Spiderman.. No Way Home: సూపర్‌మ్యాన్‌ క్రేజ్‌ మామూలుగా లేదుగా.. హాట్‌ కేకుల్లా అమ్ముడైన అడ్వాన్స్‌ బుకింగ్‌ టిక్కెట్లు..

'స్పైడర్‌ మ్యాన్‌'.. హాలీవుడ్‌లో తెరకెక్కే ఈ సూపర్‌ హీరో సినిమాలకు ఇండియాలోనూ పెద్ద ఎత్తున అభిమానులున్నారు. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు వచ్చిన సినిమాలన్నీ సూపర్‌ డూపర్‌ హిట్‌గా నిలిచాయి.

Spiderman.. No Way Home: సూపర్‌మ్యాన్‌ క్రేజ్‌ మామూలుగా లేదుగా.. హాట్‌ కేకుల్లా అమ్ముడైన అడ్వాన్స్‌ బుకింగ్‌ టిక్కెట్లు..
Follow us
Basha Shek

|

Updated on: Dec 11, 2021 | 9:10 AM

‘స్పైడర్‌ మ్యాన్‌’.. హాలీవుడ్‌లో తెరకెక్కే ఈ సూపర్‌ హీరో సినిమాలకు ఇండియాలోనూ పెద్ద ఎత్తున అభిమానులున్నారు. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు వచ్చిన సినిమాలన్నీ సూపర్‌ డూపర్‌ హిట్‌గా నిలిచాయి. కాగా ఈ యాక్షన్‌ అడ్వెంచెరస్‌ సిరీస్‌లో వస్తోన్న మరో కొత్త చిత్రం ‘స్పైడర్ మ్యాన్: నో వే హోమ్‌’. టామ్ హోలండ్ టైటిల్ రోల్ నటించిన ఈ సినిమా డిసెంబర్ 17న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కానుంది. అయితే అంతకంటే ఒక్కరోజు ముందే ఇండియాలో అంటే డిసెంబర్ 16న రిలీజ్‌ అవ్వనుంది. కాగా ఈ సూపర్‌ హీరో సినిమా కోసం కొన్ని థియేటర్ల యాజమాన్యాలు అప్పుడే ముందస్తు బుకింగ్‌ను ఓపెన్‌ చేశాయి. అయితే గతంలో ఎన్నడూ లేనట్లు అడ్వాన్స్‌ బుకింగ్‌ ప్రారంభించిన మొదటి రోజే టిక్కెట్లన్నీ హాట్‌ కేకుల్లా అమ్ముడుపోయాయి.

సాధారణంగా లోకల్‌ స్టార్‌ సినిమాలకే ఇలా అడ్వాన్స్‌ బుకింగ్‌ పెద్ద ఎత్తున జరుగుతుంది. కానీ ఓ హాలీవుడ్ సినిమాకు కూడా ఇలా జరగడం మొదటిసారని థియేటర్‌ యాజమాన్యాలు పేర్కొంటున్నాయి. హైదరాబాద్‌లోని ప్రసాద్ ఐమ్యాక్స్‌లో వీకెండ్‌షోలకు సంబంధించి శుక్రవారం సాయంత్రం అడ్వాన్స్‌ బుకింగ్‌ ప్రారంభమైంది. అయితే ఆన్‌లైన్‌లో టిక్కెట్లు పెట్టిన వెంటనే మొత్తం 26 షోలకు సంబంధించిన 8,500 టిక్కెట్లు హాట్‌ కేకుల్లా అమ్ముడుపోయాయట. వీటి ద్వారా దాదాపు రూ. 26 లక్షల ఆదాయం వచ్చిందని తెలుస్తోంది. ఇక కేరళలోని ఏరిస్‌ప్లెక్స్ థియేటర్‌లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఉదయం 5 గంటలకు ప్రదర్శించే స్పెషల్ షో టిక్కట్లన్నీ గంటల వ్యవధిలోనే సేల్‌ అయ్యాయట. అక్కడే ఉన్న అక్కడే మరో థియేటర్‌లో కూడా అన్ని టిక్కెట్లు అమ్ముడుపోయి దాదాపు రూ.17 లక్షలు వసూలయ్యాయట. ఈ నేపథ్యంలో ‘స్పైడర్‌ మ్యాన్‌’ ఫ్యాన్స్‌ కోసం మరిన్ని స్పెషల్‌ షోలు వేసేందుకు థియేటర్‌ యాజమాన్యాలు రెడీ అవుతున్నాయని సమాచారం. కాగా జాన్ వాట్స్ తెరకెక్కించిన ఈ చిత్రంలో జెండయ, జాకబ్ బటలన్, బెనెడిక్ట్ కుంబర్‌బ్యాచ్, జాన్ ఫెవర్యూ, మరిస టొమి తదితరులు కీలక పాత్రలను పోషించారు. ప్రముఖ సోనీ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ సినిమాను ఇంగ్లిష్, హిందీ, తమిళ, తెలుగు భాషల్లో విడుదల చేయనుంది.

