Puneeth Raj Kumar: అప్పుపై వెలకట్టలేని ప్రేమ.. పునీత్ జ్ఞాపకాలను ఇలా పదిలంగా..
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అకాల మరణాన్ని కన్నడిగులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. ఎంతోమందికి సేవలను
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అకాల మరణాన్ని కన్నడిగులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. ఎంతోమందికి సేవలను చేసిన అప్పుకు అభిమానులు గుండెల్లో గుడికట్టుకున్నారు. అప్పు జ్ఞాపకాలను పదిలంగా భద్రపరుచుకుంటున్నారు. పునీత్ మరణించినప్పటి నుంచి ఆయనపై ఉన్న అభిమానాన్ని వివిధ రకాలుగా వ్యక్తిపరుస్తున్నారు. పునీత్ బాటలోనే మరికొందరు సామాజిక సేవా కార్యాక్రమాలు చేస్తున్నారు. అలాగే చాలా మంది ఫ్యాన్స్ 3D విగ్రహాలను తయారు చేయించుకుంటున్నారు. తెనాలిలో శిల్పికి ఆర్డర్లు వెల్లువెత్తాయి.
పునీత్ రాజ్‌కుమార్.. భౌతికంగా మన మధ్య లేకపోయినా.. కొన్ని కోట్లాది మంది హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఆయన మంచితనం.. చేపట్టిన సేవా కార్యక్రమాలు ఆయనను ఆకాశమంత ఎత్తులో ఉంచాయి. కోట్లాది మంది అప్పు అభిమానులు.. ఆయనను నిత్యం స్మరించుకుంటూనే ఉన్నారు. తమ ఏరియాల్లో పునీత్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఆ క్రమంలోనే తెనాలికి చెందిన శిల్పి కాటూరి వెంకటేశ్వరరావుకు భారీ ఆర్డర్లు వస్తున్నాయి.
కుమారులు.. రవిచంద్ర, శ్రీ హర్షలతో కలిసి 3d ప్రింటింగ్ టెక్నాలజీలో హీరో పునీత్ రాజ్ కుమార్ మినియేచర్ విగ్రహాలు తయారు చేశారు. అభిమానుల కోరిక మేరకు 3d టెక్నాలజీతో విగ్రహాల తయారీ ప్రారంభించారు. ఈ టెక్నాలజీతో తయారైన విగ్రహాలను సూర్య.. శిల్పశాలలో ప్రదర్శించారు. ఈ టెక్నాలజీ ద్వారా 3 అంగుళాల నుంచి 100 అడుగుల వరకు విగ్రహాలు తయారు చేయవచ్చని చెప్పారు. ముఖ్యంగా ఈ విగ్రహాలను ఆఫీసులో, ఇంట్లో, షోకేస్‌లో ప్రదర్శనగా ఉంచుకునే అవకాశం ఉందని చెప్పారు. తన పెద్ద కుమారుడు.. రవిచంద్ర ఇప్పటికే ఐరన్ స్క్రాప్ విగ్రహాల ద్వారా అంతర్జాతీయ ఖ్యాతిని పొందారని, అలాగే శ్రీ హర్ష కూడా 3D టెక్నాలజీ ద్వారా చేసిన విగ్రహాలు చేస్తున్నట్టు తెలిపారాయన.
Also Read: రికార్డ్స్ సృష్టిస్తోన్న ఆర్ఆర్ఆర్ ట్రైలర్.. హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ లైవ్..
Pushpa Item Song: పుష్ప ఐటమ్ సాంగ్.. ఆ పాటను కాపీ చేశారా ?.. ట్రోల్ చేస్తున్న నెటిజన్స్..