AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Victrina wedding: పెళ్లికొచ్చిన అతిథులకు గిఫ్ట్‌ బాక్స్‌తో సర్‌ ప్రైజ్‌ చేసిన విక్ర్టీనా దంపతులు.. ఇంతకీ ఆ బాక్స్‌లో ఏమున్నాయంటే..

గత కొన్ని రోజులుగా ప్రేమలో ఉన్న కత్రినా కైఫ్‌- విక్కీ కౌశల్‌ ఒక్కటయ్యారు. రాజస్థాన్‏లోని సవాయ్ మాధోపూర్‏లోని హోటల్ సిక్స్ సెన్సెస్ పోర్ట్ బార్వారాలో వేదికగా వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు.

Victrina wedding: పెళ్లికొచ్చిన అతిథులకు గిఫ్ట్‌ బాక్స్‌తో సర్‌ ప్రైజ్‌ చేసిన విక్ర్టీనా దంపతులు.. ఇంతకీ ఆ బాక్స్‌లో ఏమున్నాయంటే..
Basha Shek
|

Updated on: Dec 11, 2021 | 7:37 AM

Share

గత కొన్నినెలలుగా ప్రేమలో ఉన్న కత్రినా కైఫ్‌- విక్కీ కౌశల్‌ ఒక్కటయ్యారు. రాజస్థాన్‏లోని సవాయ్ మాధోపూర్‏లోని హోటల్ సిక్స్ సెన్సెస్ పోర్ట్ బార్వారాలో వేదికగా వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. ఇరు కుటుంబ సభ్యులతో పాటు సన్నిహితులు, స్నేహితులు, పలువురు బాలీవుడ్‌ ప్రముఖులు ఈ వివాహ వేడుకకు హాజరయ్యారు. నూతన వధూవరులకు శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు. కాగా తమ పెళ్లి వేడుకకు హాజరైన అతిథులను ఒట్టి చేతులతో పంపించకుండా ఓ స్పెషల్‌ గిఫ్ట్‌ బాక్స్‌ను అందజేశారు విక్ట్రీనా దంపతులు. అందులో ఒక పంజాబీ మిఠాయిలతో కూడిన స్వీట్‌బాక్స్‌తో పాటు ఒక స్పెషల్‌ నోట్‌ ఉంది.

‘ఎంతో దూరం నుంచి మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. మీ రాకతో మా వివాహం వేడుకగా ముగిసింది. మా జీవితంలో కొత్త ప్రయాణాన్ని మీ అందరి సమక్షంలో ప్రారంభించబోతున్నాం. మీ రాక, ఆశీర్వచనాలు, అభినందనలు మా పెళ్లి రోజుని మరింత ప్రత్యేకంగా మార్చాయి. మాకు ఇక్కడ ఎంతో సరదాగా గడిచింది. మీరూ బాగానే ఈ వివాహ వేడుకను ఆస్వాదించారని అనుకుంటున్నాం. ఈ పెళ్లివేడుకు ప్రారంభం మాత్రమే. మరెన్నో సంబరాలకు మీరు తప్పక హాజరు కావాలని కోరుకుంటున్నాం’ అని ఆ నోట్‌లో ఉంది. కాగా కరోనా నిబంధనలకు అనుగుణంగా అత్యంత గోప్యంగా విక్ర్టీనాల పెళ్లి జరిగింది. తమ పెళ్లి ఫొటోలను విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసేదాక బయటకు రాలేదు.

Also Read:

Varun Tej: మెగా ఫ్యాన్స్‌కు నిరాశ.. గని విడుదల మళ్లీ వాయిదా.. రిలీజ్ ఎప్పుడంటే..

Avika Gor Photos: హాట్ స్టిల్స్ తో ఆకట్టుకుంటున్న చిన్నారి పెళ్లికూతురు ‘అవికా గోర్’..(ఫొటోస్)

అతిలోక సుందరి శ్రీదేవి మేనకోడలు..శివాజీ గణేశన్ మనవడు జంటగా అందమైన మ్యూజిక్ వీడియో