Fact Check: కరోనా టీకా తీసుకుంటే మూడు నెలల పాటు ఫ్రీ రీఛార్జ్‌!.. ఈ వార్త నిజమేనా?

Covid Vaccine: కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు వ్యాక్సిన్‌ ఒక్కటే మార్గమని ఆరోగ్య నిపుణులు, ప్రభుత్వాలు నొక్కి చెబుతున్నాయి. అందుకే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా టీకా తీసుకోవాలని సూచిస్తున్నాయి.

Fact Check: కరోనా టీకా తీసుకుంటే మూడు నెలల పాటు ఫ్రీ రీఛార్జ్‌!.. ఈ వార్త నిజమేనా?
Follow us
Basha Shek

|

Updated on: Dec 11, 2021 | 12:55 PM

Covid Vaccine: కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు వ్యాక్సిన్‌ ఒక్కటే మార్గమని ఆరోగ్య నిపుణులు, ప్రభుత్వాలు నొక్కి చెబుతున్నాయి. అందుకే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా టీకా తీసుకోవాలని సూచిస్తున్నాయి. వ్యాక్సినేషన్‌ మరింత ముందుకు తీసుకెళ్లడానికి కొన్ని రాష్ట్రాలు కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్నవారికి కొన్ని నజరానాలు, బహుమతులు ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలోనే సైబర్‌ నేరగాళ్లు తమ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. టీకా తీసుకుంటే బహుమతులు, నజరానాలు, క్యాష్‌బ్యాక్‌లు అందిస్తామంటూ వివిధ ఆఫర్లను ప్రకటిస్తూ బురిడీ కొట్టిస్తున్నారు. అలా ఇప్పుడు కూడా ఒక వార్త సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. అదేంటంటే.. టీకా తీసుకున్న వారికి కేంద్ర ప్రభుత్వం మూడు నెలల పాటు ఉచితంగా రీఛార్జ్‌ సౌకర్యం కల్పిస్తుందట. జియోతో పాటు ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌- ఐడియా వినియోగదారులకు ఈ ఆఫర్‌ వర్తిస్తుందని, డిసెంబర్‌ 20 వరకు ఈ అవకాశం ఉందన్న ప్రకటనతో పాటు కొన్ని లింక్‌లు సోషల్‌ మీడియాలో బాగా సర్క్యులేట్‌ అవుతున్నాయి.

ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఈ ప్రకటనల్లో ఏ మాత్రం నిజంలేదని స్పష్టం చేసింది. అసంబద్ధ ప్రకటనలు, నకిలీ పోస్టులు చూసి మోసపోవద్దని సూచించింది. వ్యక్తిగత సమాచారం, బ్యాంకు ఖాతాల వివరాలను ఇతరులతో పంచుకోవద్దని హెచ్చరించింది. అంతకు ముందు సెల్యూలార్‌ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (COAI) కూడా ట్విట్టర్‌ వేదికగా ఈ పోస్టుపై స్పందించింది. ‘ఇలాంటి మోసపూరిత సందేశాల పట్ల జాగ్రత్తగా ఉండండి. ప్రభుత్వం లేదా టెలికాం సర్వీస్ ప్రొవైడర్ల నుంచి ఎలాంటి ఆఫర్లు వెలువడలేదు. దయచేసి ఇలాంటి మోసపూరిత సందేశాలను షేర్ చేయవద్దు. ఈ విషయాల పట్ల మీతో పాటు మీ కుటుంబ సభ్యులు, స్నేహితులను, సన్నిహితులను కూడా అప్రమత్తం చేయండి’ అని ట్వీట్‌లో రాసుకొచ్చింది.

Also Read:

Omicron: వణుకు పుట్టిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్.. దేశ రాజధానిలో మరో కేసు నమోదు

DRDO: పోఖ్రాన్‎లో మల్టీ బ్యారెల్ రాకెట్ లాంచర్ ప్రయోగం విజయవంతం.. 45km లక్ష్యాన్ని ఛేదించిన రాకెట్..

Omicron Threat: చాపకింద నీరులా విస్తరిస్తున్న ఒమిక్రాన్.. మహారాష్ట్ర సర్కారు కీలక నిర్ణయం