SS Rajamouli: ఆ స్థాయిలో సినిమాలు తీయడం నాకు చాలా కష్టం.. ఆర్ఆర్ఆర్ పై రాజమౌళి ఆసక్తికర కామెంట్స్..

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించే సినిమాపై ఆడియన్స్‏కు ఉండే అంచనాల గురించి తెలిసిందే. రాజమౌళి సినిమా బాక్సాఫీస్

SS Rajamouli: ఆ స్థాయిలో సినిమాలు తీయడం నాకు చాలా కష్టం.. ఆర్ఆర్ఆర్ పై రాజమౌళి ఆసక్తికర కామెంట్స్..
Rajamouli
Follow us
Rajitha Chanti

| Edited By: Anil kumar poka

Updated on: Dec 11, 2021 | 2:26 PM

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించే సినిమాపై ఆడియన్స్‏కు ఉండే అంచనాల గురించి తెలిసిందే. రాజమౌళి సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించడం ఖాయమే. చిన్న హీరో అయినా.. స్టార్ హీరో అయినా.. రాజమౌళి దర్శకత్వంలో మూవీ చేస్తే సక్సెస్ అయినట్టే అంటుంటారు. రాజమౌళి సినిమా ప్రారంభం నుంచి అంచనాలు రోజు రోజూకీ పెరుగుతుంటాయి. ఇక ఇప్పుడు ప్రేక్షకుల ఎదురుచూపులు మొత్తం ఆర్ఆర్ఆర్ మూవీపైనే ఉన్నాయి. అత్యంత ప్రతిష్టాత్మకంగా రామ్ చరణ్, తారక్ ప్రధాన పాత్రలో తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ యూట్యూబ్‏లో సంచలనం సృష్టిస్తోంది. ఈ క్రమంలో శుక్రవారం ఆర్ఆర్ఆర్ చిత్రయూనిట్‏తో కలిసి బెంగుళూరులో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఇందులో విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆర్ఆర్ఆర్ టీం సమాధానమిచ్చారు.

ఈ సందర్భారంగా రాజమౌళి మాట్లాడుతూ.. అల్లూరి సీతారామరాజు.. కొమురం భీంలలో ఉన్న ఎనలేని స్పూర్తిని తీసుకుని ఈ సినిమా చేశాం. హిస్టరీతో సంబంధం ఉండదు. బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారిద్దరూ పోరాటం చేశారనేది ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా చూపించాం. హాలీవుడ్ స్టార్స్‏తో మనం ఎందుకు సినిమాలు చేయాలి . మన దగ్గర చాలా మంచి నటులు ఉన్నారు . వాళ్ళతో హాలీవుడ్ స్థాయిలో సినిమాలు తీయడమే నాకు ఇష్టం. బహుబలి సినిమాని తమిళ ప్రజలు ఆదరించారు. ఈ సినిమా కూడా అదే స్థాయిలో ఉంటుంది. రజినీకాంత్ లాంటి గొప్ప నటులతో నేను సినిమా చేయాలంటే అంతే స్థాయిలో మంచి కథ ఉండాలి. పెద్ద హీరోల కోసం సినిమా తీయడం కరెక్ట్ కాదు. స్టోరీ మాత్రమే గొప్ప నటులను జనానికి పరిచయం చేస్తుంది అంటూ చెప్పుకొచ్చారు రాజమౌళి.

ఇక ఆర్ఆర్ఆర్ ట్రైలర్‏కు భారీ స్పందన వస్తుండడంతో రాజమౌళి సంతోషం వ్యక్తం చేశారు. అన్ని ప్రాంతాల నుంచి ఆర్ఆర్ఆర్ ట్రైలర్‏కు వస్తున్న స్పందనతో తమ టీం అంతా చాలా ఎంజాయ్ చేస్తోందని.. ఈ భారీ స్పందన పట్ల ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదంటూ ట్వీట్ చేశారు రాజమౌళి.

ట్వీట్..

Also Read: రికార్డ్స్ సృష్టిస్తోన్న ఆర్ఆర్ఆర్ ట్రైలర్.. హైదరాబాద్‏లో ప్రెస్‏మీట్ లైవ్..

Rajinikanth: పెద్దన్న దర్శకుడి ఇంటికెళ్లిన తలైవా..శివ ఫ్యామీలికి సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌! ..

Bigg Boss 5 telugu: కంటెస్టెంట్స్ పై ఆడియన్స్ ప్రశ్నల వర్షం.. షణ్ముఖ్‏కు చుక్కలు చూపించారుగా..

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!