Pushpa Item Song: పుష్ప ఐటమ్ సాంగ్.. ఆ పాటను కాపీ చేశారా ?.. ట్రోల్ చేస్తున్న నెటిజన్స్..

ఇప్పుడు ఎక్కడ చూసిన పుష్ప ఐటెమ్ సాంగ్ మేనియా కనిపిస్తోంది. నిన్న విడుదలైన సమంత స్పెషల్ సాంగ్

Pushpa Item Song: పుష్ప ఐటమ్ సాంగ్.. ఆ పాటను కాపీ చేశారా ?.. ట్రోల్ చేస్తున్న నెటిజన్స్..
Pushpa Item Song
Follow us
Rajitha Chanti

| Edited By: Anil kumar poka

Updated on: Dec 11, 2021 | 2:25 PM

ఇప్పుడు ఎక్కడ చూసిన పుష్ప ఐటెమ్ సాంగ్ మేనియా కనిపిస్తోంది. నిన్న విడుదలైన సమంత స్పెషల్ సాంగ్ యూట్యూబ్‏లో దూసుకుపోతుంది. మత్తెక్కించే వాయిస్‏.. చంద్రబోస్ లిరిక్స్.. సమంత ఊరమాస్ స్టెప్పులు.. దేవీశ్రీ మ్యూజిక్ ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటున్నాయి. విడుదలైన కొద్ది గంటల్లోనే సోషల్ మీడియాలో మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంటుంది ఈ సాంగ్. యూట్యూబ్‏లో దూసుకుపోతున్న ఊ అంటావా మావ.. ఉహు ఉహు అంటావా అంటూ సాగే ఈ పాటను కాపీ చేశారా ? అంటూ సందేహం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్స్.

ఈ పాట మ్యూజిక్.. లిరిక్స్ అంతా బాగానే ఉన్నాయి కానీ.. సాంగ్ మాత్రం ఇంతకు ముందే ఎక్కడో విన్నట్టుగా అనిపిస్తుందంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. సమంత నటించిన ఈ స్పెషల్ సాంగ్.. తమిళ్ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో నటించిన వీడొక్కడే సినిమాలోని హానీ.. హానీ పాటల ఉందని ట్రోల్ చేస్తున్నారు. ఈ రెండు సాంగ్స్ ఒకేలా ఉన్నాయంటూ కామెంట్స్ చేస్తున్నారు. అదే పాటను పుష్ప కోసం కాపీ చేశారా ? అంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు నెటిజన్స్.

క్రియెటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈమూవీలో బన్నీ.. స్మగ్లర్ లారీ డ్రైవర్ పుష్పరాజ్ పాత్రలో నటిస్తుండగా.. అతని ప్రేయసి శ్రీవల్లి పాత్రలో రష్మిక మందన్న నటిస్తోంది. ఇందులో మలయాళ స్టార్ ఫహద్ పాజిల్ విలన్ రోల్ పోషిస్తుండగా.. సునీల్, అనసూయ కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసున్న మొదటి భాగాన్ని పుష్ప ది రైజ్ పేరుతో ఈనెల 17న విడుదల చేయనున్నారు.

Also Read: రికార్డ్స్ సృష్టిస్తోన్న ఆర్ఆర్ఆర్ ట్రైలర్.. హైదరాబాద్‏లో ప్రెస్‏మీట్ లైవ్..

NTR & Puneeth Raj Kumar: పునీత్ కోసం పాట పాడిన ఎన్టీఆర్.. ఇదే చివరిసారి అంటూ ఎమోషనల్..

RRR Press Conference: రికార్డ్స్ సృష్టిస్తోన్న ఆర్ఆర్ఆర్ ట్రైలర్.. హైదరాబాద్‏లో ప్రెస్‏మీట్ లైవ్..

Spiderman.. No Way Home: సూపర్‌మ్యాన్‌ క్రేజ్‌ మామూలుగా లేదుగా.. హాట్‌ కేకుల్లా అమ్ముడైన అడ్వాన్స్‌ బుకింగ్‌ టిక్కెట్లు..

ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు.. పూజారి ఇంట్లోకి వచ్చిన చిరుత..
ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు.. పూజారి ఇంట్లోకి వచ్చిన చిరుత..
మరో మంచి పనికి శ్రీకారం చుట్టిన స్టార్ హీరో కిచ్చా సుదీప్
మరో మంచి పనికి శ్రీకారం చుట్టిన స్టార్ హీరో కిచ్చా సుదీప్
కోహ్లీకి అదొక్కటే దారి! విలువైన సలహా ఇచ్చిన ఫేమస్ క్రికెటర్..
కోహ్లీకి అదొక్కటే దారి! విలువైన సలహా ఇచ్చిన ఫేమస్ క్రికెటర్..
గిన్నిస్ వరల్డ్ రికార్డులో తెలంగాణడ్రిల్ మ్యాన్.ఒళ్లు గగుర్పొడిచే
గిన్నిస్ వరల్డ్ రికార్డులో తెలంగాణడ్రిల్ మ్యాన్.ఒళ్లు గగుర్పొడిచే
రజనీకాంత్‌కు గుడి కట్టి పూజలు చేస్తోన్న రిటైర్డ్ జవాన్.. వీడియో
రజనీకాంత్‌కు గుడి కట్టి పూజలు చేస్తోన్న రిటైర్డ్ జవాన్.. వీడియో
విలేకరుల సమావేశంలో పాట్ కమ్మిన్స్ క్యూట్ మూమెంట్..
విలేకరుల సమావేశంలో పాట్ కమ్మిన్స్ క్యూట్ మూమెంట్..
బోర్డర్‌తో పాటు ట్రోఫీ అందజేయకపోవడం పై గవాస్కర్ అలక..!
బోర్డర్‌తో పాటు ట్రోఫీ అందజేయకపోవడం పై గవాస్కర్ అలక..!
విరాట్ కోహ్లి రిటైర్మెంట్ రూమర్స్.. ఇప్పుడు మరో గందరగోళం
విరాట్ కోహ్లి రిటైర్మెంట్ రూమర్స్.. ఇప్పుడు మరో గందరగోళం
మ‌ర‌ణించిన చెర్రీ అభిమానుల‌ కుటుంబాలకు దిల్ రాజు ఆర్థిక సాయం
మ‌ర‌ణించిన చెర్రీ అభిమానుల‌ కుటుంబాలకు దిల్ రాజు ఆర్థిక సాయం
గోరుచిక్కుడులోని గొప్ప గుణాలు తెలిస్తే షాక్‌ తినడం ఖాయం..!
గోరుచిక్కుడులోని గొప్ప గుణాలు తెలిస్తే షాక్‌ తినడం ఖాయం..!