Hyderabad: నిద్రిస్తున్న భార్యను చంపి.. ఆమె తలతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన భర్త
హైదరాబాద్‌లో ఒళ్లు గగుర్పొడిచే మర్డర్ జరిగింది. ఓ కసాయి మొగుడు తన భార్య తల నరికి పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్లాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది.
హైదరాబాద్‌లో ఒళ్లు గగుర్పొడిచే మర్డర్ జరిగింది. ఓ కసాయి మొగుడు తన భార్య తల నరికి పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్లాడు. రాజేంద్రనగర్‌లో జరిగిన ఈ మర్డర్ స్థానికంగా తీవ్ర భయాందోళనలు రేపింది. భార్య తల తీసుకుని పీఎస్‌కు వచ్చిన నిందితుడు పర్వేజ్‌ను చూసి పోలీసులు సైతం అవాక్కయ్యారు. పెళ్లైన నాటి నుంచి తమ కూతుర్ని వేధిస్తూనే ఉన్నాడని, ఇప్పుడు దారుణంగా చంపేశాడని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. తన కూతుర్ని ఎంత క్రూరంగా చంపాడో… అంతే దారుణంగా పర్వేజ్‌ను శిక్షించాలని మృతురాలి తల్లి డిమాండ్ చేస్తోంది. రాజేంద్రనగర్‌లో ఈ మర్డర్ తీవ్ర కలకలం రేపింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రాజేంద్రనగర్‌లోని ఇమాద్‌నగర్‌లో ఫర్వేజ్ భార్య సమ్రిన్‌తో కలిసి నివాసముంటున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ఫర్వేజ్-సమ్రిన్లకు 14 ఏళ్ల క్రితం పెళ్లయ్యింది. భర్త టార్చర్ తట్టుకోలేక సమ్రిన్ గతంలో విడాకులు తీసుకుంది. భార్యకు మాయమాటలు చెప్పిన ఫర్వేజ్… గతేడాది మళ్లీ ఆమెను ఇంటికి తీసుకువచ్చాడు. ఇన్నాళ్లు భార్య దూరంగా ఉన్నా అతడి మైండ్ సెట్ మారలేదు. కొన్ని రోజులు బాగానే ఉండి.. ఎప్పట్లాగే భార్యను వేధింపులకు గురిచేయడం ప్రారంభించాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవి. దీంతో భార్యను చంపేయాలని డిసైడ్ అయ్యాడు ఫర్వేజ్.
గంజాయి సేవించి.. ఈరోజు తెల్లవారుజామున 4 గంటలకు ఇంటికి వెళ్లాడు. నిద్రపోతున్న సమ్రీన్‌పై కత్తితో దాడి చేశాడు. గొంతు కోసి తలను వేరుచేశాడు. అనంతరం ఆమె తలను తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తీసుకువెళ్లాడు. భార్యపై అనుమానంతోనే ఫర్వేజ్ ఈ హత్యకు పాల్పడినట్టు స్థానికులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.
Also Read: చిన్నారి ప్రమాణిస్తోన్న కార్ మాత్రమే కాదు.. తన మనసు కూడా చాలా రిచ్.. మనసును కదిలించే వీడియో
రాజమౌళి డైరెక్షన్‌ను డామినేట్ చేసిన హీరో అతనొక్కడే.. కీలక కామెంట్ చేసిన కీరవాణి