Rajinikanth: పెద్దన్న దర్శకుడి ఇంటికెళ్లిన తలైవా..శివ ఫ్యామీలికి సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌! ..

తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్, మాస్‌ డైరెక్టర్‌ శివ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం 'అన్నాత్తై'. తెలుగులో 'పెద్దన్న' గా విడుదలైంది. నయనతార హీరోయిన్‌గా నటించగా కీర్తి సురేశ్‌ రజనీ సోదరి పాత్రలో కీర్తి సురేశ్‌ సందడి చేసింది.

Rajinikanth:  పెద్దన్న దర్శకుడి ఇంటికెళ్లిన తలైవా..శివ ఫ్యామీలికి సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌! ..
Follow us
Basha Shek

|

Updated on: Dec 11, 2021 | 7:40 AM

తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్, మాస్‌ డైరెక్టర్‌ శివ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ‘అన్నాత్తై’. తెలుగులో ‘పెద్దన్న’ గా విడుదలైంది. నయనతార హీరోయిన్‌గా నటించగా కీర్తి సురేశ్‌ రజనీ సోదరి పాత్రలో కీర్తి సురేశ్‌ సందడి చేసింది. ఖుష్బూ, మీనా, జగపతి బాబు, ప్రకాశ్‌రాజ్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన యాక్షన్ ఎంటర్ టైనర్‌ భారీగా కలెక్షన్లు రాబట్టింది. ముఖ్యంగా రజనీ అభిమానులు తమ అభిమాన హీరోను సిల్వర్‌ స్ర్కీన్‌పై చూడడానికి థియేటర్లకు క్యూ కట్టారు. కొన్ని రోజుల క్రితం నెట్‌ఫ్లిక్స్‌లో కూడా విడుదలైన ఈసినిమా అక్కడ కూడా ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది. కాగా ‘అన్నా్త్తై’ సినిమాకు వస్తోన్న స్పందనతో రజనీకాంత్‌ హ్యాపీగా ఫీలయ్యారట. ఈ నేపథ్యంలో తనకు సూపర్‌ హిట్‌ అందించిన దర్శకుడు శివకు సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌ను అందజేశారట తలైవా.

ఈ క్రమంలో చెన్నై అన్నానగర్‌లోని శివ ఇంటికి స్వయంగా వెళ్లారట రజనీ. సుమారు 3గంటల సేపు వారి కుటుంబ సభ్యులతో సరదాగా గడిపారట. అనంతరం బహుమతిగా గోల్డ్ చెయిన్‌ను అందజేశారట. దీంతో శివ కుటుంబ సభ్యులు సంతోషంలో మునిగితేలుతున్నారు. కాగా సన్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై కళానిధి మారన్‌ నిర్మించిన ‘అన్నాత్తై’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.240 కోట్ల కలెక్షన్లను రాబట్టిందని సమాచారం. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ లో కూడా ట్రెండింగ్‌లో దూసుకెళుతోంది. కాగా రజనీకాంత్‌- శివ కాంబినేషన్‌ లో మరో సినిమా రాబోతుందని కోలీవుడ్‌ లో టాక్‌ నడుస్తోంది. ‘అన్నాత్తై’ సినిమాను నిర్మించిన సన్‌ పిక్చర్స్‌ కూడా ఈ సినిమాను తెరకెక్కిస్తోందని సమాచారం.

Also Read:

Bigg Boss 5 telugu: కంటెస్టెంట్స్ పై ఆడియన్స్ ప్రశ్నల వర్షం.. షణ్ముఖ్‏కు చుక్కలు చూపించారుగా..

Victrina wedding: పెళ్లికొచ్చిన అతిథులకు గిఫ్ట్‌ బాక్స్‌తో సర్‌ ప్రైజ్‌ చేసిన విక్ర్టీనా దంపతులు.. ఇంతకీ ఆ బాక్స్‌లో ఏమున్నాయంటే..

Varun Tej: మెగా ఫ్యాన్స్‌కు నిరాశ.. గని విడుదల మళ్లీ వాయిదా.. రిలీజ్ ఎప్పుడంటే..