Shadnagar: యువతి ఫిర్యాదుతో బయటపడ్డ దొంగ స్వామీజీ భాగోతం.. ముందుకొస్తున్న మరికొందరు బాధితులు..

ఓవైపు శాస్త్ర సాంకేతిక రంగంలో మానవుడు ఆకాశానికి నిచ్చెనలు వేస్తున్నప్పటికీ మరోవైపు క్షుద్ర పూజలు, మూఢనమ్మకాలు, చేతబడులను

Shadnagar: యువతి ఫిర్యాదుతో బయటపడ్డ దొంగ స్వామీజీ భాగోతం.. ముందుకొస్తున్న మరికొందరు బాధితులు..
Basha Shek

|

Dec 11, 2021 | 2:31 PM

ఓవైపు శాస్త్ర సాంకేతిక రంగంలో మానవుడు ఆకాశానికి నిచ్చెనలు వేస్తున్నప్పటికీ మరోవైపు క్షుద్ర పూజలు, మూఢనమ్మకాలు, చేతబడులను విశ్వసిస్తూ కొందరు అధఃపాతాళానికి వెళ్లిపోతున్నారు. ముఖ్యంగా కొందరు అమాయక జనాలను లక్ష్యంగా చేసుకుని మోసగిస్తూనే ఉన్నారు. క్షుద్రపూజల పేరుతో వారిని నిలువునా దోచుకుంటూనే ఉన్నారు. ప్రస్తుతం అలాంటి సంఘటనే ఒకటి రంగారెడ్డి జిల్లా షాద్‌ నగర్‌లో చోటు చేసుకుంది. పట్టణానికి కూతవేటు దూరంలో ఉన్న కమ్మదనం గ్రామ శివారులో అనంతపురం ప్రాంతానికి చెందిన శివస్వామి అనే ఓ వ్యక్తి ఇక్కడ గత కొంత కాలంగా ఓ ప్రైవేటు వెంచర్లో ఇల్లు నిర్మించుకున్నాడు. అందులో కాళికామాత విగ్రహాన్ని పెట్టి నిత్యం పూజలు చేస్తున్నాడు. మంత్రాలతో పూనకం వచ్చినట్టు నటిస్తూ ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాడు. గతంలో మధురాపూర్ గ్రామంలో పూజలు చేసినా ఇతన్ని గ్రామస్తులు బెదిరించడంతో అక్కడి నుంచి పారిపోయి ప్రస్తుత వెంచర్ స్థిరపడిపోయాడు. క్షుద్ర పూజలు చేస్తూ మంత్రాలతో అమాయకులను మోసగిస్తూనే ఉన్నాడు. ఇతనితో మోసపోయిన ఓ యువతి షాద్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దొంగస్వామి భాగోతం బయటపడింది.

కాగా తన కుటుంబ పరిస్థితి బాగాలేదని దొంస్వామిజీ దగ్గరికి వెళితే వేల రూపాయలు తీసుకొని మోసం చేశాడని ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా నిందితుడు ఎలా క్షుద్ర పూజలు చేస్తాడో ఆ వీడియోతో సహా ఆధారాలు బయటపెట్టింది. అతని వద్దకు వెళ్లేవారికి కళ్లలో నిమ్మకాయల రసం పిండి వెంట్రుకలు పట్టి పిడి గుద్దులతో కొట్టేవాడని, అమ్మవారి పాదాల కింద ఫొటోలు పెట్టీ వశీకరణ మంత్రం చెప్పేవాడని యువతి చెబుతోంది. ఈ మేరకు అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతోంది. యువతి ఫిర్యాదును తీసుకున్న షాద్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కాగా షాద్ నగర్ చుట్టుపక్కల గ్రామాలతో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన చాలామంది ఈ దొంగస్వామీజీ చేతిలో మోసపోయారని తెలుస్తోంది. గతంలో ఓ ప్రాంతంలో గుప్త నిధుల త్రవ్వకాల కోసం కొంత మందిని తన వెంట తీసుకెళ్లాడని కొంతమంది బాధితులు చెబుతున్నారు. ఎంతో మంది అతని వల్ల మోసపోయారని ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇప్పటికే పదుల సంఖ్యలో బాధితులు బయటికి వచ్చారు. పూర్తి స్థాయిలో విచారణ చేపడితే బాధితుల సంఖ్య పెరిగే అవకాశం ఉందంటున్నారు.

Also Read:

Kitty Party: శిల్ప కేస్ తో వెలుగులోకి కిట్టి పార్టీల బాగోతాలు.. లైవ్ వీడియో

Telangana: మానవత్వం మంటగలవడం అంటే ఇదే.. సులభ్ కాంప్లెక్స్‌లో ప్రసవం?.. ఆ తరువాత పసిబిడ్డను..!

Vijayawada: అవినీతి తిమింగళంపై ACB కొరడా .. అర్ధరాత్రి వరకు సోదాలు.. విచారణకు రావాలని నోటీసులు..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu