Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CDS Bipin Rawat: బిపిన్ రావత్ మరణంపై ఓ వ్యక్తి సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు.. అరెస్ట్ చేసిన పోలీసులు

CDS Bipin Rawat: సీడీఎస్ చీఫ్ బిపిన్ రావత్‌ ఆకస్మిక మరణంపై ఓ వైపు యావత్ దేశంతో పాటు ప్రపంచ దేశాలు.. విదేశీరాయబారులు సంతాపం తెలియజేస్తూ.. రావత్ తో ఉన్న బంధాన్ని గుర్తు..

CDS Bipin Rawat: బిపిన్ రావత్ మరణంపై ఓ వ్యక్తి సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు.. అరెస్ట్ చేసిన పోలీసులు
Cds General Bipin Rawat
Follow us
Surya Kala

|

Updated on: Dec 10, 2021 | 8:37 PM

CDS Bipin Rawat: సీడీఎస్ చీఫ్ బిపిన్ రావత్‌ ఆకస్మిక మరణంపై ఓ వైపు యావత్ దేశంతో పాటు ప్రపంచ దేశాలు.. విదేశీరాయబారులు సంతాపం తెలియజేస్తూ.. రావత్ తో ఉన్న బంధాన్ని గుర్తు చేసుకుని.. కన్నీరు పెడుతుంటే.. మనదేశంలోని కొందరు ఆయనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా తమిళనాడులోని ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో అమరుడైన సీడీఎస్ చీఫ్ బిపిన్ రావత్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన గుజరాత్ లో ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే..

చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ మరణంపై ఫేస్‌బుక్ పేజీలో అవమానకరమైన వ్యాఖ్యలు చేసిన గుజరాత్‌ లోని  44 ఏళ్ల వ్యక్తిని అహ్మదాబాద్ సైబర్ క్రైమ్ సెల్  అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. నిందితుడు అమ్రేలీ జిల్లాలోని రాజులా తాలూకాకు చెందిన శివాభాయ్ రామ్ గా గుర్తించినట్లు చెప్పారు. రెండు వర్గాల మధ్య ద్వేషాన్ని రెచ్చగొడుతున్నాడని 153-ఏ సెక్షన్ కింద శివభాయ్ రామ్ అదుపులోకి తీసుకున్నారు. మతాన్ని అవమానిస్తున్న కారణంతోనూ 295-ఏ సెక్షన్ కింద కేసు బుక్ చేశారు.

శివభాయ్ రామ్ గతంలో కూడా పలు వివాదాస్పద వ్యాఖ్యలతో పోస్టులు చేసినట్లు.. పలు మార్లు అనుచిత పోస్టులు పెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే బిపిన్ రావత్‌పై ఎటువంటి వ్యాఖ్యలు చేశారన్న అంశాన్ని పోలీసులు  వెల్లడించలేదు. పేస్ బుక్ పేజీ “శివాభాయ్ అహిర్”లో హిందూ దేవతలతో పాటు ఎన్నికైన ప్రజాప్రతినిధులను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసినందుకు శివభాయ్ రామ్ గతంలోనూ అరెస్టయ్యాడని అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ జితేంద్ర యాదవ్ తెలిపారు. నిందితుడు జనరల్ బిపిన్ రావత్‌పై కొన్ని అవమానకరమైన పోస్ట్‌లను షేర్ చేయడంతో మా రాడార్‌లోకి వచ్చాడు. నిందితుని టైమ్‌లైన్‌ని స్కాన్ చేసిన అనంతరం అంతకు ముందు హిందూ దేవుళ్ళు,  దేవతల గురించి అభ్యంతరకరమైన పోస్ట్‌లు షేర్ చేస్తున్నాడని పోలీసులు తెలుసుకున్నారు. శివ భాయ్ పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన త సైబర్‌ క్రైమ్‌ అధికారులు అతని స్వస్థలం నుంచి అరెస్టు చేశారు. తమ దర్యాప్తులో ఇలాంటి వివాదాస్పద పోస్టులు పెట్టి.. వెలుగులోకి రావాలని నిందుతుడు భావిస్తున్నాడని తెలిసిందన్నారు.

Also Read:  మరోసారి విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు అంటూ.. ఉద్యోగులకు సంఘీభావంగా జనసేనాని దీక్ష.. ఏర్పాట్లు చేస్తున్న నేతలు..