NTR & Puneeth Raj Kumar: పునీత్ కోసం పాట పాడిన ఎన్టీఆర్.. ఇదే చివరిసారి అంటూ ఎమోషనల్..

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అకాల మరణాన్ని ఇంకా జీర్ణంచుకోలేకపోతున్నారు అభిమానులు. ఫిట్‏గా

NTR & Puneeth Raj Kumar: పునీత్ కోసం పాట పాడిన ఎన్టీఆర్.. ఇదే చివరిసారి అంటూ ఎమోషనల్..
Ntr Puneeth
Follow us
Rajitha Chanti

| Edited By: Anil kumar poka

Updated on: Dec 11, 2021 | 2:25 PM

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అకాల మరణాన్ని ఇంకా జీర్ణంచుకోలేకపోతున్నారు అభిమానులు. ఫిట్‏గా ..తన ఆరోగ్యం పై శ్రద్ద తీసుకునే పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో మరణించడంతో కన్నడ సినీ పరిశ్రమతోపాటు. టాలీవుడ్ ఇండస్ట్రీ ఒక్కసారిగా షాకయ్యింది. అప్పు జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ కన్నీరు పెట్టుకుంటున్నారు అభిమానులు. పునీత్ రాజ్ కుమార్‏కు తెలుగు హీరోలతో చాలా చక్కటి అనుబంధాలు ఉన్నాయి. ముఖ్యంగా టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్.. అప్పుకు ప్రత్యేకమైన స్నేహబంందం ఉంది. ఎన్టీఆర్ చిత్రాలను రీమేక్ చేసి సూపర్ హిట్ అందుకున్నాడు పునీత్. తాజాగా పునీత్ నటించిన చక్రవ్యూహ సినిమా నుంచి గెలయా గెలయా అనే పాట పాడారు ఎన్టీఆర్. నిన్న బెంగుళూరులో జరిగిన ఆర్ఆర్ఆర్ మీడియా సమావేశంలో అప్పును గుర్తుచేసుకుని ఎమోషనల్ అయ్యారు ఎన్టీఆర్.

నిన్న బెంగుళూరులో నిర్వహించిన ఆర్ఆర్ఆర్ ప్రెస్ మీట్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్, అలియా భట్, రాజమౌళి, నిర్మాత దానయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీ మిత్రుడు పునీత్ రాజ్ కుమార్ మరణం గురించి ఏమైనా మాట్లాడగలరా ? అని విలేఖరులు అడగ్గా.. అప్పు చనిపోవడం ఎంతో బాధించిందని… పునీత్ లేని కర్ణాటక శూన్యంగా కనిపిస్తోందని.. ఎక్కడ ఉన్నా తన ఆశీర్వాదాలు మాత్రం తనకు ఎప్పుడూ ఉంటాయని ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడు. ఈ సందర్భంగా.. అప్పు నటించిన చక్రవ్యూహ సినిమా నుంచి గెలయా గెలయా పాట పాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. ఈ పాటను తాను ఇంకెప్పుడు పాడనని.. ఇదే చివరిసారిగా పునీత్ గౌరవార్థం పాడుతున్నానంటూ కన్నీటిపర్యంతం అయ్యారు ఎన్టీఆర్.

ఇక కన్నడలో సొంతంగా డబ్బింగ్ చెప్పడవం వలన భాషపరంగా ఇబ్బంది పడ్డారా అని అడగ్గా.. మా అమ్మ కర్ణాటకకు చెందినవారే. ఆ సినిమా డబ్బింగ్ సమయంలో జాగ్రత్తగా మాట్లాడు అని అమ్మ ఒక్కటే చెప్పారు. కన్నడ రచయిత వరదరాజు మాకు భాషపరంగా శిక్షణ ఇచ్చారు. అందుకే డబ్బింగ్ సమయంలో ఇబ్బందులు రాలేదు అని చెప్పారు ఎన్టీఆర్. ఇక షూటింగ్ చేసుకున్న ఆర్ఆర్ఆర్ మూవీ వచ్చే ఏడాది జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read: రికార్డ్స్ సృష్టిస్తోన్న ఆర్ఆర్ఆర్ ట్రైలర్.. హైదరాబాద్‏లో ప్రెస్‏మీట్ లైవ్..

RRR Press Conference: రికార్డ్స్ సృష్టిస్తోన్న ఆర్ఆర్ఆర్ ట్రైలర్.. హైదరాబాద్‏లో ప్రెస్‏మీట్ లైవ్..

Nithya Menen: ప్రభాస్ ఇష్యూతో మానసికంగా కృంగిపోయాను.. అలా రాయడంతో బాధపడ్డాను.. నిత్యమీనన్ షాకింగ్ కామెంట్స్.

Pushpa Item Song: యూట్యూబ్‎ను షేక్ చేస్తున్న సమంత ఐటెమ్ సాంగ్.. ఈ పాట పాడిన ఫోక్ సింగర్ ఎవరో తెలుసా..