Rajamouli: ఆ విషయాలను చెబుతూ తారక్, చరణ్ పై జక్కన్న కంప్లైంట్.. రాజమౌళిని గట్టిగా గిల్లిన ఎన్టీఆర్.. వీడియో..

ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ వేగవంతం చేసింది చిత్రూయూనిట్. ఈ క్రమంలో గత రెండు

Rajamouli: ఆ విషయాలను చెబుతూ తారక్, చరణ్ పై జక్కన్న కంప్లైంట్.. రాజమౌళిని గట్టిగా గిల్లిన ఎన్టీఆర్.. వీడియో..
Rajamouli Ntr
Follow us
Rajitha Chanti

| Edited By: Anil kumar poka

Updated on: Dec 11, 2021 | 2:25 PM

ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ వేగవంతం చేసింది చిత్రూయూనిట్. ఈ క్రమంలో గత రెండు మూడ్రోజుల నుంచి వరుస మీడియా సమావేశాలు నిర్వహిస్తూ.. విలేకర్లతో ముచ్చటిస్తున్నారు ఆర్ఆర్ఆర్ మూవీ టీం. ముంబై, బెంగుళూరులో ప్రెస్ మీట్ నిర్వహించిన చిత్రయూనిట్ శనివారం ఉదయం హైదరాబాద్‏లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా.. ఆర్ఆర్ఆర్ సినిమాపై విలేకర్ల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్.

ఈ సందర్బంగా.. రాజమౌళి మాట్లాడుతూ.. ఆర్ఆర్ఆర్ షూటింగ్ సమయంలో రామ్ చరణ్, తారక్ వలన చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నట్లు చెప్పారు. సినిమా షూటింగ్ దాదాపు 300 రోజులు జరిగిందని.. కానీ వీరిద్దరి వలన దాదాపు 25 రోజులు వృథా అయిపోయాయని.. ఇద్దరికీ 30 ఏళ్ల వయసు వచ్చి.. పెళ్లిళ్లు కూడా అయ్యాయని… చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని.. అన్నా మీ కోసం చచ్చిపోతాం అనే ఫ్యాన్స్ కూడా ఉన్నారు. కానీ.. సెట్లో మాత్రం ఇద్దరూ గొడవ పడేవారని.. అప్పుడు వెంటనే ఎన్టీఆర్ తన వద్దకు వచ్చి.. జక్కన్నా.. నన్ను చరణ్ గిల్లాడు అని చెప్పేవాడు..వెంటనే చరణ్.. నేనా.. ఎప్పుడు గిల్లాను అంటూ నేను స్క్రిప్ట్ లైన్స్ చదువుకుంటున్నానని అమాయకపు ముఖం పెట్టి చెప్పేవాడని రాజమౌళి అన్నారు. అయితే వీరిద్దరి గొడవల గురించి చెబుతున్న సమయంలో ఎన్టీఆర్ పక్కనే ఉన్న రాజమౌళి గిల్లాడు. దీంతో వెంటనే ఎగిరిపడి పక్కనే నిల్చుని మాట్లాడాడు రాజమౌళి.. తమ గొడవల గురించి చెప్పొద్దని మరోవైపు చరణ్ కూడా రాజమౌళిని విజ్ఞప్తి చేయడంతో అక్కడున్నవారంత నవ్వేశారు.

Also Read: రికార్డ్స్ సృష్టిస్తోన్న ఆర్ఆర్ఆర్ ట్రైలర్.. హైదరాబాద్‏లో ప్రెస్‏మీట్ లైవ్..

RRR Movie: టికెట్స్ రేట్లు తగ్గించడంపై ఏపీ ప్రభుత్వాన్ని సంప్రదిస్తున్నాం..  ఆర్ఆర్ఆర్ ప్రొడ్యూసర్ దానయ్య కామెంట్స్.

Shyam Singha Roy: రికార్డు ధరకు అమ్ముడైన శ్యామ్‌ సింగరాయ్‌ శాటి లైట్‌ రైట్స్‌!.. నాని కెరీర్‌లోనే రికార్డ్‌ డీల్‌ !