Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad News: అసలు వీళ్ళు తల్లిదండ్రులేనా… డబ్బు కోసం కన్నకూతురితో ఆ పనులు చేయమంటూ ఒత్తిడి..

Hyderabad News: తల్లిదండ్రులు తమ సుఖాన్ని సంతోషాన్ని పక్కకు పెట్టి.. తమ శక్తికి మించి కష్టపడేది పిల్లల కోసం.. అందులోనూ తండ్రికి కూతురు అంటే ప్రత్యేకమైన బంధం అనుబంధం..

Hyderabad News: అసలు వీళ్ళు తల్లిదండ్రులేనా... డబ్బు కోసం కన్నకూతురితో ఆ పనులు చేయమంటూ ఒత్తిడి..
Hyderabad News
Follow us
Surya Kala

| Edited By: Janardhan Veluru

Updated on: Dec 10, 2021 | 5:41 PM

Hyderabad News: తల్లిదండ్రులు తమ సుఖాన్ని సంతోషాన్ని పక్కకు పెట్టి.. తమ శక్తికి మించి కష్టపడేది పిల్లల కోసం.. అందులోనూ తండ్రికి కూతురు అంటే ప్రత్యేకమైన బంధం అనుబంధం ఉంటుంది.. ఇక కూతురుకి కూడా తన తండ్రి అంటే ఉండే కేరింగ్ విభిన్నం. ఇక పేద, మధ్య తరగతి కుటుంబాల్లో ఫ్యామిలీ గడవడానికి చిన్న పెద్ద అనే తేడాలేకుండా తమ శక్తికొద్దీ కష్టపడతారు. సంతోషంగా గడుపుతారు. అయితే ఇప్పుడు అన్నిటిలోను మార్పులు వచ్చినట్లు బంధాలు అనుబంధాలు కూడా వ్యాపార బంధాలుగా మారిపోయాయి.. కన్న పేగుని తల్లి లెక్కచేయడం లేదు.. పెంచిన మమకారం తండ్రి పట్టించుకోవడం లేదు… ఇక పిల్లల సంగతి చెప్పనవసరం లేదు.. తల్లిదండ్రులను అనాథలా వదిలేసేవారు ఎందరు .. తాజాగా హైదరాబాద్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. కన్నకూతురు అని కూడా చూడకుండా తాము సుఖంగా బతకడం కోసం తల్లిదండ్రులు ఆమెతో బిక్షాటన చేయించారు. చివరికి వ్యభిచారం చేయాలంటూ కూడా ఒత్తిడి తెచ్చారు. చివరికి ఓ వ్యక్తి చొరవతో ఆ 16 ఏళ్ల బాలికకు విముక్తి లభించింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. వివరాలోకి వెళ్తే..

హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌ రోడ్‌ నంబరు 2లో నివసిస్తున్న తల్లిదండ్రులు తమ 16 ఏళ్ల కూతురుని బిచ్చగత్తెను చేశారు. అమీర్ పెట్ లోని పలు ఆలయాల వద్ద ఆ యువతితో బిక్షాటన చేయించేవారు. అంతేకాదు అడుక్కుని తెస్తున్న డబ్బులు తమ ఖర్చులకు సరిపోవడం లేదంటూ.. వ్యభిచారం చేయాలంటూ ఒత్తిడి కూడా తెచ్చారు.  అయితే ఈ విషయం నవంబర్ 28న చైల్డ్‌ లైన్‌కు గుర్తు తెలియని ఓ వ్యక్తి సంచరం ఇచ్చారు. దీంతో చైల్డ్‌ లైన్‌ సభ్యురాలు ఆ యువతి బిక్షాటన చేసే ప్లేస్ కి వెళ్లారు.. ఆ సమయంలో బాలిక అక్కడ కనిపించలేదు..  అయితే బాలిక ఈనెల 6న ఖమ్మం బస్టాండ్ వద్ద కనిపించిందని సమాచారం తెలియడంతో.. ఖమ్మంలోని చైల్డ్‌ లైన్‌ సమన్వయకర్త.. హైదరాబాద్‌ చైల్డ్‌లైన్‌ సంస్థకు తెలియజేశారు. బస్టాండ్ వద్ద ఉన్న బాలికను సంరక్షణలోకి తీసుకున్నారు. హైదరాబాద్‌ చైల్డ్‌లైన్‌ బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ లో బాలిక తల్లిదండ్రులపై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసు విచారణ చేస్తున్నారు. బాలిక ఇంటినుంచి పారిపోయినా పోలీసులకు ఎటువంటి ఫిర్యాదు చేయకపోవడంతో  బాలికకు ఆమె కన్నతల్లేనా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Also Read:  ఓ ఆర్టిస్టు బిపిన్ రావత్‌కు ఘన నివాళి.. రావి ఆకుపై రావత్ కళాకృతి ..దేశ భక్తి గీతం.. వీడియో వైరల్..