉదయాన్నే తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండు మూడు సార్లు చేయాలి. ఇది తెల్లజుట్టుని తగ్గిస్తుంది. జుట్టు మూలాలపై అప్లై చేసి రెండు గంటల పాటు అలాగే ఉంచాలి. కావాలంటే రాత్రంతా జుట్టుకు పట్టించుకోవచ్చు. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే చాలా ప్రయోజనం ఉంటుంది.

వీటిని గుర్తుంచుకోండి ఈ రెమెడీలు పాటించడమే కాకుండా జీవనశైలిని మెరుగుపరచడం కూడా అవసరం. ఒత్తిడి నుంచి దూరంగా ఉండటానికి యోగా, ధ్యానం మొదలైనవి చేయాలి. సుఖవంతమైన నిద్ర అవసరం. డిప్రెషన్ లేదా యాంటీబయాటిక్స్ వాడకాన్ని తగ్గించండి. ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు జుట్టును వస్త్రంతో కప్పుకోండి. హెల్తీ డైట్ తీసుకుంటే జుట్టుకు సరైన పోషకాలు అందుతాయి. బయటి ఆహారానికి దూరంగా ఉంచే మంచిది. ఇలా చేస్తే జుట్టు తెల్లబడకుండా నిరోధించవచ్చు.

Sara Alikhan: అతను చాలా హాట్‌ అంటూ టాలీవుడ్‌ క్రేజీ హీరోపై బాలీవుడ్‌ బ్యూటీ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌..

Shadnagar: యువతి ఫిర్యాదుతో బయటపడ్డ దొంగ స్వామీజీ భాగోతం.. ముందుకొస్తున్న మరికొందరు బాధితులు..

PM Modi: భారత సాంస్కృతిక వికాసానికి ప్రధాని మోడీ పెద్ద పీట.. పూర్వ వైభవం సంతరించుకోనున్న కాశీ నగరం..