Also Read:

RRR Press Conference: RRR ప్రెస్ కాన్ఫరెన్స్ లైవ్ వీడియో

Nithya Menen: ప్రభాస్ ఇష్యూతో మానసికంగా కృంగిపోయాను.. అలా రాయడంతో బాధపడ్డాను.. నిత్యమీనన్ షాకింగ్ కామెంట్స్..

Nayanthara: మరో కొత్త వ్యాపారంలోకి లేడీ సూపర్‌ స్టార్‌.. బ్యూటీ బిజినెస్‌లో పెట్టుబడులు..

ఏఆర్ రెహమాన్ సీరియస్ వార్నింగ్..
ఏఆర్ రెహమాన్ సీరియస్ వార్నింగ్..
BSNL, Jioలో 70 వ్యాలిడిటీ ప్లాన్‌ గురించి తెలుసా? ఏది చౌకైనది..!
BSNL, Jioలో 70 వ్యాలిడిటీ ప్లాన్‌ గురించి తెలుసా? ఏది చౌకైనది..!
అరటిపండు, యాపిల్ కలిపి తింటే ఏమవుతుందో తెలుసా..?తప్పక తెలుసుకోండి
అరటిపండు, యాపిల్ కలిపి తింటే ఏమవుతుందో తెలుసా..?తప్పక తెలుసుకోండి
కల్తీ నెయ్యి కథ తేలే సమయం వచ్చేసింది.. తిరుమల లడ్డు విచారణలో
కల్తీ నెయ్యి కథ తేలే సమయం వచ్చేసింది.. తిరుమల లడ్డు విచారణలో
నెయ్యిలో వేయించిన వెల్లుల్లి తినడం వల్ల బోలెడన్నిఆరోగ్యప్రయోజనాలు
నెయ్యిలో వేయించిన వెల్లుల్లి తినడం వల్ల బోలెడన్నిఆరోగ్యప్రయోజనాలు
ఈవారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యేది ఆమెనా..
ఈవారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యేది ఆమెనా..
మెగా వేలంలో రికార్డ్ ప్రైజ్ పొందే ముగ్గురు అన్‌క్యాప్డ్ ప్లేయర్లు
మెగా వేలంలో రికార్డ్ ప్రైజ్ పొందే ముగ్గురు అన్‌క్యాప్డ్ ప్లేయర్లు
పోస్టాఫీసులు అద్భుతమైన స్కీమ్‌.. నెలకు రూ.20,500
పోస్టాఫీసులు అద్భుతమైన స్కీమ్‌.. నెలకు రూ.20,500
సిద్ధార్థ్‌ హిట్ కొట్టేలా ఉన్నాడే.. ఆసక్తికరంగా 'మిస్‌ యూ' ట్రైలర
సిద్ధార్థ్‌ హిట్ కొట్టేలా ఉన్నాడే.. ఆసక్తికరంగా 'మిస్‌ యూ' ట్రైలర
డస్ట్‌ అలర్జీ బాధిస్తోందా..? ఈ ఆయుర్వేద ఇంటి చిట్కాలు మీకోసం..!
డస్ట్‌ అలర్జీ బాధిస్తోందా..? ఈ ఆయుర్వేద ఇంటి చిట్కాలు మీకోసం..!
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!