Telangana News: పండించిన పంటకు గిట్టుబాటు ధరలేదని సీఎం కు లేఖ రాసి.. ఆత్మహత్య చేసుకున్న అన్నదాత..
Telangana News: జైకిసాన్.. రైతే రాజు...రైతు అభివృద్ధి చెందితే... దేశం అభివృద్ధి చెందుతుందని మనకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి నాయకులు, ప్రభుత్వాలు చెప్పేమాట...మన దేశంలో..
Telangana News: జైకిసాన్.. రైతే రాజు…రైతు అభివృద్ధి చెందితే… దేశం అభివృద్ధి చెందుతుందని మనకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి నాయకులు, ప్రభుత్వాలు చెప్పేమాట…మన దేశంలో సారవంతమైన భూములు, కష్టపని పనిచే అనుభవజ్ఞులైన రైతులు, ఆదాయం పెరిగిన ప్రభుత్వాలు కొనుగోలు శక్తి పెరిగిన ప్రజలు ఉండి కూడా రైతుల జీవితంలో వెలుగులు నింపడం లేదు… అన్ని రంగాల్లోని అభివృద్ధి చెందుతున్న మన దేశం ఒక్క వ్యవసాయ రంగంలో మాత్రమే కుచించుకుపోతుంది. ఏ పాలకులు వ్యవసాయాభివృద్ధి పై సరైన దృష్టి పెట్టడం లేదు.. ఎన్నికల సమయంలో చెప్పే వాగ్దానాలు అమలు చేసే సమయం వచ్చే సరికి రైతులకు రిక్త హస్తాలను చూపిస్తున్నారు. ఓవైపు ప్రకృతి విపత్తులు, నకీలీ పురుగు మందులు, పెట్టుబడి కోసం చేసిన అప్పులు వెరసి రైతుల ఆత్మహత్యలకు పురిగొల్పుతున్నాయి. ఈ నేపథ్యంలో అందరికీ అన్నం పెట్టె రైతు.. ఆదాయం లేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నాడు. ఎంత మంది అన్నదాతలు ఆత్మహత్య చేసుకుంటున్నా ప్రభుత్వాలు సరైన చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. తాజాగా తెలంగాణాలో ఓ అన్నదాత ఉసురు తీసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే..
మెదక్ జిల్లాల హవేలి ఘనపూర్ మండలంల బొగుడ భూపతిపూర్ కు చెందిన కె. రవికుమర్ అనే 45 ఏళ్ల రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. తాను పండించిన పంటకు గిట్టుబాటు ధర రాలేదని.. బాధ ఓ వైపు.. ఇంజనీరింగ్ చదివిన కుమారుడికి ఉద్యోగం రాలేదని మనస్తాపం మరోవైపు.. దీంతో తన ప్రాణాలు తీసుకునే దారుణ ఘటనకు పాల్పడినట్లు తెలుస్తోంది. కుటుంబ పెద్ద హఠాత్తుగా మరణించడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర ప్రకటించాలని లేఖ రాసిమరీ అన్నదాత ఆత్మహత్య చేసుకోవడంతో గ్రామంలో విషాదం నెలకొంది.