AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pushpa Item Song: యూట్యూబ్‎ను షేక్ చేస్తున్న సమంత ఐటెమ్ సాంగ్.. ఈ పాట పాడిన ఫోక్ సింగర్ ఎవరో తెలుసా..

ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తం పుష్ప ఐటెం సాంగ్ హావా నడుస్తోంది. ఊర మాస్ పాటకు సమంత స్టెప్పులేయడంతో ప్రేక్షకులను

Pushpa Item Song: యూట్యూబ్‎ను షేక్ చేస్తున్న సమంత ఐటెమ్ సాంగ్.. ఈ పాట పాడిన ఫోక్ సింగర్ ఎవరో తెలుసా..
Pushpa
Rajitha Chanti
| Edited By: |

Updated on: Dec 11, 2021 | 2:26 PM

Share

ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తం పుష్ప ఐటెం సాంగ్ హావా నడుస్తోంది. ఊర మాస్ పాటకు సమంత స్టెప్పులేయడంతో ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటుంది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమపై రోజు రోజూకీ అంచనాలు మరింత పెరిగిపోతున్నాయి. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్, పోస్టర్స్, ట్రైలర్‏కు విశేషస్పందన లభిస్తోంది. ఇక ఇందులో సమంత ఊ అంటావా మావా.. ఉహు అంటావా అనే పాటకు నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఇక నిన్న విడుదలైన ఈ పాట ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటుంది. మత్తు వాయిస్‏తో సాగే ఈ పాటకు సమంత మాస్ స్టెప్పులతో అదరగొట్టింది. పాటకు తగినట్టుగా సమంత లుక్ సెట్ కావడం.. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతంతో మరోసారి మార్మోగించడంతో సాంగ్ నెట్టింట్లో వైరల్ అవుతుంది. అయితే ఈ పాట పాడిన సింగర్ గురించి వెతకడం ప్రారంభించారు నెటిజన్స్. చంద్రబోస్ రాసిన ఈ పాటను పాడింది ఫోక్ సింగర్ ఇంద్రావతి చౌహాన్. తన గొంతుతో ఈ పాటకు అదరగొట్టింది. ఇంద్రావతి చౌహాన్.. ఫోక్ సింగర్, సినీ నేపథ్య గాయని మంగ్లీ చెల్లెలు. ఈమె కూడా జానపద పాటలు పాడుతూ గుర్తింపు తెచ్చుకున్నారు. జార్జిరెడ్డి సినిమాలో జాజిమొగులాలి అనే పాట కూడా పాడారు. అలాగే కోటి న్యాయనిర్ణేతగా వ్యవహరించిన బోల్ బేబి బోల్ రియాల్టీ షోలో పాటలు పాడింది ఇంద్రావతి. ఇక ఇప్పుడు ఏకంగా పుష్ప సినిమాలో ఐటెమ్ సాంగ్ పాడే అవకాశం వచ్చింది. ఈ పాట ఆమెకు ఫుల్ క్రేజ్ తెచ్చిపెట్టింది. విడుదలైన కొద్ది గంటల్లోనే మిలియన్ వ్యూస్ అందుకుంటుంది. ముఖ్యంగా ఈ పాటకు.. ఇంద్రావతి వాయిస్‏కు శ్రోతలు అట్రాక్ట్ అవుతున్నారు.

Also Read: రికార్డ్స్ సృష్టిస్తోన్న ఆర్ఆర్ఆర్ ట్రైలర్.. హైదరాబాద్‏లో ప్రెస్‏మీట్ లైవ్..

SS Rajamouli: ఆ స్థాయిలో సినిమాలు తీయడం నాకు చాలా కష్టం.. ఆర్ఆర్ఆర్ పై రాజమౌళి ఆసక్తికర కామెంట్స్

Bigg Boss 5 telugu: కంటెస్టెంట్స్ పై ఆడియన్స్ ప్రశ్నల వర్షం.. షణ్ముఖ్‏కు చుక్కలు చూపించారుగా..

Victrina wedding: పెళ్లికొచ్చిన అతిథులకు గిఫ్ట్‌ బాక్స్‌తో సర్‌ ప్రైజ్‌ చేసిన విక్ర్టీనా దంపతులు.. ఇంతకీ ఆ బాక్స్‌లో ఏమున్నాయంటే..

30 ఏళ్ల క్రితం సినిమా క్లాసిక్ హిట్.. ఇప్పటికీ ట్రెండ్ అవుతున్న ప
30 ఏళ్ల క్రితం సినిమా క్లాసిక్ హిట్.. ఇప్పటికీ ట్రెండ్ అవుతున్న ప
రేపటితో టీమిండియా 5 ఏళ్ల రికార్డు మటాష్ అవుతుందా?
రేపటితో టీమిండియా 5 ఏళ్ల రికార్డు మటాష్ అవుతుందా?
ఓటీటీలో సుదీప్ లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఓటీటీలో సుదీప్ లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్
మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు.. మహిళలు, బీసీలకు..
మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు.. మహిళలు, బీసీలకు..
మరోసారి పోలీస్ పాత్రలో రాణీ ముఖర్జీ.. మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
మరోసారి పోలీస్ పాత్రలో రాణీ ముఖర్జీ.. మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
బిగ్ బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న షాలిని పాండే
బిగ్ బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న షాలిని పాండే
ప్రభాస్ లైనప్ లో ఊరిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్స్
ప్రభాస్ లైనప్ లో ఊరిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్స్
మొన్నటివరకు ఫిజియో థెరపిస్ట్.. ఇప్పుడేమో టాలీవుడ్ క్రేజీ హీరోయిన్
మొన్నటివరకు ఫిజియో థెరపిస్ట్.. ఇప్పుడేమో టాలీవుడ్ క్రేజీ హీరోయిన్
తెలంగాణలో అత్యంత పేదరికంలో మగ్గుతున్నవారికి శుభవార్త..!
తెలంగాణలో అత్యంత పేదరికంలో మగ్గుతున్నవారికి శుభవార్త..!
Hyderabad: ఇబ్రహీంబాగ్ సరస్సులో హాట్ ఎయిర్ బెలూన్ అత్యవసర ల్యాండి
Hyderabad: ఇబ్రహీంబాగ్ సరస్సులో హాట్ ఎయిర్ బెలూన్ అత్యవసర ల్యాండి