Alia Bhatt: ఆర్‌ఆర్‌ఆర్‌ ట్రైలర్‌ లాంచ్‌లో స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచిన సీత.. ఫ్యాషన్‌ ప్రియులను కట్టిపడేసిన అలియా లుక్..

టాలీవుడ్‌తో పాటు యావత్‌ భారతీయ చలన చిత్ర పరిశ్రమ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న చిత్రం ' ఆర్‌ఆర్‌ఆర్‌'. దర్శకధీరుడు రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

Alia Bhatt: ఆర్‌ఆర్‌ఆర్‌ ట్రైలర్‌ లాంచ్‌లో స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచిన సీత.. ఫ్యాషన్‌ ప్రియులను కట్టిపడేసిన అలియా లుక్..
Follow us
Basha Shek

|

Updated on: Dec 11, 2021 | 10:16 AM

టాలీవుడ్‌తో పాటు యావత్‌ భారతీయ చలన చిత్ర పరిశ్రమ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న చిత్రం ‘ ఆర్‌ఆర్‌ఆర్‌’. దర్శకధీరుడు రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌, యంగ్‌ టైగర్‌ హీరోలుగా నటిస్తున్నాడు. అలియాభట్‌, ఓలీవియో మోరీస్‌, శ్రియా శరణ్‌, అజయ్‌దేవ్‌గణ్‌, సముద్రఖని ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 7న ఈచిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ప్రమోషన్‌ కార్యక్రమాలను వేగవంతం చేస్తోన్న చిత్రబృందం వరుసగా అప్‌డేట్లను విడుదల చేస్తోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన పోస్టర్లు, టీజర్లు, గ్లింప్స్‌, పాటలు, అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక ఇటీవల విడుదలైన ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ ట్రైలర్‌ యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది.

కాగా ఈ మూవీ ట్రైలర్‌ లాంఛ్‌ ఇటీవల ముంబయిలో వేడుకగా జరిగింది. హీరో తారక్‌, దర్శకుడు రాజమౌళి, అలియాభట్‌, అజయ్‌ దేవగణ్‌ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాలో రామ్‌చరణ్‌ పక్కన సీత పాత్రలో కనిపించనుంది అలియా. ఈ నేపథ్యంలో ట్రైలర్‌ లాంఛ్‌ ఈవెంట్‌లో ఎన్టీఆర్‌తో పాటు ఆమె కూడా స్పెక్షల్‌ అట్రాక్షన్‌గా నిలిచింది. ముఖ్యంగా సంప్రదాయానికి కాస్త మోడ్రన్‌ టచ్‌ ఇచ్చి ఆమె ధరించిన దుస్తులు ఫ్యాషన్‌ ప్రియులను బాగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఎరుపు రంగు చీరలో వచ్చిన అలియా.. దానికి జోడీగా మ్యాచింగ్‌ కలర్‌ సీక్విన్‌ బ్లౌజ్‌ను ఎంచుకుంది. ఇక చీరపై ఉన్న ఎంబ్రాయిడరీ డిజైనింగ్‌ అలియా అందాన్ని రెట్టింపు చేసింది. కాగా ఈ దుస్తులను ప్రముఖ సెలబ్రిటీ డిజైనర్‌ సబ్యసాచి ముఖర్జీ డిజైన్‌ చేశారు. కాగా ఇదే ఈవెంట్‌లో అలియా ధరించిన గోల్డ్‌ డ్యాంగ్లింగ్‌ చెవిపోగులు, రింగులు, ఇతర ఆభరణాలు ఫ్యాషన్‌ ప్రియులను బాగా ఆకట్టుకున్నాయి.

Also read:

Multibagger stock: లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే రూ.30 లక్షలు వచ్చాయి.. అదీ ఆరు నెలల్లోనే.. ఎలాగంటే..

NTR & Puneeth Raj Kumar: పునీత్ కోసం పాట పాడిన ఎన్టీఆర్.. ఇదే చివరిసారి అంటూ ఎమోషనల్..

Juice Benefits: ఆరోగ్యం కోసం జ్యూస్ తాగుతున్నారా?.. ఈ విషయాలను తప్పక గుర్తుంచుకోండి..!