Bipin Rawat: ఓ ఆర్టిస్టు బిపిన్ రావత్‌కు ఘన నివాళి.. రావి ఆకుపై రావత్ కళాకృతి ..దేశ భక్తి గీతం.. వీడియో వైరల్..
Bipin Rawat-Viral Video: పుట్టిన ప్రతి జీవికి మరణం అనివార్యం.. అయితే కొందరు మాత్రం మరణించి చిరంజీవులు. ప్రజల మనస్సులో చోటు సంపాదించుకుని చరిత్ర పుటల్లో..
Bipin Rawat-Viral Video: పుట్టిన ప్రతి జీవికి మరణం అనివార్యం.. అయితే కొందరు మాత్రం మరణించి చిరంజీవులు. ప్రజల మనస్సులో చోటు సంపాదించుకుని చరిత్ర పుటల్లో అమరుల్లా మిగిలిపోతారు. గత రెండు రోజుల క్రితం (డిసెంబర్ 8వ తేదీన) డిఫెన్స్ స్టాఫ్ చీఫ్ (CDS) జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులిక సహా రక్షణ సిబ్బంది తమిళనాడులో జరిగిన హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించారు. అకస్మాత్తుగా దేశం గొప్ప దేశ భక్తులను పోగొట్టుకుంది. దీంతో బిపిన్ రావత్ తో పాటు మిగిలిన అమరవీరులను స్మరించుకుంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం, ఉన్నతాధికారులు సహా సామాన్యులు నివాళులర్పిస్తున్నారు. అమరవీరుల కుటుంబాలకు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ దేశం కోసం చేసిన సేవలను స్మరించుకుంటూ.. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్, నటుడు అనుపమ్ ఖేర్ , IPS అధికారి ధలీవాల్‌లు ఒక ప్రత్యేకమైన కళాఖండం ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అయింది. శశి అనే ఆర్టిస్టు రావి ఆకుపై బిపిన్ రావత్ బొమ్మ కట్ చేసి.. ఓ అద్భుత కళాకండాన్ని సృష్టించాడు. అంతేకాదు.. ఈ ఆకు అలా గాలిలో ఎగురుతూ..నింగిలోకి చేరుకుంటుంది. ఆ వీడియో కి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా దేశ భక్తి గీతం జోడించడంతో ప్రసుత్తం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతుంది. కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా షేర్ చేశారు. ఈ వీడియోకు 26.9 వేల మంది లైక్‌లు, 3,300 రీట్వీట్‌లు లెక్కలేనన్ని సంతాప సందేశాలు వచ్చాయి.
Salute! pic.twitter.com/BVb8grqpgX
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) December 9, 2021
Also Read: ఎలుక కరవడంతో సైంటిస్ట్‌కు కరోనా.. మరిన్ని టెస్టులు చేయాల్సి ఉందన్న నిపుణులు..
సాయితేజ ఫ్యామిలీకి లక్ష సాయం ప్రకటించిన చంద్రబాబు.. ప్రభుత్వం కోటి ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని డిమాండ్..