Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kitty Party: కిట్టీ పార్టీ కథా చిత్రమ్.. ఇప్పుడిది ఆటవిడుపు కాదు.. ట్రాప్‌లో పడితే అంతే సంగతులు

కిట్టీ పార్టీ. ఒకప్పుడు కాస్మొపాలిటన్ నగరాల్లో ఎప్పుడో ఓసారి జరుపుకునే ఆటవిడుపు. వీలైతే అపార్ట్‌మెంట్ వాసులు, లేదంటే ఆ గల్లీ వాసులంతా జరుపుకునే సరదా పార్టీ.

Kitty Party: కిట్టీ పార్టీ కథా చిత్రమ్.. ఇప్పుడిది ఆటవిడుపు కాదు.. ట్రాప్‌లో పడితే అంతే సంగతులు
Kitty Party
Follow us
Janardhan Veluru

|

Updated on: Dec 11, 2021 | 11:40 AM

కిట్టీ పార్టీ.. ఒకప్పుడు కాస్మొపాలిటన్ నగరాల్లో ఎప్పుడో ఓసారి జరుపుకునే ఆటవిడుపు. వీలైతే అపార్ట్‌మెంట్ వాసులు, లేదంటే ఆ గల్లీ వాసులంతా జరుపుకునే సరదా పార్టీ. కాని రానురాను ఈ పార్టీల తీరు మారింది. ఇందులోకి అనేక అంశాలకు చొచ్చుకొచ్చాయి. అసలు కాన్సెప్ట్‌ పక్కకు పోయి బిజినెస్‌ అందులోకి ఎంటరైంది. శిల్పా చౌదరిలాంటి వాళ్లు.. తమ వ్యాపారాన్నిపెంచుకునేందుకు వీటిని ఏర్పాటు చేస్తున్నారు. బ్లాక్‌ మనీని వైట్‌గా మార్చుకునేందుకు పెద్దలు ఇలాంటి పార్టీలకు అటెండై వారి డబ్బును పదిలం చేసుకుంటున్నారు. ఒకప్పుడు వెయ్యి, రెండు వేల రూపాయలతో మొదలైన కిట్టీ పార్టీల వ్యవహారం ఇప్పుడు లక్షలకు పరుగెత్తింది. దీని వెనుక కోట్ల రూపాయల వ్యాపారం ఉంది. ఒక శిల్పా చౌదరి, మరో గుత్తా సమన్ కిట్టీ పార్టీల పేరుతో నిర్వహిస్తున్న దాని వెనుకంత మనీ మ్యాటరే కనిపిస్తోంది.

కిట్టీ పార్టీలలో ఏం జరుగుతోంది? నాటి స్వరూపం ఏంటి? నేటి రూపమేంటి? ఆట విడుపు కోసం జరిగే కిట్టీ పార్టీల్లో చిట్టీల వ్యాపారం ఎంటరైంది. ఈ క్రమంలో కొందరు బడా మహిళలు బిల్డప్ చూపించడం కోసం కిట్టీ పార్టీని నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్లారు. కిట్టీ పార్టీల్లో పార్టిసిపేట్ చేసే వారు ఇచ్చేది కొంతైతే.. నిర్వాహకులే ఎక్కువ మొత్తం ఖర్చు చేసి డాంబికం ప్రదర్శిస్తున్నారు. బిల్డప్‌ చూపడం ద్వారా పార్టిసిపేట్ చేసిన వారిని అట్రాక్ట్ చేయవచ్చనేది దాని వెనుకున్న ఫార్మూలా. శిల్పా చౌదరి సైతం సరిగ్గా ఇదే తీరును ప్రదర్శించింది.

కిట్టీ పార్టీ అంటే ఆట విడుపు కోసం నిర్వహించే సరదా పార్టీ. అందులోకి బిజినెస్‌ ఎంటర్ అయ్యాకు శిల్పా చౌదరి లాంటి వారు దాని స్వరూపం మార్చేసి రకరకాలుగా వాడుకుంటున్నారు. ఇన్వెస్ట్‌మెంట్సే ఇందులో ప్రధాన టార్గెట్. రియల్‌ ఎస్టేట్ లాంటి వ్యాపారంలోకి పెట్టుబడులు ఆహ్వానించడమే టార్గెట్‌గా ఈ కిట్టీ పార్టీలు మారాయి. వీలైతే ఆస్తులపై డైరెక్ట్ పెట్టుబడి.. లేదంటే తక్కువ వడ్డీలకు నగదు కలెక్ట్ చేసి.. ఎక్కువ వడ్డీలకు ఇవ్వడం మరో వ్యాపారంగా మారింది. శిల్పా చౌదరి అయితే ఏకంగా సినిమాల్లో పెట్టుబడి పెట్టింది.

ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. కిట్టీ పార్టీలతో ఇన్వెస్ట్‌మెంట్స్ ఆహ్వానించే వాళ్లు కొందరైతే.. చీరలు, లేడీస్‌ నీడ్స్ బిజినెస్‌ చేసే వాళ్లు ఇంకొందరు. ఇదంతా పదుల్లో, వందల రూపాయాల్లో జరిగే వ్యవహారం కాదు. దీని వెనుక లక్షల రూపాయల బిజినెస్ ఉంది. అందుకే కొందరు కిట్టీ పార్టీలను బిజినెస్‌గా మార్చుకున్నారు. షాప్‌కు వెళ్లి కొనుక్కోవడం ఎందుకు దండుగ, కిట్టీ పార్టీలు మనకుండగా అన్నట్లుగా మార్చేశారు.

సంప్రదాయ కిట్టీ పార్టీల స్వరూపం ఇప్పుడు మారిపోయింది. ఈ ఇంటి అక్క, ఆ ఇంటి అక్క వచ్చి ఒక దగ్గర కూర్చొని నాలుగు ముచ్చట్లు మాట్లాడుకొని, సరదాగా ఆడి పాడి భోజనాలు చేసి వెళ్లే రోజులకు ఇప్పుడు కాలం చెల్లింది. కిట్టీ పార్టీల్లో విచ్చలవిడితనం పెరిగిపోయింది. కిట్టీ పార్టీల పేరుతో బయట నుంచి జనాన్ని పిలిపిస్తున్నారంటే.. అవి ఎలా జరుగుతున్నాయో మనం అర్థం చేసుకోవచ్చు.

కిట్టీ పార్టీ ఇప్పుడు పది మంది మహిళలు ఒక్క దగ్గర కూర్చొని ఆడిపాడే సరదా కాదు. కొందరికి ఈవెంట్ మేనేజ్‌మెంట్. డబ్బులు సంపాదించుకునే వారికి కాసుల గలగల. ఇప్పుడు ఈవెంట్ మేనేజ్‌మెంట్ పేరుతో కొందరు జనాలు మార్కెట్లోకి వచ్చాయంటే కిట్టీ పార్టీల తీరేంటో అర్థమవుతోంది.

Also Read..

Lance Naik Sai Teja: లాన్స్ నాయక్ సాయి తేజ కుటుంబానికి అండగా ప్రభుత్వం.. రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలని నిర్ణయం..!

Virat Kohli: బీసీసీఐ నిర్ణయాన్ని సమర్థించిన దిలీప్ వెంగ్‎సర్కార్.. కోహ్లీ టెస్ట్‎లపై దృష్టి పెట్టగలడంటూ వ్యాఖ్యలు..