Nayanthara: మరో కొత్త వ్యాపారంలోకి లేడీ సూపర్ స్టార్.. బ్యూటీ బిజినెస్‌లో పెట్టుబడులు..
'దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి' అన్న సామెతను బాగా ఫాలో అవుతోంది లేడీ సూపర్ స్టార్ నయనతార. అందుకే ఇప్పుడు తనకున్న సూపర్ క్రేజ్‌ను క్యాష్ చేసుకుంటూ వరుసగా సినిమాలు చేస్తోంది. ఇటీవల 'అన్నా్తై' (తెలుగులో పెద్దన్న) తో ఆకట్టుకున్న
‘దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి’ అన్న సామెతను బాగా ఫాలో అవుతోంది లేడీ సూపర్ స్టార్ నయనతార. అందుకే ఇప్పుడు తనకున్న సూపర్ క్రేజ్‌ను క్యాష్ చేసుకుంటూ వరుసగా సినిమాలు చేస్తోంది. ఇటీవల ‘అన్నా్తై’ (తెలుగులో పెద్దన్న) తో ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ తర్వాతి చిత్రం ‘కాత్తువక్కుల రెండు కాదల్’ త్వరలోనే విడుదల కానుంది. ఇది కాకుండా ఆమె ప్రస్తుతం చిరంజీవి సరసన ‘గాడ్ ఫాదర్’లో నటిస్తోంది. వీటితో పాటు ‘కనెక్ట్’, ‘గోల్డ్’, షారుఖ్ ఖాన్ హీరోగా అట్లీ తెరకెక్కిస్తోన్న ఓ సినిమాలోనూ నయనతారనే హీరోయిన్‌గా ఎంపికైనట్లు సమాచారాం. మరోవైపు తన ప్రియుడు విఘ్నేష్ శివన్‌తో కలిసి రౌడీ పిక్చర్స్ నిర్మాణ సంస్థను స్థాపించి సినిమాలను కూడా నిర్మిస్తోందీ అందాల తార. ఈ బ్యానర్‌లో తెరకెక్కిన ‘కూళంగల్’ అనే చిత్రం భారతదేశం తరఫున అధికారికంగా ఆస్కార్‌కు నామినేట్ అయిన సంగతి తెలిసిందే.
సినిమాల సంగతి పక్కన పెడితే గతంలో చెన్నైకి చెందిన ఛాయ్‌వాలే బేవరేజ్ బ్రాండ్‌లో నయనతార- విఘ్నేష్ పెట్టుబడులు పెట్టారు. కాగా తాజాగా మరో వ్యాపారంలోకి అడుగుపెట్టింది నయనతార. ‘ది లిప్‌బామ్ కంపెనీ’ పేరుతో ఆమె ఓ బ్యూటీ రిటైల్ బ్రాండ్‌ను ప్రారంభించింది. చర్మవ్యాధి నిపుణురాలు అయిన రేణిత రాజన్‌తో కలిసి ఈ బ్రాండ్‌ను లాంచ్ చేసింది. ‘ మా ఇద్దరికీ దశాబ్ద కాలంగా పరిచయం ఉంది. నయనపై నాకు చాలా నమ్మకముంది. అందుకే ఈ బ్రాండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో భాగమయ్యాం. ‘ది లిప్‌బామ్ కంపెనీ’ కి సంబంధించి గత కొన్నేళ్లుగా మా ఇద్దరి మధ్య చర్చలు నడుస్తున్నాయి. కరోనా కారణంగా మరింత ఆలస్యమైంది. అయితే ఎట్టకేలకు మా బ్యూటీ బ్రాండ్‌ను ప్రారంభించాం’ అని రాజన్ చెప్పుకొచ్చారు. కాగా గతంలో కత్రినా కైఫ్ కూడా ఇలాగే బ్యూటీ బిజినెస్‌లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.
View this post on Instagram
Also Read:
Varun Tej: మెగా ఫ్యాన్స్‌కు నిరాశ.. గని విడుదల మళ్లీ వాయిదా.. రిలీజ్ ఎప్పుడంటే..