AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Varun Tej: మెగా ఫ్యాన్స్‌కు నిరాశ.. గని విడుదల మళ్లీ వాయిదా.. రిలీజ్ ఎప్పుడంటే..

మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌ హీరోగా నటిస్తున్న స్పోర్ట్స్‌ యాక్షన్‌ చిత్రం 'గని'. బాక్సింగ్‌ నేపథ్యంలో కిరణ్‌ కొర్రపాటి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్‌ ముద్దుగుమ్మ సయూ మంజ్రేకర్‌ వరుణ్‌తో రొమాన్స్‌ చేయనుంది.

Varun Tej: మెగా ఫ్యాన్స్‌కు నిరాశ.. గని విడుదల మళ్లీ వాయిదా..  రిలీజ్ ఎప్పుడంటే..
Basha Shek
|

Updated on: Dec 11, 2021 | 7:04 AM

Share

మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌ హీరోగా నటిస్తున్న స్పోర్ట్స్‌ యాక్షన్‌ చిత్రం ‘గని’. బాక్సింగ్‌ నేపథ్యంలో కిరణ్‌ కొర్రపాటి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్‌ ముద్దుగుమ్మ సయూ మంజ్రేకర్‌ వరుణ్‌తో రొమాన్స్‌ చేయనుంది. ఉపేంద్ర, జగపతి బాబు, నదియా, నరేశ్, నవీన్ చంద్ర తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాలో సిక్స్‌ ప్యాక్‌తో కనిపించనున్నాడు మెగా ప్రిన్స్‌. అదేవిధంగా ఈ చిత్రం కోసం ప్రత్యేకించి బాక్సింగ్ లో శిక్షణ కూడా తీసుకున్నాడు. ఇప్పటికే విడుదలైన ‘గని’ టీజర్లు, పాటలు ఆకట్టుకున్నాయి. మొదట డిసెంబర్ 3నే విడుదల కావాల్సిన ఈ సినిమా కొన్ని కారణాలతో డిసెంబర్ 24కు వాయిదా పడింది . అయితే అదే రోజు నాని ‘శ్యామ్ సింగరాయ’ సినిమా విడుదలవుతోంది. దీంతో తమ సినిమాను మళ్లీ వాయిదా వేస్తున్నట్లు దర్శక నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు సోషల్‌ మీడియా వేదికగా ఓ ప్రకటన విడుదల చేశారు.

‘కరోనా పరిస్థితుల నుంచి ఇప్పుడిప్పుడే సినిమా రంగం కోలుకుంటోంది. రాబోయే వారాల్లో మరికొన్ని సినిమాలు విడుదల కానున్నాయి. ఈ తరుణంలో పోటీ అంత మంచిది కాదు. అందుకే మా సినిమా విడుదలను వాయిదా వేస్తున్నాం. త్వరలో కొత్త రిలీజ్‌ డేట్‌ను ప్రకటిస్తాం. మా సినిమా థియేటర్లలోనే విడుదలవుతుంది’ అని ఆ ప్రకటనలో స్పష్టం చేశారు. అల్లు బాబీ కంపెనీ, రినైసెన్స్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమాకు తమన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు.

Also read:

Khiladi: మాస్ రాజా ఫ్యాన్స్‌కు షాక్.. రవితేజ సినిమా వాయిదా పడనుందా..? కారణం ఏంటంటే..

2022 Movies Release dates: వచ్చే ఏడాది సినిమాల జాతర.. ఏ మూవీ ఎప్పుడు విడుదలంటే..

RRR Trailer: ఆర్ఆర్ఆర్ ట్రైలర్ పై మెగాస్టార్ చిరంజీవి.. మహేష్ బాబు రియాక్షన్స్.. ఓ భీభత్సమంటూ..

రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం
రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..
రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..
పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్
పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్