AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijayawada: అవినీతి తిమింగళంపై ACB కొరడా .. అర్ధరాత్రి వరకు సోదాలు.. విచారణకు రావాలని నోటీసులు..

అక్రమార్జనే ధ్యేయంగా పని చేస్తున్న కృష్ణా జిల్లా నందిగామ ఎమ్మార్వో పై ఏసీబీ అధికారులు కొరడా ఝులిపించారు. ఎమ్మార్వో చంద్రశేఖర్ పై వస్తున్న వరుస అవినీతి ఆరోపణలతో ఏసీబీ అధికారులు

Vijayawada: అవినీతి తిమింగళంపై ACB కొరడా .. అర్ధరాత్రి వరకు సోదాలు.. విచారణకు రావాలని నోటీసులు..
Basha Shek
|

Updated on: Dec 11, 2021 | 12:17 PM

Share

అక్రమార్జనే ధ్యేయంగా పని చేస్తున్న కృష్ణా జిల్లా నందిగామ ఎమ్మార్వో పై ఏసీబీ అధికారులు కొరడా ఝులిపించారు. ఎమ్మార్వో చంద్రశేఖర్ పై వస్తున్న వరుస అవినీతి ఆరోపణలతో ఏసీబీ అధికారులు కార్యాలయంలో తనిఖీలు చేపట్టారు. అర్ధరాత్రి వరకు ఈ సోదాలు నిర్వహించారు. ఈక్రమంలో కొన్ని పాస్ బుక్ లు, ఇంటి పట్టాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం తదుపరి విచారణంలో భాగంగా విజయవాడలో ని ఏసీబీ కార్యాలయానికి రావాలని నోటీసులు జారీచేశారు. గతంలో జగ్గయ్యపేట ఎమ్మార్వోగా పని చేసిన ఆయన ఇసుక అక్రమ రవాణా చేస్తూ అధికారులకు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. అప్పట్లోనే సస్పెన్షన్‌ వేటుకు గురయ్యాడు. అయినా మార్పు రాలేదు. సస్పెన్షన్‌ తర్వాత నందిగామలో ఎమ్మార్వోగా విధులు చేపట్టిన చంద్రశేఖర్ పాస్ బుక్ కోసం రైతు వద్ద డబ్బులు డిమాండ్ చేశాడు. బాధితులు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అప్రమత్తమైన వారు ఎమ్మార్వో కార్యాలయంలో తనిఖీలు చేపట్టారు. అనంతరం ఎమ్మార్మో కారులోనూ సోదాలు నిర్వహించి నోటీసులు అందజేశారు.

గతంలోనూ ..

కాగా 2017 సెప్టెంబర్ లో జగ్గయ్యపేట తహసీల్దార్ గా విధులు నిర్వహించిన చంద్రశేఖర్ ఇసుక అక్రమ రవాణా కేసులో సస్పెన్షన్‌కు గురయ్యాడు. సీజ్ అయిన రెండు ఇసుక లారీలను చిల్లకల్లు పోలీస్ స్టేషన్ నుంచి తహసీల్దార్ కార్యాలయానికి తీసుకెళతానని చెప్పి తెలంగాణ సూర్యాపేట లోని తన సొంత ఇంటి నిర్మాణానికి వాటిని తరలించే ప్రయత్నం చేశాడు. ఈక్రమంలోనే ఏపీ సరిహద్దులోని గరికపాడు చెక్ పోస్ట్ వద్ద అధికారులకు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఇప్పుడు నందిగామ తహసీల్దార్ గా పనిచేస్తూ మళ్లీ అవినీతికి పాల్పడ్డాడు. రైతుల వద్ద లంచం డిమాండ్ చేశాడన్న ఫిర్యాదును అందుకున్న ఏసీబీ ఆధికారులు తహసీల్దార్‌ కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. అర్హులైన రైతులకు ఇవ్వకుండా నిలిపివేసిన పాస్ బుక్ లు, ఇంటి పట్టాలను స్వాధీనం చేసుకున్నారు. కాగా చంద్రశేఖర్‌పై విచారణ కొనసాగుతుందని, ఒకవేళ ఆరోపణలు నిజమైతే ఈసారి ఆయన జైలుకెళ్లే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

Also Read:

Shocking: వామ్మో…! స్పీకర్‌లో మ్యూజిక్ సైండ్ తగ్గించినందుకు పక్కింటి వ్యక్తిని చంపేశాడు..

CDS Bipin Rawat: బిపిన్ రావత్ మరణంపై ఓ వ్యక్తి సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు.. అరెస్ట్ చేసిన పోలీసులు

Hyderabad News: అసలు వీళ్ళు తల్లిదండ్రులేనా… డబ్బు కోసం కన్నకూతురితో ఆ పనులు చేయమంటూ ఒత్తిడి..