AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

YS Sharmila: ఆత్మహత్య చేసుకున్న రైతు ఇంటి ముందు మెరుపు దీక్షకు దిగిన వైఎస్‌ షర్మిల.. అడ్డుకున్న పోలీసులు..

మెదక్‌ జిల్లా హవేళి ఘనపూర్ మండలం బోగడ భూపతి పూర్ గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న రైతు కరణం రవి కుటుంబాన్ని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పరామర్శించారు.

YS Sharmila: ఆత్మహత్య చేసుకున్న రైతు ఇంటి ముందు మెరుపు దీక్షకు దిగిన వైఎస్‌ షర్మిల.. అడ్డుకున్న పోలీసులు..
13
Basha Shek
|

Updated on: Dec 11, 2021 | 1:48 PM

Share

మెదక్‌ జిల్లా హవేళి ఘనపూర్ మండలం బోగడ భూపతి పూర్ గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న రైతు కరణం రవి కుటుంబాన్ని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పరామర్శించారు. బలవన్మరణానికి పాల్పడిన అన్నదాత కుటుంబానికి రూ. కోటి ఆర్థిక సాయం ప్రకటించాలని మృతుని ఇంటి ముందు నిరాహార దీక్షకు దిగారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వంపై ఆమె తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ నియంతృత్వ పాలన సాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బంగారు తెలంగాణలో రైతులకు బతుకు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే దీక్షకు కూర్చొన్న షర్మిలను పోలీసులు అడ్డుకున్నారు. ఈక్రమంలో వైఎస్సార్‌టీపీ కార్యకర్తలు, పోలీసులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది.

అంతకు ముందు దీక్షా స్థలిలో కూర్చొన్న షర్మిల తెలంగాణ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ‘తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ నియంత పాలన కొనసాగిస్తున్నారు. అన్నదాతల గుండెలు ఆగిపోయేలా రాజకీయాలు సాగిస్తున్నారు. సీఎం నిరంకుశ పాలన కారణంగా ధాన్యం కుప్పల మీదే రైతులు చనిపోయే దౌర్భాగ్య స్థితి నెలకొంది.  రైతు రవి సీఎం కేసీఆర్ కు లెటర్ రాసి మరీ ఆత్మహత్యకు పాల్పడడం బాధాకరం. తెలంగాణ రాష్ట్రంలో వరి వేయద్దు అనే హక్కు సీఎం కేసీఆర్ కు లేదు. పండించిన పంటను కొనాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. ఆఖరి గింజ వరకు కొంటామని చెప్పిన కేసీఆర్ మాట తప్పుతున్నారు. ప్రస్తుతం రవి కుమార్ కుటుంబం దయనీయ స్థితిలో ఉంది..తల్లిదండ్రులకు పెన్షన్ రావడం లేదు. కొడుకు ఆరోగ్యం బాగాలేదు.. మెడికల్ ఖర్చులు కూడా భారీగా అవుతున్నాయి. ప్రభుత్వం మృతుని కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవాలి’ అని షర్మిల పేర్కొన్నారు.

Also Read:

Sabarimala Special Trains: అయ్యప్ప భక్తులకు శుభవార్త.. సికింద్రాబాద్ నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు.. వివరాలివే..

Telangana MLC Elections: ముగిసిన ఓ(నో)ట్ల పండుగ.. ఓటేసిన తరువాత దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన నేతలు..!

Fact Check: కరోనా టీకా తీసుకుంటే మూడు నెలల పాటు ఫ్రీ రీఛార్జ్‌!.. ఈ వార్త నిజమేనా?