Telangana: మానవత్వం మంటగలవడం అంటే ఇదే.. సులభ్ కాంప్లెక్స్‌లో ప్రసవం?.. ఆ తరువాత పసిబిడ్డను..!

Telangana: తెలంగాణలోని కరీంనగర్‌ జిల్లాలో అమానవీయ ఘటన వెలుగు చూసింది. మనుషుల్లో మానవత్వం మంట గలిసిందనడానికి ఇంతకంటే నిదర్శనం మరొకటి ఉండదేమో.

Telangana: మానవత్వం మంటగలవడం అంటే ఇదే.. సులభ్ కాంప్లెక్స్‌లో ప్రసవం?.. ఆ తరువాత పసిబిడ్డను..!
Just Born
Follow us
Shiva Prajapati

|

Updated on: Dec 11, 2021 | 1:57 PM

Telangana: తెలంగాణలోని కరీంనగర్‌ జిల్లాలో అమానవీయ ఘటన వెలుగు చూసింది. మనుషుల్లో మానవత్వం మంట గలిసిందనడానికి ఇంతకంటే నిదర్శనం మరొకటి ఉండదేమో. ఇంతకీ ఆ దారుణం ఏంటి? అంత అమానవీయ ఘటన ఏం చోటు చేసుకుంది? వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. సులభ్ కాంప్లెక్స్‌లో ప్రసవించిన ఓ మహిళ.. ఆ తరువాత శిశును అక్కడే వదిలేసి వెళ్లింది. ఈ హృదయ విదారక ఘటన కరీననగర్ జిల్లా కేంద్రంలోని రాంనగర్ చేపల మార్కెట్‌లో చోటు చేసుకుంది. సులభ్ కాంప్లెక్స్ నిర్వాహకులు తెలిపిన వివరాల ప్రకారం.. గుర్తు తెలియని ఓ మహిళ అప్పుడే పుట్టిన పసికందును సులభ్ కాంప్లెక్స్‌లోనే వదిలి వెళ్లింది. అయితే, సులభ్ కాంప్లెక్స్‌లోనే ప్రసవించిందని, ఆ తరువాత బిడ్డను అక్కడే వదిలి వెళ్లి ఉంటుందని నిర్వాహకులు చెబుతున్నారు. అయితే, శిశువు మృతి చెంది ఉండటంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతి చెందిన శిశువును పరిశీలించారు. ఘటనపై సులభ్ కాంప్లెక్స్ వాచ్‌మెన్, నిర్వాహకులను ఆరా తీస్తున్నారు. ఆ శిశువు ఎవరు? ఇక్కడే ప్రసవించారా? లేక వేరే ప్రాంతంలో ప్రసవిస్తే ఇక్కడ పడేసి వెళ్లిపోయారా? జన్మించిన తరువాత చనిపోవడం వదిలేసి వెళ్లారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సులభ్ కాంప్లెక్స్ పరిసర ప్రాంతాల్లోని సీసీ ఫుటేజీలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఏదేమైనా.. అప్పుడే పుట్టిన పసికందును సులభ్ కాంప్లెక్స్‌లో వదిలివెళ్లడం కరీంనగర్ టౌన్‌లో సంచలనంగా మారింది. మరీ ఇంత అమానవీయంగా ఎలా ప్రవర్తిస్తారంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Also read:

Viral Video: కత్తి నూరుతున్న కోతి… ఎవరికి మూడిందో మరి.. వైరల్ అవుతున్న షాకింగ్ వీడియో..!

Samantha: విడాకులపై మరోసారి స్పందించిన సమంత.. వచ్చే ఏడాది అలాంటి జీవితం కావాలంటూ..

Fact Check: కరోనా టీకా తీసుకుంటే మూడు నెలల పాటు ఫ్రీ రీఛార్జ్‌!.. ఈ వార్త నిజమేనా?

యశ్ బర్త్ డే రోజున 'టాక్సిక్' నుంచి బిగ్ సర్ ప్రైజ్..
యశ్ బర్త్ డే రోజున 'టాక్సిక్' నుంచి బిగ్ సర్ ప్రైజ్..
ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి శాంసన్ ఔట్.. కారణం ఏంటంటే?
ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి శాంసన్ ఔట్.. కారణం ఏంటంటే?
దేశంలో పెరుగుతోన్న HMPV కేసులు.. గుజరాత్‌లో ఓ పాపకు పాజిటివ్
దేశంలో పెరుగుతోన్న HMPV కేసులు.. గుజరాత్‌లో ఓ పాపకు పాజిటివ్
బాబోయ్‌ ఇదేం రద్దీరా సామీ..! అందమైన నగరాన్ని నరకంలా మార్చేశారుగా
బాబోయ్‌ ఇదేం రద్దీరా సామీ..! అందమైన నగరాన్ని నరకంలా మార్చేశారుగా
ప్రశాంత్ కిషోర్ దీక్ష భగ్నం.. ఆస్పత్రికి తరలించిన పోలీసులు
ప్రశాంత్ కిషోర్ దీక్ష భగ్నం.. ఆస్పత్రికి తరలించిన పోలీసులు
అరెరె.. ఈ డాక్టరమ్మను ఎక్కడో చూసినట్లు ఉంది కదా.. గుర్తు పట్టారా?
అరెరె.. ఈ డాక్టరమ్మను ఎక్కడో చూసినట్లు ఉంది కదా.. గుర్తు పట్టారా?
ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా X ఫ్యాక్టర్‌ ఇతడే.. ఇదిగో ప్రూఫ్
ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా X ఫ్యాక్టర్‌ ఇతడే.. ఇదిగో ప్రూఫ్
మిర్చి రైతు వినూత్న ఆలోచన..పొలంలో పెట్టిన ఫ్లెక్సీ చూస్తే అవాక్కే
మిర్చి రైతు వినూత్న ఆలోచన..పొలంలో పెట్టిన ఫ్లెక్సీ చూస్తే అవాక్కే
ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు.. పూజారి ఇంట్లోకి వచ్చిన చిరుత..
ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు.. పూజారి ఇంట్లోకి వచ్చిన చిరుత..
మరో మంచి పనికి శ్రీకారం చుట్టిన స్టార్ హీరో కిచ్చా సుదీప్
మరో మంచి పనికి శ్రీకారం చుట్టిన స్టార్ హీరో కిచ్చా సుదీప్