Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RRR Movie: టికెట్స్ రేట్లు తగ్గించడంపై ఏపీ ప్రభుత్వాన్ని సంప్రదిస్తున్నాం..  ఆర్ఆర్ఆర్ ప్రొడ్యూసర్ దానయ్య కామెంట్స్.

రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రస్తుతం దాదాపుగా 1600 థియేటర్లు ఉన్నాయి. ఏపీలో 1000 థియేటర్లు తెలంగాణలో 600 థియేటర్లు అందుబాటులో

RRR Movie: టికెట్స్ రేట్లు తగ్గించడంపై ఏపీ ప్రభుత్వాన్ని సంప్రదిస్తున్నాం..  ఆర్ఆర్ఆర్ ప్రొడ్యూసర్ దానయ్య కామెంట్స్.
Danayya
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 11, 2021 | 1:05 PM

దర్శకధీరుడు రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రామ్ చరణ్, తారక్ ప్రధాన పాత్రలలో నటిస్తోన్న ఈ మూవీ పై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన పాటలు.. పోస్టర్స్ సైతం నెట్టింట్లో తెగ ట్రెండ్ అవుతున్నాయి. ఇక ఇప్పుడు ఎక్కడ చూసిన ఆర్ఆర్ఆర్ ట్రైలర్ మేనియా కనిపిస్తోంది. విడుదలైన గంటల్లోనే అన్ని భాషల్లో కలిపి 60 మిలియన్స్ వ్యూస్ సాధించింది. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమాను జనవరి 7న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ క్రమంలో మూవీ ప్రమోషన్స్ వేగవంతం చేశారు చిత్రయూనిట్. ఈ క్రమంలో శనివారం ఉదయం నిర్వహించిన ఆర్ఆర్ఆర్ విలేకర్ల సమావేశంలో ప్రొడ్యూసర్ దానయ్య ఆసక్తికర కామెంట్స్ చేశారు.

రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రస్తుతం దాదాపుగా 1600 థియేటర్లు ఉన్నాయి. ఏపీలో 1000 థియేటర్లు తెలంగాణలో 600 థియేటర్లు అందుబాటులో ఉన్నాయి. ఏపీలో సినిమా టికెట్ రేట్లు విషయంలోనే సమస్య ఎదుర్కొంటుంది చిత్రపరిశ్రమ. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 100 రూపాయలు, మున్సిపాలిటీ పరిద్దిలో 60 రూపాయలు, పంచాయతీ పరిధిలో 20 రూపాయలు మించకుండా టికెట్ రేట్లు ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం నిర్ణయించిన రేటుకు ఆన్లైన్ ద్వారా టిక్కెట్లు అమ్మాలనేది ప్రభుత్వ నిర్ణయం. టికెట్ రేటు విషయంలో కొంత వెసులుబాటు ఇస్తే ఆన్లైన్ సిస్టమ్ కు ఓకే అంటోంది సినిమా పరిశ్రమ. అయితే ఆ రేట్లతో థియేటర్లు నడపడం సాధ్యం కాదని, రేట్ల విషయంలో ప్రభుత్వం పునరాలోచించాలని డిమాండ్‌ చేస్తోంది.ఏపీలో సినిమా టికెట్‌ ధరల విషయంలో మీరు ఎన్టీఆర్‌ సాయం ఏమైనా తీసుకుంటారా? ఎందుకంటే ఎన్టీఆర్‌కు ఆప్తులైన ఇద్దరు వ్యక్తులు అక్కడ మంచి స్థాయిలో ఉన్నారు కదా? అని ప్రశ్నించగా.. ‘‘సినిమా టికెట్‌ ధరల విషయంపై ఏపీ ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నాం. త్వరలోనే ఓ కొలిక్కి వస్తోందని భావిస్తున్నామన్నారు దానయ్య.

Also Read: RRR Press Conference Highlights: రికార్డ్స్ సృష్టిస్తోన్న ఆర్ఆర్ఆర్ ట్రైలర్.. హైదరాబాద్‏లో ప్రెస్‏మీట్ లైవ్..

Nithya Menen: ప్రభాస్ ఇష్యూతో మానసికంగా కృంగిపోయాను.. అలా రాయడంతో బాధపడ్డాను.. నిత్యమీనన్ షాకింగ్ కామెంట్స్..

NTR & Puneeth Raj Kumar: పునీత్ కోసం పాట పాడిన ఎన్టీఆర్.. ఇదే చివరిసారి అంటూ ఎమోషనల్..