RRR movie: మహేశ్‌బాబుతో తర్వాతి సినిమా!.. రాజమౌళి ఏమన్నారంటే..
'బాహుబలి' సిరీస్ తర్వాత దర్శకధీరుడు రాజమౌళి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన చిత్రం 'ఆర్‌ఆర్‌ఆర్'. రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటించగా వారి పక్కన అలియా భట్,
‘బాహుబలి’ సిరీస్ తర్వాత దర్శకధీరుడు రాజమౌళి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్’. రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటించగా వారి పక్కన అలియా భట్, ఓలీవియా మోరీస్ సందడి చేయనున్నారు. శ్రియాశరణ్, అజయ్‌దేవ్‌గణ్, సముద్రఖని తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 7న విడుదలయ్యే ఈ సినిమా కోసం సినిమా ప్రేక్షకులు అమితాసక్తితో ఎదురుచూస్తున్నారు. అందుకు తగ్గట్టే ఇటీవల విడుదలైన ట్రైలర్ యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తోంది. కాగా విడుదల తేదీ దగ్గరపడుతుండడంతో చిత్రబృందం ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేస్తోంది. ఇప్పటికే ముంబయిలో ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌ను నిర్వహించిన మూవీ యూనిట్ ఇప్పుడు ప్రధాన నగరాల్లో ప్రెస్‌మీట్లు నిర్వహిస్తోంది. తాజాగా ‘ఆర్‌ఆర్‌ఆర్’ టీం హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ నిర్వహించింది.
ఈ సమావేశంలో విలేకర్లు అడిగిన పలు ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానాలు చెప్పారు రాజమౌళి. ఇదే క్రమంలో ‘మహేశ్‌బాబుతో సినిమా ఎప్పుడు ఉంటుంది’? అని ఒకరి నుంచి ప్రశ్న ఎదురైంది. దీనికి స్పందించిన దర్శక ధీరుడు తన తదుపరి చిత్రం మహేశ్ బాబుతో ఉంటుందని స్పష్టం చేశారు. ఇప్పటికే ఈ విషయంపై చాలా సార్లు మాట్లాడానని గుర్తు చేశారు. ‘ ఇప్పుడు మహేశ్ సినిమా గురించి ఆలోచించే పరిస్థితి లేదు. ‘ఆర్ఆర్ఆర్’ విడుదలై ఘన విజయం సాధించిన తర్వాత మహేశ్ సినిమా గురించి ఆలోచిస్తాను’ అని సమాధానమిచ్చారు. కాగా మహేశ్ ప్రస్తుతం పరశురాం దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ సినిమా చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read:
Pushpa Item Song: పుష్ప ఐటమ్ సాంగ్.. ఆ పాటను కాపీ చేశారా ?.. ట్రోల్ చేస్తున్న నెటిజన్స్..