AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shocking: వామ్మో…! స్పీకర్‌లో మ్యూజిక్ సైండ్ తగ్గించినందుకు పక్కింటి వ్యక్తిని చంపేశాడు..

మనుషులకు పేషెన్స్ తగ్గిపోతుంది. చిన్న, చిన్న విషయాలకే టెంపర్ లేచిపోతుంది. మనం మనుషులుం.. విచక్షణతో ఉండాలి అన్న నియమాన్ని మరిచిపోతున్నారు.

Shocking: వామ్మో...! స్పీకర్‌లో మ్యూజిక్ సైండ్ తగ్గించినందుకు పక్కింటి వ్యక్తిని చంపేశాడు..
Murder
Ram Naramaneni
|

Updated on: Dec 10, 2021 | 9:42 PM

Share

మనుషులకు పేషెన్స్ తగ్గిపోతుంది. చిన్న, చిన్న విషయాలకే టెంపర్ లేచిపోతుంది. మనం మనుషులుం.. విచక్షణతో ఉండాలి అన్న నియమాన్ని మరిచిపోతున్నారు. కోపం వస్తే ఎదుటివారిపై విచక్షణారహితంగా దాడి చేస్తున్నారు. చేతికి ఏది దొరికితే.. దానితో దాడికి తెగబడుతున్నారు. తాజాగా అలాంటి మహారాష్ట్రలోని ముంబైలో అటువంటి షాకింగ్ ఘటనే జరిగింది. ఒక వ్యక్తి తన మ్యూజిక్ సిస్టమ్‌లో ఎక్కవ సౌండ్ పెడుతున్నాడని.. అతని పక్కింటి వ్యక్తి దాడి చేశాడు. దీంతో అతడు స్పాట్‌లోనే ప్రాణాలు విడిచాడు. 25 ఏళ్ల నిందితుడిని ఇప్పుడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరణించిన వ్యక్తి మ్యూజిక్ సౌండ్ తగ్గించడానికి నిరాకరించడంతో..  గొడవ జరిగింది. చివరకు అది ఘర్షణగా మారి ప్రాణాలు తీసేవరుకు వెళ్లింది. మరణించిన వ్యక్తిని సురేంద్ర గౌడ్ (47)గా గుర్తించారు. బుధవారం ముంబై మలాడ్‌లోని.. మాల్వానీ కాలనీ ఏక్తా చాల్ సొసైటీలో జరిగిన ఈ దారుణమైన మర్డర్ వార్త ఆలస్యంగా వెలుగుచూసింది.

మృతుడు, నిందితులు ఇద్దరూ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడిని సైఫ్ అలీ షేక్ (25)గా తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మరణించిన వ్యక్తి తన ఇంటి వెలుపల తన టేప్ రికార్డర్‌లో పాటలు వింటున్నాడు. నిందితుడు అతనిని వాల్యూమ్ తగ్గించమని అడిగాడు. దీనిపై ఇరువురి మధ్య గొడవ జరిగింది. ఘర్షణలో బాధితుడు తలకు గాయాలై.. మరణించాడు. అయితే నిందితుడుకి బాధితుడిని చంపాలనే ఉద్దేశ్యం లేదని.. క్షణికావేశంలోనే హత్య జరిగిందని పోలీసులు తెలిపారు.  బాధితురాలి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని ఐపీసీ సెక్షన్ 302 (హత్య) కింద అభియోగాలు మోపారు. నిందితుడిని కోర్టులో హాజరుపరచి.. న్యాయమూర్తి ఆదేశాలు అనంతరం కస్టడీకి తరలించారు.

Also Read: చిన్నారి ప్రయాణిస్తోన్న కార్ మాత్రమే కాదు.. తన మనసు కూడా చాలా రిచ్.. మనసును కదిలించే వీడియో

 రాజమౌళి డైరెక్షన్​ను డామినేట్​ చేసిన హీరో అతనొక్కడే.. కీలక కామెంట్ చేసిన కీరవాణి

Follow Us
20 ఏళ్ల పోరాటం.. ప్రభుత్వ కొలువు వచ్చిన మర్నాడే రిటైర్‌మెంట్!
20 ఏళ్ల పోరాటం.. ప్రభుత్వ కొలువు వచ్చిన మర్నాడే రిటైర్‌మెంట్!
అభిషేక్ కు ఇచ్చిపడేసిన టీ20 వరల్డ్ కప్ హీరో.. నెంబర్ 1 స్థానంతో..
అభిషేక్ కు ఇచ్చిపడేసిన టీ20 వరల్డ్ కప్ హీరో.. నెంబర్ 1 స్థానంతో..
బడికి వెళ్లే పిల్లలకు బెస్ట్.. లంచ్ బాక్స్‌లోకి రైస్ ఇలా పెట్టండి
బడికి వెళ్లే పిల్లలకు బెస్ట్.. లంచ్ బాక్స్‌లోకి రైస్ ఇలా పెట్టండి
వైభవ్ సూర్యవంశీ గురించి ఇంగ్లాండ్ కెప్టెన్ సంచలన స్టేట్మెంట్..
వైభవ్ సూర్యవంశీ గురించి ఇంగ్లాండ్ కెప్టెన్ సంచలన స్టేట్మెంట్..
పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అప్డేట్.. వెబ్ సైట్ తెరుచుకునేది అప్పుడే..
పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అప్డేట్.. వెబ్ సైట్ తెరుచుకునేది అప్పుడే..
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!