Lance Naik Sai Teja: లాన్స్ నాయక్ సాయి తేజ కుటుంబానికి అండగా ప్రభుత్వం.. రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలని నిర్ణయం..!

తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన లాన్స్ నాయక్ సాయితేజ కుటుంబానికి ఏపీ ప్రభుత్వం అండగా నిలువనుంది. సాయితేజ కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం....

Lance Naik Sai Teja: లాన్స్ నాయక్ సాయి తేజ కుటుంబానికి అండగా ప్రభుత్వం.. రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలని నిర్ణయం..!
Sai Teja
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Dec 11, 2021 | 12:39 PM

తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన లాన్స్ నాయక్ సాయితేజ కుటుంబానికి ఏపీ ప్రభుత్వం అండగా నిలువనుంది. సాయితేజ కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇందుకు సంబంధించి ఏపీ సీఎం జగన్ గురువారమే అధికారులతో చర్చించినట్లు తెలుస్తుంది. సైనికుడి మరణానికి వెలకట్టామనే భావన రాకూడదని అధికారులకు ముఖ్యమంత్రి స్పష్టం చేసినట్లు సమాచారం. కష్టంలో ఉన్నప్పుడు ఇంత ఆర్థికసహాయం చేస్తున్నామంటూ హడావిడి చేయొద్దన్న సీఎం.. దీనిపై మీడియాలో ఎలాంటి ప్రచారానికి ఆస్కారం ఇవ్వొద్దని అధికారులు చెప్పినట్లు తెలుస్తోంది. ఆ కుటుంబాన్ని నేరుగా కలవాలన్న ముఖ్యమంత్రి.. సీనియర్‌ మంత్రిని పంపి ఆ కుటుంబానికి సానుభూతి తెలిపి, అక్కడే ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని సూచించినట్లు తెలిసింది.

డిసెంబర్ 8వ తేదీన తమిళనాడులో జరిగిన ఆర్మీ హెలికాఫ్టర్ ప్రమాదంలో త్రిదాళపతి బిపిన్ రావత్ కన్నుమూశారు. ఈయనకు వ్యక్తిగత భద్రతాధికారిగా వ్యవహరించిన ఆంధ్రప్రదేశ్‎లోని చిత్తూరు జిల్లా చెందిన లాన్స్ నాయక్ సాయి తేజ ఈ ప్రమాదంలో మరణించారు. అతని భౌతికకాయం నేడు స్వగ్రామం ఎగువరేగడికి తీసుకురానున్నారు. భౌతికకాయం రావడం ఆలస్యమైతే రేపు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. సాయి తేజ దేశ సేవలో తరించాలన్న సంకల్పంతో.. ఎంతో శ్రమించి కలలను సాకారం చేసుకున్నారు. పారా కమాండోగా చెరగని ముద్రవేసి.. త్రిదళాపతి బిపిన్ రావత్‌ను సైతం మెప్పించారు.

లాన్స్ నాయక్ సాయితేజ అకాల మరణం..అతని కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. కష్టపడి జీవితంలో పైకి ఎదిగిన సాయితేజ… ఆకస్మికంగా తనువు చాలించడం.. అందరినీ కలచివేసింది. చిత్తూరు జిల్లా కురబలకోట మండలం ఎగువరేగడ గ్రామానికి చెందిన సాయితేజ చిన్నతనం నుంచి ఎంతో చురుగ్గా ఉంటూ.. అందరికీ ఆదర్శంగా నిలిచారు.

Read Also.. AP Model Schools: ఏపీ మోడల్‌ స్కూళ్లలో ఉద్యోగాలు.. 282 టీచర్‌ పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం..!