AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shyam Singha Roy: రికార్డు ధరకు అమ్ముడైన శ్యామ్‌ సింగరాయ్‌ శాటి లైట్‌ రైట్స్‌!.. నాని కెరీర్‌లోనే రికార్డ్‌ డీల్‌ !

నేచురల్‌ స్టార్‌ నాని నటిస్తోన్న తాజా చిత్రం 'శ్యామ్‌ సింగరాయ్‌'. సాయి పల్లవి, కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్‌ నాని పక్కన సందడి చేయనున్నారు

Shyam Singha Roy: రికార్డు ధరకు అమ్ముడైన శ్యామ్‌ సింగరాయ్‌ శాటి లైట్‌ రైట్స్‌!.. నాని కెరీర్‌లోనే రికార్డ్‌ డీల్‌ !
Basha Shek
|

Updated on: Dec 16, 2021 | 1:58 PM

Share

నేచురల్‌ స్టార్‌ నాని నటిస్తోన్న తాజా చిత్రం ‘శ్యామ్‌ సింగరాయ్‌’. సాయి పల్లవి, కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్‌ నాని పక్కన సందడి చేయనున్నారు. ‘ట్యాక్సీవాలా’తో మంచి గుర్తింపు తెచ్చుకున్న రాహుల్‌ సంకృత్యాన్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు విడుదలైన పోస్టర్లు, టీజర్లు, పాటలు అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక ఇటీవల విడుదలైన సిరివెన్నెల చివరి పాటకు యూట్యూట్‌లో అద్భుతమైన స్పందవ వస్తోంది. కాగా ఇప్పటికే షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ప్రమోషన్‌ కార్యక్రమాలను వేగవంతం చేసింది చిత్రబృందం. ఇందులో భాగంగా ఈనెల 14న వరంగల్‌లోని రంగలీల మైదానంలో ‘శ్యామ్‌ సింగరాయ్‌’ రాయల్‌ ఈవెంట్‌ పేరుతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తోంది.

కాగా ఇప్పటివరకు విడుదలైన ప్రచార చిత్రాలు చూస్తోంటే కోల్‌కతా నేపథ్యంలో చారిత్రక నేపథ్యంతో సినిమా సాగుతుందని తెలుస్తోంది. అదేవిధంగా నాని ఇప్పటివరకు చేయని వైవిధ్యభరితమైన పాత్రలో కనిపిస్తున్నట్లు సమాచారం. ఇలా ఎన్నో ప్రత్యేకతలతో కూడిన ఈ చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి. తాజా సమాచారం ప్రకారం ‘శ్యామ్ సింగరాయ్’ సినిమా తెలుగు శాటిలైట్ హక్కులను రూ. 10 కోట్లకు ఓ ప్రముఖ టీవీ ఛానెల్‌ దక్కించుకుందట. కాగా శాటిలైట్ హక్కుల పరంగా పరంగా నాని సినిమా కెరీర్‌లో ఇదే రికార్డ్‌ డీల్‌ అంటున్నారు. కాగా నాని నటించిన గత చిత్రాలు ‘వి’, ‘టక్‌ జగదీష్‌’ రెండూ ఓటీటీలో విడుదలైన సంగతి తెలిసిందే. మళ్లీ తన మార్కు హిట్‌ కోసం ఎదురుచూస్తోన్న నేచురల్‌ స్టార్‌కు ”శ్యామ్‌ సింగరాయ్‌’ ఎలాంటి విజయాన్నిస్తుందో చూడాలి.

Also Read:

Pushpa Item Song: పుష్ప ఐటమ్ సాంగ్.. ఆ పాటను కాపీ చేశారా ?.. ట్రోల్ చేస్తున్న నెటిజన్స్..

Alia Bhatt: ఆర్‌ఆర్‌ఆర్‌ ట్రైలర్‌ లాంచ్‌లో స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచిన సీత.. ఫ్యాషన్‌ ప్రియులను కట్టిపడేసిన అలియా లుక్..

NTR & Puneeth Raj Kumar: పునీత్ కోసం పాట పాడిన ఎన్టీఆర్.. ఇదే చివరిసారి అంటూ ఎమోషనల్..