AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha: విడాకులపై మరోసారి స్పందించిన సమంత.. వచ్చే ఏడాది అలాంటి జీవితం కావాలంటూ..

సమంత.. నాగచైతన్య విడాకుల ప్రకటన తర్వాత సామ్ పై అనేక రూమర్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. సామ్ ప్రవర్తన

Samantha: విడాకులపై మరోసారి స్పందించిన సమంత.. వచ్చే ఏడాది అలాంటి జీవితం కావాలంటూ..
Samantha
Rajitha Chanti
| Edited By: Anil kumar poka|

Updated on: Dec 11, 2021 | 2:24 PM

Share

సమంత.. నాగచైతన్య విడాకుల ప్రకటన తర్వాత సామ్ పై అనేక రూమర్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. సామ్ ప్రవర్తన నచ్చకపోవడం వలనే విడాకులు తీసుకోవాల్సి వచ్చిందని.. సమంత వ్యక్తిగత జీవితంపై పూర్తిగా నెగిటివ్ కామెంట్స్ వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో సమంతను ట్రోల్ చేస్తూ ఇష్టానుసారంగా మాట్లాడడం పై గతంలోనే స్పందించింది సామ్. తను అందరూ అనుకున్నట్టు కాదు అని.. ప్రస్తుత పరిస్థితుల నుంచి తను కోలుకోవడానికి కాస్త సమయం ఇవ్వాలంటూ సోషల్ మీడియా ద్వారా విజ్ఞప్తి చేసింది సామ్. ఇక ఆ తర్వాత తన కెరీర్ పై దృష్టి సారించి వరుస ప్రాజెక్ట్‏లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తూ.. తిరిగి సినిమాలతో బిజీ అయ్యేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే సామ్ నటించిన శాకుంతలం సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే అల్లు అర్జున్.. డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వస్తున్న పుష్ప మూవీలో స్పెషల్ సాంగ్ చేస్తుంది సమంత..

ఇదిలా ఉంటే.. ఇటీవలే తన విడాకుల గురించి మొదటిసారి స్పందించింది సమంత. విడాకుల అనంతరం తాను కృంగిపోయి చనిపోతానని అనుకున్నానని.. కానీ వాటి నుంచి తెరుకుని బలంగా మారానని.. ఇప్పుడు తనపై తనకు గౌరవంగా ఉందని చెప్పుకొచ్చింది. అయితే విడాకులు ఎందుకు తీసుకున్నారనే విషయాన్ని మాత్రం బయటపెట్టలేదు. తాజాగా ఈటైమ్స్‏కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సమంత మరోసారి తన విడాకుల గురించి స్పందించింది. తన జీవితంలో వచ్చిన మార్పులు.. తనపై వచ్చిన రూమర్స్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది సమంత. విడాకులు తీసుకున్న తర్వాత తన పై వచ్చిన అసత్యపు వార్తల నేపథ్యంలో తాను విడాకుల గురించి మాట్లాడానని.. ప్రస్తుతం ఇంకా దాని గురించి ఏం మాట్లాడాలనుకోవడం లేదని చెప్పింది. కానీ మళ్లీ మళ్లీ అదే విషయం గురించి మాట్లాడం అనవసరమని తెలిపింది.

ఇక 2022లో బిజీగా.. ప్రశాంతవంతమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నట్లు తెలిపింది. అందుకు చాలా కష్టపడుతూ.. అద్భుతమైన పాత్రలు పోషించాలనుకుంటున్నానని. వాటికి న్యాయం చేయడం తన అదృష్టం, వాటికి ఎప్పటికీ న్యాయం చేస్తూనే ఉంటానని ఆశిస్తున్నట్లు సమంత తెలిపింది. ఇక ఇటీవల ఓ మ్యాగజైన్‏కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనను ట్రోల్ చేస్తున్నవారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది సామ్. తన అభిప్రాయాలు, నిర్ణయాలు నచ్చకుంటే వదిలేయాలని.. అంతేకానీ.. తనను ట్రోల్ చేయవద్దని తెలిపింది.

Also Read:  రికార్డ్స్ సృష్టిస్తోన్న ఆర్ఆర్ఆర్ ట్రైలర్.. హైదరాబాద్‏లో ప్రెస్‏మీట్ లైవ్..

RRR Movie: టికెట్స్ రేట్లు తగ్గించడంపై ఏపీ ప్రభుత్వాన్ని సంప్రదిస్తున్నాం..  ఆర్ఆర్ఆర్ ప్రొడ్యూసర్ దానయ్య కామెంట్స్.

Pushpa Item Song: పుష్ప ఐటమ్ సాంగ్.. ఆ పాటను కాపీ చేశారా ?.. ట్రోల్ చేస్తున్న నెటిజన్స్..

Rajamouli: ఆ విషయాలను చెబుతూ తారక్, చరణ్ పై జక్కన్న కంప్లైంట్.. రాజమౌళిని గట్టిగా గిల్లిన ఎన్టీఆర్.. వీడియో..