AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Omicron: వణుకు పుట్టిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్.. దేశ రాజధానిలో మరో కేసు నమోదు

Omicron Threat: దేశంలో న్యూ వేరియంట్‌ ఒమిక్రాన్ వణుకు పుట్టిస్తోంది. కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో మరో కేసు నమోదైంది.

Omicron: వణుకు పుట్టిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్.. దేశ రాజధానిలో మరో కేసు నమోదు
ఏపీలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదు
Janardhan Veluru
|

Updated on: Dec 11, 2021 | 12:46 PM

Share

Omicron Varient: దేశంలో న్యూ వేరియంట్‌ ఒమిక్రాన్ వణుకు పుట్టిస్తోంది. కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో మరో కేసు నమోదైంది. జింబాబ్వే నుంచి వచ్చిన వ్యక్తికి ఒమిక్రాన్‌ నిర్థారణ అయింది. దీంతో ఢిల్లీలో ఇప్పటివరకు ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 2కు చేరింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 33మంది ఒమిక్రాన్‌ బారిన పడ్డారు. మహారాష్ట్రలో 17, రాజస్థాన్‌లో 9, గుజరాత్‌లో 3, కర్ణాటకలో 2, ఢిల్లీలో 2 కేసులు నమోదయ్యింది.

ఒక్క మహారాష్ట్రలోనే 17కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే 7 కేసులు నమోదవడం, మూడేళ్ల చిన్నారి కూడా న్యూ వేరియంట్‌ బారిన పడటంతో థాక్రే ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. ముంబైలో ర్యాలీలు, బహిరంగ సభలు నిర్వహించకుండా ఆ రాష్ట్ర ప్రభుత్వం 144సెక్షన్‌ విధించింది. రెండ్రోజుల పాటు సభలు, సమావేశాలకు పర్మిషనిచ్చేదిలేదని స్పష్టం చేసింది. నిషేధాజ్ఞలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించింది. ప్రతి ఒక్కరికీ కొవిడ్‌ రూల్స్ తప్పనిసరి చేసింది..భౌతిక దూరం పాటించాలని ఆదేశించింది. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.

ఇటు తెలంగాణలో ఇప్పటి వరకు ఒమిక్రాన్‌ కేసులు నమోదు కాలేదని మంత్రి హరీష్‌రావు తెలిపారు. ఏవైరస్‌ వచ్చినా మాస్కే శ్రీరామ రక్ష అని చెప్పారు. అందరూ మాస్కులు ధరించాలని.. వ్యాక్సినేషన్‌కు కూడా సహకరించాలని విజ్ఞప్తి చేశారు.. బస్తీ దవాఖానాల్లోనూ వ్యాక్సినేషన్‌ను ఉచితంగా అందిస్తున్నామన్నారు మంత్రి హరీష్‌రావు.

Also Read..

Rajamouli: ఆ విషయాలను చెబుతూ తారక్, చరణ్ పై జక్కన్న కంప్లైంట్.. రాజమౌళిని గట్టిగా గిల్లిన ఎన్టీఆర్.. వీడియో..

DRDO: పోఖ్రాన్‎లో మల్టీ బ్యారెల్ రాకెట్ లాంచర్ ప్రయోగం విజయవంతం.. 45km లక్ష్యాన్ని ఛేదించిన రాకెట్..